యు పి ఎస్ సి

సివిల్స్‌‌-2019 పరీక్షలకు సంబంధించి యూపీఎస్‌సీ స్పష్టత

Posted On: 06 AUG 2020 1:13PM by PIB Hyderabad

 సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌‌-2019 కి ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలకు సంబంధించి, తక్కువ సంఖ్యలోని సిఫారసు అభ్యర్థుల గురించి కొంత తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతున్నట్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) దృష్టికి వచ్చింది.
    
    ఖాళీల భర్తీ కోసం, భారత ప్రభుత్వం సూచించిన విధంగా పరీక్ష నిబంధనలను కమిషన్‌ తు.చ. తప్పకుండా పాటిస్తుంది. సివిల్స్‌-2019కి సంబంధించి 927 ఖాళీలు ఉన్నాయి. మొదటి దశలో 829 మంది అభ్యర్థుల ఫలితాలు విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ రూల్స్‌-2019ని అనుసరించి, 16 (4) & (5) నిబంధన ప్రకారం రిజర్వ్‌ లిస్ట్‌ను కూడా రూపొందించింది.

    ఒకవేళ రిజర్వ్‌ కేటగిరీలోని వ్యక్తి జనరల్‌ కేటగిరీలో ఎంపికై, తన ఇష్టప్రకారం సర్వీస్‌, క్యాడర్‌ను ఎంచుకుంటే, తద్వారా ఖాళీ అయిన స్థానాన్ని రిజర్వ్‌ కేటగిరీ నుంచే భర్తీ చేస్తారు. ఇది దశబ్దాలుగా జరుగుతున్న ప్రమాణిక ప్రక్రియ. రిజర్వ్‌ జాబితాలో సరిపడినంత మంది రిజర్వ్‌ కేటగిరీ అభ్యర్థులు ఉంటారు. పైన చెప్పినట్లు, రిజర్వ్‌ అభ్యర్థి ఎవరైనా జనరల్‌ విభాగంలో ఎంపికై సర్వీసును ఎంచుకుంటే ఏర్పడే కొరతను పూరించడానికి కూడా సరిపడా అభ్యర్థులతో రిజర్వ్‌ జాబితా ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు రిజర్వ్‌ జాబితాను రహస్యంగా ఉంచడం, సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ రూల్స్‌-2019లోని 16(5) నిబంధన ప్రకారం యూపీఎస్సీ విధి.


(Release ID: 1644115) Visitor Counter : 271