హోం మంత్రిత్వ శాఖ

అయోధ్య‌లోరామ మందిర భూమి పూజ చ‌రిత్రాత్మ‌కం, ఇది భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మైన రోజు : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
అద్భుత‌ రామ మందిర నిర్మాణానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చే భూమిపూజ‌, శంకుస్థాప‌న ఉత్స‌వం భార‌తీయ సంస్కృతి నాగ‌రిక‌త చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించింది.ఇది న‌వ‌శ‌కానికి నాంది.

“కోట్లాదిమంది ప్ర‌జ‌ల విశ్వాసాన్ని గౌర‌వించి, రామ‌మందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వ‌హించినందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీజీకి, శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్‌కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.”

“రామ‌మందిర నిర్మాణంతో, అయోధ్య పుణ్య‌భూమి మ‌రోసారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న పూర్వ వైభ‌వాన్ని పొందుతోంది. ధ‌ర్మం‌, అభివృద్ధి రెండూ ఒక చోట చేరి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాయి.”

“ మ‌హాధ్భుత‌మైన ప్ర‌భు శ్రీ‌రామ మందిర నిర్మాణం , ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీజీ బ‌ల‌మైన‌, నిర్ణ‌యాత్మ‌క నాయ‌క‌త్వానికి ప్ర‌తిబింబం”
“మ‌రిచిపోలేని ఈ అద్భుత రోజున భార‌తీయులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం భార‌తీయ సంస్కృతి సంప్ర‌దాయాల ప‌రిర‌క్ష‌ణ‌కు ఎల్ల‌ప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉంటుంది.”
“ స‌నాత‌న వార‌స‌త్వ ప‌రిర‌క్ష‌ణ‌కు పోరాడిన వారంద‌రికీ శిర‌సువంచి న‌మ‌స్క‌రిస్తున్నాను”

Posted On: 05 AUG 2020 8:35PM by PIB Hyderabad

 

అయోధ్య‌లోరామ మందిర భూమి పూజ చ‌రిత్రాత్మ‌కం, భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మైన రోజు అని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.  ఇందుకు సంబంధించి ట్విట్ట‌ర్ ద్వారా ప‌లు సందేశాలు ఇస్తూ ఆయ‌న‌,  రాముడి జ‌న్మ‌స్థ‌లంలో ,అద్భుత‌ రామ మందిర నిర్మాణానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చే భూమిపూజ‌, శంకుస్థాప‌న ఉత్స‌వం జ‌ర‌గ‌డం భార‌తీయ సంస్కృతి నాగ‌రిక‌త చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించిందని ,ఇది న‌వ‌శ‌కానికి నాంది అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం ప్ర‌పంచ‌వ్యాప్తంగా శ‌తాబ్దాల త‌ర‌బ‌డి హిందువుల విశ్వాసానికి ప్ర‌తీక అని అంటూ శ్రీ అమిత్ షా“ “కోట్లాదిమంది ప్ర‌జ‌ల విశ్వాసాన్ని గౌర‌వించి, రామ‌మందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వ‌హించినందుకు   ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీజీకి, శ్రీ  రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్‌కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను” అని అన్నారు.

“శ్రీ‌రామ‌చంద్ర ప్ర‌భు ఆద‌ర్శాలు, ఆలోచ‌న‌లు భార‌తీయ ఆత్మ‌లో ఉన్నాయి, ఆయ‌న వ్య‌క్తిత్వం, తాత్విక‌త భార‌తీయ సంస్కృతికి పునాది  . రామ మందిర నిర్మాణంతో అయోధ్య ప‌విత్ర‌భూమి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రోసారి త‌న పూర్వ వైభ‌వాన్ని పొందుతుంది. ధ‌ర్మం, అభివృద్ధి క‌లిసి అక్క‌డ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాయి” అని ఆయ‌న అన్నారు.

“ ఈ మ‌రపురాని రోజు భార‌తీయులంద‌రికీ శుభాకాంక్ష‌లు.  మ‌హాధ్భుత‌మైన ప్ర‌భు శ్రీ‌రామ మందిర నిర్మాణం , ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీజీ బ‌ల‌మైన‌, నిర్ణ‌యాత్మ‌క నాయ‌క‌త్వానికి ప్ర‌తిబింబం. శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం భార‌తీయ సంస్కృతి సంప్ర‌దాయాలు, దాని విలువ‌ల‌ ప‌రిర‌క్ష‌ణ‌కు ఎల్ల‌ప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉంటుంది.” అని ఆయ‌న తెలిపారు.
“ ప్ర‌భు శ్రీ‌రామ మందిర నిర్మాణం, శ‌తాబ్దాలుగా ఎంద‌రో రామ‌భ‌క్తుల త్యాగాలు , నిరంత‌ర పోరాట‌ల ఫ‌లితం.  స‌నాత‌న  వార‌సత్వం కోసం ఏళ్ళ‌త‌ర‌బ‌డి పోరాడిన వారంద‌రికీ నేను శిర‌సువంచి న‌మ‌స్క‌రిస్తున్నాను, జై శ్రీరామ్ !” అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు

***(Release ID: 1643833) Visitor Counter : 22