శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సార్స్-సీఓవీ-2పై జినోమ్ సీక్వెన్సింగ్ తొలి ప్రక్రియ విజయవంతం: హర్షవర్ధన్.

కోవిడ్ -19పై పోరుకు దోహదపడే ఆసక్తికర ఫలితాలను
తాజా డాటా విశ్లేషణ అందించవచ్చని ఆశాభావం.

కోవిడ్-19పై పోరుకు ఐదు బయో రిపాజిటరీల ప్రారంభం.

వాటిని జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి.

ఐదు రిపాజిటరీలను రికార్డు వ్యవధిలో ఏర్పాటు చేసిన బయోటెక్నాలజీ విభాగం

Posted On: 01 AUG 2020 4:40PM by PIB Hyderabad

    కరోనా మహమ్మారి (సార్స్-సీఓవీ-2 ) పుట్టుక, సంక్రమణ క్రమాన్ని తెలుసుకునే లక్ష్యంతో చేపట్టిన పాన్ ఇండియా 1000 జినోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమం, భూ విజ్ఞాన శాస్త్రాల అధ్యయన శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రోజు ప్రకటించారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంపై బయోటెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ పరిశ్రమల పరిశోధనా సహాయక మండలి (బి..ఆర్..సి.), బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థలు చేపట్టిన కార్యకలాపాలపై సమీక్షా సమావేశం  సందర్భంగా కేంద్ర మంత్రి   ప్రకటన చేశారు. కోవిడ్-19పై పరిశోధనకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు బయో రిపాజిటరీలను సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. బయెటెక్నాలజీ విభాగం రికార్డు వ్యవధిలో రిపాజిటరీలను ఏర్పాటు చేసింది. ఫరీదాబాద్ లోని  ట్రాన్సేషనల్ హెల్త్ సైన్స్, టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్, భువనేశ్వర్ లోని లైఫ్ సైన్సెస్ ఇన్ స్టిట్యూట్, న్యూఢిల్లీలోని లివర్ అండ్ బైలరీ సైన్సెస్ ఇన్ స్టిట్యూట్, పూణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, బెంగళూరులోని స్టెమ్ సెల్ సైన్స్ ఇన్ స్టిట్యూట్ లలో బయోరిపాజిటరీలను ఏర్పాటు చేశారు. కోవిడ్-19 మహమ్మారి ఉపశమించేలా చేసేందుకు బయోటెక్నాలజీ విభాగం చేస్తున్న నిర్విరామ పోరాటం అభినందనీయమని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.

  కోవిడ్-19పై జరిగే పరిశోధన ప్రజారోగ్యం దృష్ట్యా  ప్రాముఖ్యం కలిగిన అంశం కాబట్టి కోవిడ్ సంక్రమణంపై పరిశోధనకు సంబంధించిన సమాచాారాన్ని ప్రపంచ స్థాయి వేదికపై పంచుకుంటామని, ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వైరస్ సంక్రమణంపై డాటాబేస్ లో నిక్షిప్తమయ్యే సమాచారం,.. వైరస్ వ్యాప్తిపై మన అవగాహనను మెరుగుపరుస్తుందని, వైరస్ వ్యాప్తి క్రమాన్ని అడ్డుకోవడానికి దోహదపడుతుందని, దీనితో కొత్త కేసులను నివారించవచ్చని, పరిశోధనను మరింత బలోపేతం చేయవచ్చని డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న డాటా విశ్లేషణ ప్రక్రియ మరిన్ని ఆసక్తికరమైన ఫలితాలను అందించే అవకాశాలు ఉన్నాయని, కోవిడ్-19పై మన పోరాటానికి ఇది దోహదపడుతుందని అన్నారు.

