హోం మంత్రిత్వ శాఖ

భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే పునాది, దానిని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం ఆరేళ్లుగా కృషి చేస్తోంది: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టాం. ప్రధాని మోదీ అవిశ్రాంత కృషి వల్ల భవిష్యత్తులో భారత వ్యవసాయ రంగం ప్రపంచ స్థాయికి చేరుతుంది: అమిత్‌ షా

శీతల గోదాములు, సేకరణ, శుద్ధి కేంద్రాల వంటి ఎన్నో మౌలిక సదుపాయాల ఏర్పాటును 'వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి' వేగవంతం చేస్తుంది. దీనివల్ల కష్టపడే రైతులు తమ ఉత్పత్తులకు నిజమైన మూల్యం పొందుతారు: అమిత్‌ షా

'వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి' కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది: అమిత్‌ షా

రూ.లక్ష కోట్లతో 'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి'ని ప్రారంభించడంతోపాటు, వ్యవసాయ రంగం&గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 'పీఎం-కిసాన్‌' పథకం కింద రూ.17 వేల కోట్లను 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి మళ్లించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అమిత్‌ షా

Posted On: 09 AUG 2020 3:32PM by PIB Hyderabad

లక్ష కోట్ల రూపాయలతో 'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి'ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయం&గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 'పీఎం-కిసాన్‌' పథకం కింద 17 వేల కోట్ల రూపాయలను 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి మళ్లించినందుకు కూడా ధన్యవాదాలు చెబుతూ వరుస ట్వీట్లు చేశారు.

    శీతల గోదాములు, సేకరణ, శుద్ధి కేంద్రాల వంటి ఎన్నో మౌలిక సదుపాయాల ఏర్పాటును 'వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి' వేగవంతం చేస్తుంది. దీనివల్ల కష్టపడే రైతులు తమ ఉత్పత్తులకు నిజమైన మూల్యం పొందుతారు. 'వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి' కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ట్వీట్‌లో అమిత్‌ షా పేర్కొన్నారు.

    భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే పునాది. ఆ పునాదిని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం ఆరేళ్లుగా కృషి చేస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టాం. ప్రధాని మోదీ అవిశ్రాంత కృషి వల్ల భవిష్యత్తులో భారత వ్యవసాయ రంగం ప్రపంచ స్థాయికి చేరుతుంది అంటూ అమిత్‌ షా తన ట్వీట్‌లో విశ్వాసం వ్యక్తం చేశారు.



(Release ID: 1644607) Visitor Counter : 141