హోం మంత్రిత్వ శాఖ

"చేనేత కార్మికుల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది": కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా

"కష్టించే నేతన్నల నైపుణ్యాలు మొదటిసారిగా 2014 నుంచి పెరుగుతున్నాయి, వారికి తగిన గుర్తింపు దక్కుతోంది": అమిత్‌ షా

"చేనేత కార్మికులను అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడానికి ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా 2015లో ప్రధాని ప్రకటించారు": అమిత్‌ షా

"ప్రధాని పిలుపునిచ్చిన 'ఓకల్‌ ఫర్‌ లోకల్‌', చేనేత రంగ ఆత్మస్థైర్యాన్ని కచ్చితంగా పెంచుతుంది": అమిత్‌ షా

"ప్రధాని కలలుగన్న స్వావలంబన భారత్‌ను నిజం చేసేందుకు, "ఓకల్‌ ఫల్‌ హ్యాండ్‌లూమ్‌"కు మద్దతుగా మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం": అమిత్‌ షా

Posted On: 07 AUG 2020 2:29PM by PIB Hyderabad

చేనేత కార్మికుల అభివృద్ధికి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా స్పష్టం చేశారు. కష్టించే నేతన్నల నిజమైన నైపుణ్యాలు మొదటిసారిగా 2014 నుంచి పెరుగుతున్నాయని, వారికి తగిన గుర్తింపు దక్కుతోందని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. చేనేత కార్మికులను మరింత ప్రోత్సహించేందుకు, వారిని భారత అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడానికి ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా 2015లో ప్రధాని ప్రకటించారని వెల్లడించారు.

    ప్రధాని పిలుపునిచ్చిన 'ఓకల్‌ ఫర్‌ లోకల్‌', చేనేత రంగ ఆత్మస్థైర్యాన్ని కచ్చితంగా పెంచుతుందని అమిత్‌ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని కలలుగన్న స్వావలంబన భారత్‌ను నిజం చేసేందుకు, "ఓకల్‌ ఫల్‌ హ్యాండ్‌లూమ్‌"కు మద్దతుగా మనమంతా ప్రతిజ్ఞ చేద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

***



(Release ID: 1644139) Visitor Counter : 159