     కోవిడ్ వైరస్ నిరోధం లక్ష్యంగా ప్రస్తుతం 16 వ్యాక్సీన్ల రూపకల్పన,  ప్రయోగాత్మక పరీక్షల ప్రక్రియ వివిధ దశల్లో సాగుతోందన్నారు. బి.సి.జి. వ్యాక్సీన్ మూడవ దశ పరీక్షల్లో ఉందని, జైడస్ క్యాడిలా డిఎన్. వ్యాక్సీన్ 1-2 దశల్లో ఉందని, పరీక్షల్లో వివిధ దశల్లో ఉన్న టీకా మందులు (వ్యాక్సీన్లు) ప్రీ క్లినికల్ పరీక్షల్లో పురోగమనంలో ఉన్నాయని చెప్పారు. ఐదు మంచి క్లినికల్ పరీక్షల కేంద్రాలను రూపొందించామని, వ్యాక్సీన్ రూపకల్పనకు సంబంధించి ఆరు జంతు నమూనాలు కూడా ప్రయోగాత్మక పరీక్షలకు సిద్ధంగా ఉన్నాయని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు

  బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో పాన్ ఇండియా 1000 సార్స్--సీఓవీ-2 ఆర్.ఎన్ఏ జినోమ్ సీకెన్సింగ్ ప్రక్రియ ఏడాది మేనెలలో ప్రారంభమైందని, జాతీయ పరిశోధనాలయాలు, క్లినికల్ సంస్థలతో కలసి బయోటెక్నాలజీ విభాగానికి చెందిన స్వయంతప్రతిపత్తి సంస్థలు ప్రక్రియను చేపట్టాయని చెప్పారు.   

     జినోమ్ సీక్వెన్సింగ్, విశ్లేషణ ప్రక్రియ కోసం కల్యాణి ప్రాంతానికి చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్, పశ్చిమ బెంగాల్, ఐదు ఇతర జాతీయ సంస్థల క్లస్టర్లతో కూడిన వేదిక సమన్వయంతో పనిచేస్తోందిభువనేశ్వర్ కు చెందిన లైఫ్ సైన్సెస్ ఇన్ స్టిట్యూట్, హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డి.ఎన్.. ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్, బెంగళూరుకు చెందిన స్టెమ్ సెల్ సైన్స్ ఇన్ స్టిట్యూట్, బెంగళూరు ఇండియన్ సైన్స్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన నేనల్ బయోలాజికల్ సైన్సెస్ సెంటర్, పూణెకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ సంస్థలు జినోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఇదే ప్రక్రియకు మరిన్ని జాతీయ పరిశోధనా సంస్థలు, క్లినికల్ సంస్థలు సహకారం అందిస్తున్నాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి (.సి.ఎం.ఆర్.), జాతీయ కలరా, తదితర వ్యాధుల అధ్యయన సంస్థ, కోల్కతాకు చెందిన స్నాతకోత్తర  వైద్య విద్యా సంస్థ, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుషీకేశ్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), ఢిల్లీలోని మౌలానా ఆజాద్ వైద్య కళాశాల, ఫరీదాబాద్ లోని ట్రాన్సేషనల్ హెల్త్ సైన్సెస్, టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్, ఔరంగాబాద్ లోని గ్రాంట్ వైద్య కళాశాల, వార్ధాలోని మహాత్మా గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, పూణెలోని సాయుధ బలగాల వైద్య కళాశాల, బైరాంజీ జీజీబాయి ప్రభుత్వ వైద్య కళాశాల తదితర వైద్యశాలలు, జినోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియకు సహకారాన్ని అందిస్తున్నాయి 

   ఆర్.టి. పి.సి.ఆర్. పరీక్ష ద్వారా కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి నాసికాపుటాలనుంచి, నోటి లాలాజలంనుంచి సేకరించిన స్వాబ్ నమూనాలపై జీనోమ్ సీక్వెన్సింగ్ పరిశోధనా ప్రక్రియ తొలి లక్ష్యాన్ని వివిధ పరిశోధనా సంస్థల కన్సార్షియం ఇప్పటికే సాధించింది. దేశంలో వివిధ జోన్ల పరిధిలోకి వచ్చే పది రాష్ట్రాలనుంచి నమూనాలను సేకరించారు.

