రైల్వే మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మరియు శ్రీ పీయూష్ గోయల్ ఇతర ప్రముఖులతో కలసి "కిసాన్ రైలు"కు జెండా ఊపి ప్రారంభించారు. మహారాష్ట్ర లోని దేవలాలి నుంచి బీహార్ లోని దానాపూర్ వరకు నడిచే ఈ ప్రత్యేక పార్సెల్ రైలు దేశంలోనే మొట్టమొదటి "కిసాన్ రైలు" .

"దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా రవాణా చేయడంలో కిసాన్ రైలు గణ నీయమైన మార్పులు తెస్తుంది" -- శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

"దేశం కోవిడ్ సవాళ్ళను ఎదుర్కోవడంలో భారతీయ రైల్వేలు మరియు భారత రైతులు ముందున్నారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ఆహార ధాన్యాల రవాణా రెట్టింపైంది. కిసాన్ రైలు ప్రారంభం రైతులను సంపన్నులను చేసే చర్య" -- శ్రీ పీయూష్ గోయల్

"కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కిసాన్ రైలు ద్వారా ఆపిల్ పళ్ళు రవాణా జరిగే రోజు కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నాను" -- శ్రీ పీయూష్ గోయల్

Posted On: 07 AUG 2020 3:35PM by PIB Hyderabad

 

ఈ రైలు ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా నశ్వర ఉత్పత్తుల సరఫరా జరగడం వల్ల రైతులకు ఎంతో సహాయకారి అవుతుంది.  ఈ ప్రత్యేక రైలులో కూడా సాధారణ రైలులో పార్సెల్లకు తీసుకున్నట్లే రవాణా చార్జీలు  సాధారణ రైలు వలె 'పి' ప్రమాణంలో ఉంటాయి. 

భారతీయ రైల్వేలు దేశంలో మొట్టమొదటి "కిసాన్ రైలు"ను ఈ రోజు  07/08/2020న దేవలాలి నుంచి దానాపూర్ కు దేవలాలి నుంచి ప్రారంభించింది.  ఈ రైలును వీడియో కాన్ఫరెన్సు ద్వారా  కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ,  గ్రామీణాభివృద్ధి మరియు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మరియు  రైల్వేలు మరియు వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రారంభించారు.  
ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ సి. అంగది,  కేంద్ర  పంచాయత్ రాజ్, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ పరుషోత్తం ఖోడాభాయ్ రూపాల,  కేంద్ర  వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి,  కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ,  ఆహారం ప్రజాపంపిణీ శాఖ  సహాయ మంత్రి శ్రీ రావ్ సాహెబ్ పాటిల్ దన్వే,  మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్,  మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల రక్షణ శాఖ మంత్రి చగన్  భుజబల్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.  
ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది.   ఆరంభంలో ఈ ప్రత్యేక రైలు  10+1 వ్యాగన్లతో నడుస్తుంది.   ఈ రైలు దానాపూర్ కు  రేపు సాయంత్రం 18-45 కు చేరుతుంది.   దాదాపు 1519 కిలోమీటర్ల దూరాన్ని 31:45 గంటల్లో చేరుతుంది. 

 

ఈ సందర్బంగా మాట్లాడుతూ " రైతులకు ఇది ఎంతో ఘనమైన రోజు.  కిసాన్ రైలును బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది.  వ్యవసాయ ఉత్పత్తులను వీలయినంత ఎక్కువగా పంపిణీ చేయడం అవసరం.  తద్వారా మంచి రాబడి లభిస్తుంది.  భారతీయ రైతులు ఎలాంటి  వైపరీత్యాన్నయినా, సవాలు నైనా  ఎదుర్కొని నిలుస్తామని రుజువు చేశారు.  కిసాన్ రైలు ద్వారా దేశంలో ఒక మూల నుంచి మరొక మూలకు వ్యవసాయ ఉత్పత్తులు చేరేలా నిశ్చయపరుస్తుంది.  ఈ రైలు వాళ్ళ రైతులతో పాటు వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుంది"  అని మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.  

దేశవ్యాప్తంగా  వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా రవాణా చేయడంలో కిసాన్ రైలు గణ నీయమైన మార్పులు తెస్తుందని చెప్తూ  కోవిడ్ మహమ్మారి కాలంలో ఆహార ధాన్యాల సరఫరా నిరంతరం జరిగేలా చూసినందుకు శ్రీ తోమర్ రైల్వేలను ప్రశంసించారు.  

