రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ కు ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ మ‌రింత ఊతం

దేశీయ ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించేందుకు 101వ‌స్తువుల విష‌యంలో పేర్కొన్న గ‌డువు త‌ర్వాత వాటి దిగుమ‌తుల‌పై నిషేధం

Posted On: 09 AUG 2020 4:59PM by PIB Hyderabad

 

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ 2020 మే 12 న దేశ‌ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ స్వావ‌లంబిత భార‌త‌దేశం కొసం శంఖం పూరించారు. ఈ స్వావ‌లంబ‌న ఆర్ధిక‌, మౌలిక ‌స‌దుపాయాలు, వ్య‌వ‌స్థ‌, జ‌నాభా, డిమాండ్  ఆధారంగా ఉండాల‌ని చెబుతూ, స్వావ‌లంబిత భార‌త‌దేశానికి ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ పేరుతో ఒక ప్ర‌త్యేక ఆర్ధిక ప్యాకేజ్ ని ప్ర‌కటించారు. ప్ర‌ధాన‌మంత్రి ఇచ్చిన పిలుపునందుకుని ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ 101 ఉత్ప‌త్తుల‌ జాబితా త‌యారు చేసింది. వీటి విష‌యంలో దీనితొ జ‌త‌చేసిన అనుబంధంలో ఒక్కొక్క ఐట‌మ్‌కు ఎదురుగా పేర్కొన్న గ‌డువు త‌ర్వాత ఈ ఉత్ప‌త్తుల‌ దిగుమ‌తిపై నిషేధం ఉంటుంది.
ర‌క్ష‌ణ రంగంలో స్వావ‌లంబ‌న దిశ‌గా ఇది పెద్ద ముంద‌డుగు. భార‌త ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌కు ఇది ఒక  మంచి అవ‌కాశం. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వివిధ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసేందుకు ఇది దేశీయ ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ది. త‌మ‌కుగ‌ల స్వీయ అభివృద్ధి సామ‌ర్ధ్యం, స్వంత డిజైన్ తో నెగ‌టివ్ లిస్టులోని వాటిని త‌యారు చేసేందుకు వీటికి వీలు క‌లుగుతుంది. లేదా డిఫెన్సు రిసెర్చి అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌డిఒ) డిజైన్ చేసిన ,అభివృద్ధి చేసిన టెక్నాల‌జీని అందిపుచ్చుకుని రాగ‌ల సంవ‌త్స‌రాల‌లో సాయుధ బ‌ల‌గాల అవ‌స‌రాల‌ను త‌యారు చేయ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది.‌
ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ రూపొందించిన ఈ జాబితాను సైనిక ,వైమానిక‌, నౌకాద‌ళ‌, డిఆర్‌డిఒ, డిఫెన్సు ప‌బ్లిక్ సెక్ట‌ర్ అండ‌ర్ టేకింగ్స్ (డిపిఎస్‌యులు), ఆర్డినెన్సు ఫ్యాక్ట‌రీ బోర్డు(ఒఎఫ్‌బి), ఇత‌ర ప్రైవేటు ప‌రిశ్ర‌మ‌ల‌తో
చ‌ర్చించి రూపొందించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని, వివిధ ఆయుధాలు,మందుగుండు సామ‌గ్రి , ఉప‌క‌ర‌ణాల‌ను భార‌త‌దేశంలోనే త‌యారు చేయ‌డానికి ఈ సంస్థ‌ల‌కు గ‌ల సామ‌ర్ధ్యాన్ని అంచ‌నావేసేందుకు వీరితో చ‌ర్చించారు.
2015 ఏప్రిల్ నుంచి 2020 ఆగ‌స్టు మ‌ధ్య దాదాపు ఇలాంటి ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన 260 స్కీముల‌ను త్రివిధ‌ద‌ళాలు సుమారు 3.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్నాయి. తాజాగా 101 ఉత్ప‌త్తుల‌కు సంబంధించి దిగుమ‌తుల‌పై ఆంక్ష‌లు విధించడంతో , సుమారు 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆర్డ‌ర్లు ఇక దేశీయ సంస్థ‌ల‌కు రానున్న ఐదు నుంచి 7 సంవ‌త్స‌రాల‌లో  ద‌క్క‌నున్నాయి.  ఈ ఐట‌మ్‌ల‌లో సుమారు ఒక్కొక్క‌టి 1,30,000 కోట్ల‌రూపాయ‌ల వంతున సైన్యం వైమానిక దళానికి, 1,40,000 కోట్ల రూపాయ‌ల ఉత్ప‌త్తులు నౌకాద‌ళానికి ఇదే కాలంలో అవ‌స‌రం ఉండ‌నున్నాయి.
 ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ  దిగుమ‌తుల‌పై ఆంక్ష‌ల కోసం రూపొందించిన 101 ఉత్ప‌త్తులు కేవ‌లం సాధార‌ణ విడిభాగాలు కావు. ఇందులో ఆర్టిల‌రీ గ‌న్స్‌, అసాల్ట్ రైఫిల్స్‌, కార్వెట్టీలు, సోనార్ సిస్ట‌మ్‌లు, ట్రాన్స్ పోర్టు ఎయిర్ క్రాఫ్ట్‌లు, తేలిక‌పాటి పోరాట హెలికాప్ట‌ర్లు, రాడార్లు వంటి ర‌క్ష‌ణ రంగానికి పనికి వ‌చ్చే అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించిన‌వి ఉన్నాయి. ఈ జాబితాలో వీల్డు ఆర్ముర్డు ఫైటింగ్ వెహిక‌ల్సు (ఎ ఎఫ్ విలు) ఉన్నాయి . 2021 డిసెంబ‌ర్ త‌ర్వాత దీని దిగుమ‌తులు నిషేధం  ‌. దీనితో సైన్యం సుమారు 5,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గల 200 వాహ‌నాల‌కు దేశీయ సంస్థ‌ల‌నుంచి కాంట్రాక్టు కుదుర్చుకునే అవ‌కాశం ఉంది. అలాగే నౌకాద‌ళం 42,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ఆరు స‌బ్ మెరైన్‌ల‌కు కాంట్రాక్టుకుదుర్చుకోనుంది. స‌బ్‌మెరైన్‌ల‌కు సంబంధించి దిగుమ‌తుల ఆంక్ష‌లు డిసెంబ‌ర్ 2021 నుంచి అమ‌లులో ఉంటాయి.వైమానిక ద‌ళం లైట్ కంబాట్  ఎయిర్‌క్రాఫ్ట్ ఎసిఎ ఎంకె 1 ఎ ను స‌మ‌కూర్చుకోనుంది. వీటికి సంబంధింగి దిగుమ‌తుల‌పై నిషేధం  2020 డిసెంబ‌ర్ నుంచి అమ‌లులోకి రానుంది. ఇందులో రూ 85,000 కోట్ల విలువ‌గ‌ల 123 ఎల్‌సిఎ ఎంకె లు ఎయిర్ ఫొర్సు స‌మ‌కూర్చుకోనుంది. దీనినిబ‌ట్టి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 101 ఉత్ప‌త్తుల‌లో అత్యంత‌ సంక్లిష్ట‌మైన ఉత్ప‌త్తులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మూడు ఉదాహ‌ర‌ణ‌లు పైన పేర్కొన‌డం జ‌రిగింది.

