రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్రజా ఫిర్యాదుల విశ్లేషణకు ఐఐటీ కాన్పూర్‌, 'ఏఆర్‌పీజీ' డిపార్టుమెంటుతో రక్షణ మంత్రిత్వ శాఖ త్రైపాక్షిక అవగాహన ఒప్పందం

Posted On: 04 AUG 2020 1:56PM by PIB Hyderabad

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ విభాగం (డీవోడీ), 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌ &పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌' (డిఏఆర్‌పీజీ), ఐఐటీ కాన్పూర్‌ మధ్య, 'రక్షణ శాఖ' మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, 'సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ' మంత్రి శ్రీ డా.జితేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ పట్ల మంత్రులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
    రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి వెబ్‌ ఆధారిత 'సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ రెడ్రెస్‌ & మానిటరింగ్‌ సిస్టం' (సీపీజీఆర్‌ఏఎంఎస్‌) ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులపై తులనాత్మక విశ్లేషణలు అందించేలా కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) సాంకేతికతలను ఐఐటీ కాన్పూర్‌ రూపొందించేలా ఈ ఎంవోయూ చూస్తుంది. ప్రజా ఫిర్యాదులపై విధాన  కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నోడల్‌ విభాగంగా వ్యవహరించడంతోపాటు, 'సీపీజీఆర్‌ఏఎంఎస్‌' పోర్టల్‌లోని సమాచారాన్ని సంరక్షిస్తున్న డీఏఆర్‌పీజీ, రక్షణ శాఖకు చెందిన ప్రజా ఫిర్యాదుల సమాచారాన్ని ఐఐటీ కాన్పూర్‌కు పంపుతుంది. ఆ సమాచారాన్ని ఐఐటీ కాన్పూర్‌ విశ్లేషిస్తుంది.
 
    ప్రజా ఫిర్యాదుల కారణాలు, స్వభావాలను గుర్తించడానికి; అవసరమైన వ్యవస్థాపరమైన మార్పులు, విధానపర చర్యలు చేపట్టడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది.

***



(Release ID: 1643360) Visitor Counter : 194