ఈ సందర్బంగా మాట్లాడుతూ " భారతీయ రైల్వేలు తమ రైళ్లను రైతుల సేవలో ఉంచాయని,   ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు  ఇచ్చిన స్ఫూర్తి ,  మార్గదర్శకత్వంలో రైల్వేలు కిసాన్ రైలు ప్రారంభించాయి.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో ఈ రైలు ఒక మైలు  రాయి కాగలదు. దేశం కోవిడ్ మహమ్మారి తెచ్చిన సవాళ్ళను ఎదుర్కోవడంలో భారతీయ రైల్వేలు మరియు  రైతులు ముందున్నారు.  కోవిడ్ కాలంలో ఆహార ధాన్యాల రవాణా రెట్టింపైంది.  మున్నెన్నడూ లేని రీతిలో రైతుల ప్రయోజనాల కోసం పాటు పడటం జరుగుతోంది.  కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కిసాన్ రైలు ద్వారా ఆపిల్ పళ్ళు రవాణా జరిగే రోజు కోసం నేను ఆతృతతో ఎదురుచూస్తున్నాను"  అని మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.  

సెంట్రల్ రైల్వేలో భూసావల్ డివిజన్ ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం.   నాసిక్ మరియు దాని చుట్టుపక్క ప్రాంతాలలో  భారీ ఎత్తున తాజా కూరగాయలు,  పళ్ళు, పూలు, ఇతర నశ్వర వస్తువులు,  ఉల్లిగడ్డ మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు పండుతాయి. ఈ సాశ్వర వస్తువులను ప్రధానంగా  పాట్నా చుట్టుపక్కల ప్రాంతాలకు, ప్రయాగరాజ్, కాట్ని, సాత్నా మొదలగు చోట్లకు రవాణా చేస్తుంటారు.  

ఈ కిసాన్ రైలుకు  నాసిక్ రోడ్డు,  మన్మాడ్, జల్గావ్,  భూసావల్,  బుర్హాన్ పూర్, ఖాండ్వా, ఇటార్సి,  జబల్పూర్ , సాత్నా, కాట్ని , మాణికపూర్ , ప్రయాగరాజ్ చౌకి , పండిట్ దీన్ దయాల్ నగర్  మరియు బక్సర్

ప్రధాన రైల్వే స్టేషన్ల మధ్య ప్రతి టన్ను సరుకులను చేరవేసేందుకు అయ్యే చార్జీలు ఈ విధంగా ఉన్నాయి


నాసిక్ రోడ్డు /దేవలాలి  నుంచి దానాపూర్    రూ.  4001

మన్మాడ్ నుంచి  దానాపూర్ రూ. 3849

జల్గావ్ నుంచి  దానాపూర్  రూ. 3513

భూసావల్ నుంచి దానాపూర్ రూ. 3459

బురుహాన్ పూర్ నుంచి దానాపూర్ రూ. 3323

ఖాండ్వా నుంచి దానాపూర్ రూ. 3148

కిసాన్ రైలు ప్రారంభం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది భారతీయ రైల్వేల లక్ష్యం.  కూరగాయలు, పళ్ళ వంటి నశ్వర వ్యవసాయ ఉత్పత్తులను స్వల్ప కాలంలో మార్కెట్ కు చేరవేయడంలో  ఈ రైలు రైతులకు తోడ్పడుతుంది. శీతల కంటెయినర్లు అమర్చిన ఈ రైలు ఎలాంటి అంతరాయం లేకుండా చేపలు, మాంసం, పాల వంటి నశ్వర వస్తువులను కూడా చేరవేయవచ్చు.  

గతంలో భారతీయ రైల్వేలు ఏదైనా ఒకే ఆహార వస్తువును తీసుకెళ్లే అరటిపళ్ళ స్పెషల్ వంటి  ప్రత్యేక రైళ్లను నడిపేవి.   అనేక రకాల పళ్ళను, కూరగాయలను  తీసుకెళ్లే ప్రత్యేక రైళ్లను నడపడం ఇదే మొదటిసారి.  ఈ రైళ్లలో దానిమ్మ, అరటి, ద్రాక్ష మొదలగు పళ్ళు మరియు కాప్సికం, కాలిఫ్లవర్,  మునగ, కాబేజీ, ఉల్లిగడ్డ,  పచ్చిమిర్చి మొదలగు కూరగాయలు రవాణా అవుతున్నాయి.  

స్థానిక రైతులు,  సరుకు రవాణా చేసేవారు,  వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు,  వ్యక్తులతో దూకుడుగా మార్కెటింగ్ జరుపుతున్నారు. మొత్తం డిమాండ్ ఎంత ఉంటుందో సమష్టిగా లెక్క వేస్తున్నారు.  మామూలు రైలు మాదిరిగానే సరుకుల రవాణా చార్జీలు ఉన్నందున రైతులు ఈ ప్రత్యేక రైలు ద్వారా తమ ఉత్పత్తులను పంపడానికి ఇష్టపడవచ్చు. రైతులకు ఇది ఎంతో సహాయకారిగా ఉంటుంది.   మామూలు రైలు మాదిరిగానే ( 'పి' స్కెలులో )  రవాణా చార్జీలు ఉంటాయి.  

***(Release ID: 1644224) Visitor Counter : 245