ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో కోవిడ్ నుంచి కోలుకున్న వారు 13.2 లక్షలు;

వైరస్ సోకిన వారిలో 67.62 శాతంగా నమోదు

పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య తగ్గుముఖం, 2.07% కు చేరిక

Posted On: 06 AUG 2020 2:37PM by PIB Hyderabad

కోవిడ్ -19 నుంచి కోలుకున్నవారి సంఖ్య 13,28,336 కు చేరింది. అందులో గత 24  గంటల్లో కోలుకున్నవారు 46,121  మంది. అలా అదే పనిగా కోలుకుంటూ ఉండటంతో బాధితుల సంఖ్యకూ, కోలుకున్నవారికీ మధ్య అంతరం 7,32,835 కు చేరింది. ఆ విధంగా కోలుకున్నవారి శాతం 67.62% అయింది.

ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 5,95,501 కాగా అది మొత్తం పాజిటివ్ కేసుల్లో 30.31% గా నమోదైంది. వీరంతా ఆస్పత్రులలో గాని ఇళ్ళలో ఐసొలేషన్ లో గాని ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో చికిత్స పొందుతున్నవారి శాతం జులై 24న 34.17% ఉండగా గణనీయంగా తగ్గుతూ ప్రస్తుతం 30.31% కు తగ్గింది.

WhatsApp Image 2020-08-06 at 11.02.54.jpeg



కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనుసరిస్తున్న సమగ్ర వ్యూహం ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో వనరులన్నీ కలిపి వాడటం సత్ఫలితాలనిచ్చింది. " పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు " అనే వ్యూహం అమలు చేయటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఆస్పత్రుల మౌలికసదుపాయాలు పెంచటం, పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచటం,  ప్రామాణిక విధానాల ద్వారా చికిత్స మీద ప్రత్యేకంగా దృష్టి సారించటం వలన మరణాల సంఖ్య బాగా అదుపులోకి వచ్చింది. అంతర్జాతీయ పరిస్థితితో పోల్చినప్పుడు భారత్ మెరుగైన స్థితిలో ఉంది. క్రమంగా మరణాల శాతం తగ్గుతూ నేటికి అది 2.07% చేరింది.


కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

WhatsApp Image 2020-08-06 at 11.02.53.jpeg


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf


 

****


(Release ID: 1643856) Visitor Counter : 232