పర్యటక మంత్రిత్వ శాఖ
కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రపంచ స్థాయి "తెంజాల్ గోల్ఫు రిసార్ట్" ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాజెక్టును స్వదేశ్ దర్శన్ స్కిం కింద మిజోరాంలో ఏర్పాటు చేశారు.
Posted On:
04 AUG 2020 3:08PM by PIB Hyderabad
కేంద్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ (స్వతంత్ర) సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ చాక్షుష పద్ధతిలో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ వారి స్వదేశ్ దర్శన్ స్కిం కింద అమలు చేస్తున్న "తెంజాల్ గోల్ఫు రిసార్ట్" ప్రాజెక్టును ప్రారంభించారు. ఢిల్లీలో మంగళవారం మిజోరాం పర్యాటక మంత్రి శ్రీ రాబర్ట్ రోమావియా రోయటే మరియు మిజోరాం ప్రభుత్వ పర్యాటక శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి శ్రీమతి ఈస్తర్ లాల్ రాల్కిమి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
స్వదేశ్ దర్శన్ లో భాగంగా రూపొందించిన కొత్త ఎకో టూరిజం సమగ్ర అభివృద్ధి కింద ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. ఈశాన్య పర్యాటక వలయంలో తెంజాల్ వద్ద ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ. 92.25 కోట్లు కాగా దానిలో రూ. 64.48 కోట్లను తెంజాల్ వద్ద గోల్ఫు కోర్సు ఏర్పాటుతో పాటు అవసరమైన విడిభాగాల కొనుగోలుకు మంజూరు చేయడం జరిగింది.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు గోల్ఫు పర్యాటకానికి ఇండియాలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. దానికి తోడు మనోహరమైన పచ్చికబయళ్ళు, ప్రకృతి దృశ్యాలు, అరుదైన ఆతిధ్య సేవలు గోల్ఫు పర్యాటకానికి అదనంగా ఉంటాయి. ఇతర దేశాలతో పోల్చితే ఇది అసాధారణమైన అనుభూతి. దేశవ్యాప్తంగా 230కి పైగా గోల్ఫు కోర్సులు ఉన్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలో గోల్ఫు పర్యాటక రంగం అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తూ గట్టి మద్దతు ఇస్తోంది. దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలు గల ఎన్నో గోల్ఫు కోర్సులు ఉన్నాయి. అక్కడ జరిగే గోల్ఫు పోటీలు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. గోల్ఫు పర్యాటకం పట్ల రోజు రోజుకు పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని దానిని ప్రోత్సహించడానికి తద్వారా దేశీయ, అంతర్జాతీయ యాత్రికులను ఆకర్షించడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర మరియు సమన్వయ వ్యవస్థను రూపొందిస్తున్నది.
తెంజాల్ లోని గోల్ఫు కోర్సును కెనడాకు చెందిన పేరొందిన అగ్రశ్రేణి గోల్ఫు కోర్సుల వాస్తు సంస్థ గ్రాహం కుక్ అసోసియేట్స్ రూపకల్పన చేసింది. ఈ కోర్సు మొత్తం విస్తీర్ణం 105 ఎకరాలు. దానిలో క్రీడా స్థలం 75 ఎకరాలన్నా 18 హోల్ గోల్ఫు కోర్సు. యంత్రాలతో నీళ్లు చల్లే తుంపర సేద్యం వ్యవస్థ ఉంది. దీనిని అమెరికాకు చెందిన రెయిన్ బర్ద్ సంస్థ ఏర్పాటు చేసింది. మొత్తం మీద గోల్ఫు కోర్సును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. క్రీడా ప్రాంగణం పక్కనే బస చేయడానికి పర్యావరణ హితమైన 30 కుటీరాలు, కేఫ్ టేరియా, ఆరుబయలు ఫుడ్ కోర్టు, రిసెప్షన్, వేచియుండే హాలు మొదలగునవి ఉన్నాయి. అన్నీ ప్రపంచ స్థాయి గృహోపకరణములు ఉంటాయి.
తెంజాల్ గోల్ఫు కోర్సు ప్రత్యేకత ఏమిటంటే చౌకలో అంతర్జాతీయ సౌకర్యాలతో మెరుగైన అనుభూతిని కలుగజేస్తుంది.
***
(Release ID: 1643426)
Visitor Counter : 419