దిగుమ‌తుల‌పై ఆంక్ష‌ల‌ను 2020 డిసెంబ‌ర్ నుంచి 2024 మ‌ధ్య అమ‌లు చేయ‌నున్నారు. ఈ జాబితాను ప్ర‌క‌టించ‌డం వెనుక ఉద్దేశం, భార‌త ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌కు రాగ‌ల రోజుల‌లో సైనిక ద‌ళాల అవ‌స‌రాల‌ను తెలియ‌జేయ‌డం. దీనితో ఆయా ప‌రిశ్ర‌మ‌ల వారు దేశీయంగా ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల త‌యారీలో త‌మ ల‌క్ష్యాల‌ను మ‌రింత గా తెలుసుకోవ‌డానికి వీలు క‌లుగుతుంది.
రక్షణ ఉత్పత్తి సంస్థల ద్వారా ‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ను ప్రోత్సహించడానికి ,సులభతరం చేయడానికి ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌ అనేక పురోగామి  చర్యలను తీసుకుంది.
ప్రతికూల దిగుమతి జాబితా ప్రకారం పరికరాల ఉత్పత్తికి సంబంధించిన టైమ్‌లైన్‌ నెరవేర్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంది.  పరిశ్రమకు చేయూత నివ్వ‌డానికి డిఫెన్స్ స‌ర్వీసెస్ చే ఒక‌ సమన్వయ యంత్రాంగం ఉంటుంది.
ముందుముందు డిఎంఎ , సంబంధిత ప‌క్షాల‌తో చ‌ర్చించిన మీద‌ట దిగుమ‌తుల నిరోధానికి సంబంధించిన మ‌రిన్ని ప‌రిక‌రాల‌ను గుర్తించ‌నుంది.
   నెగ‌టివ్‌జాబితాలోని దేనినీ భ‌విష్య‌త్తులో దిగుమ‌తి చేసుకోకుండా చూడాల‌ని సూచిస్తూ ,  డిఫెన్స్ అక్విజిష‌న్ ప్రొసీజ‌ర్ (డిఎపి)లో కూడా దీనిని ప్ర‌స్తావించ‌డం జ‌రుగుతుంది.

ఇందుకు సంబంధించిన మ‌రో కీల‌క  చ‌ర్య‌లో భాగంగా రక్ష‌ణ మంత్రిత్వ‌శాఖ 2020-21 సంవ‌త్స‌రానికి కేపిట‌ల్ ప్రొక్యూర్‌మెంట్ బ‌డ్జెట్‌ను దేశీయ‌, విదేశీ కాపిట‌ల్ ప్రొక్యూర్ మెంట్ రూట్‌ల‌కు వేరుగా విభ‌జించింది. దేశీయ కేపిట‌ల్ ప్రొక్యూర్‌మెంట్‌ల‌కు సుమారు 52,000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో ప్ర‌త్యేక బ‌డ్జెట్‌ను ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

(దిగుమ‌తుల‌పై నిషేధం విధించిన ర‌క్ష‌ణ ఆయుధాలు, ప్లాట్‌ఫాంల జాబితా)

 

****(Release ID: 1644767) Visitor Counter : 264