   భవిష్యత్తులో కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలను రూపొందించేందుకు వీలుగా కోవిడ్-19పై బయో రిపాజిటరీల పరిశోధనకు బయోటెక్నాలజీ విభాగం చక్కని వ్యూహాత్మక మద్దతు అందిస్తోంది. క్రియారహితంగా మారిన వైరస్ నమూనాలు, క్లినికల్ నమూనాలతో కూడిన అభిలేఖాగారాన్ని ఏర్పాటు చేయడం, బయోరిపాజిటరీల ప్రధాన లక్ష్యం. నాసికా పుటాలు, లాలాజలంనుంచి, మలంనుంచి, ప్లాస్మానుంచి, రక్తంనుంచి, సీరంనుంచి తీసిన నమూనాల్లో క్రియాహీనంగా మారిన వైరస్ శాంపిల్స్ ను ఇక్కడ నిక్షిప్తం చేస్తారు.

    బయో రిపాజిటరీలు పరిశోధనా, అభివృద్ధి లక్ష్యంకోసం క్లినికల్ నమూనాలను వినియోగించుకుంటాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సీన్ల రూపకల్పన ప్రక్రియలకు సంబంధించిన వివిధ విద్యాసంస్థలు, పరిశ్రమ వర్గాలు, వాణిజ్య సంస్థలతో నమూనాలను పంచుకునేందుకు బయో రిపాజిటరీలకు తగిన సాధికారత కల్పించారు. నమూనాలకోసం ఆయా సంస్థలనుంచి వచ్చిన విజ్ఞప్తులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నట్టుగా పరీక్షలద్వారా నిర్ధారించుకున్న అనంతరం బయోరిపాజిటరీలు శాంపిళ్లను వాటితో పంచుకుంటాయి. నమూనాలను పంచుకోవడానికి సంబంధించిన విధి విధానాలను, ప్రమాణ బద్ధమైన నిబంధనలను కూడా రూపొందించారు. తాజా సమాచారం ప్రకారం,..ఇప్పటివరకూ 44,452 క్లినికల్ నమూనాలను సేకరించి, ఐదు బయోరిపాజిటరీల్లో నిల్వచేశారు. ఐదువేలకు పైగా నమూనాలను వివిధ సంస్థలతో పంచుకున్నారు.

      సందర్భంగా, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణూ స్వరూప్ కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. అలాగే, బయోటెక్నాలజీ విభాగం సీనియర్ అధికారులతో, బయోటెక్నాలజీ విభాగం పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలైన బయోటెక్నాలజీ పరిశ్రమ పరిశోధనా సహాయక మండలి (బి..ఆర్..సి.), భారత్ ఇమ్యూనిలాజికల్ బయోలాజికల్ కార్పొరేషన్ (బి..బి.సి..ఎల్) సంస్థల ప్రతినిధులతో మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కోవిడ్19 వైరస్ పై వివిధ పరిశోధనా సంస్థల కన్సార్షియం చేపట్టిన జినోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియపై తాజా సమాచారాన్ని మంత్రి సమావేశంలో వెల్లడించారు. 80 పరిశ్రమలు, విద్యాసంస్థలు, 40 విద్యా పరిశోధనా సంస్థలు, 25 స్టార్టప్ కంపెనీలకు చెందిన 150కిపైగా పరిశోధనా బృందాలకు బయోటెక్నాలజీ విభాగం మద్దతు అందిస్తోందని మంత్రి తెలిపారు

   రోజుకు 5లక్షల ఆర్.టి.పి.సి.ఆర్. కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్ల కిట్లను తయారు చేసేలా వందశాతం స్వావలంబనను పరిశోధనా సంస్థల కన్సార్షియం విజయవంతంగా సాధించింది. వ్యాధి నిర్ధారణ కిట్లను వాణిజ్య ప్రాతిపదికపై తయారు చేసేందుకు వీలుగా  4 సాంకేతిక పరిజ్ఞాన ప్రక్రియలను బయోటెక్నాలజీ శాఖ పారిశ్రామిక రంగానికి బదిలీ చేసింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణా సేవలను, కిట్ గడువు నిర్ధారణను, యాంటివైరల్ పరీక్షల నిర్వహణ సేవలను కూడా బయోటెక్నాలజీ విభాగం అందజేస్తోంది.

 

కోవిడ్ నిరోధం లక్ష్యంగా వివిధ దశల రూపకల్పనలో ఉన్న 16 వ్యాక్సీన్లపై వివరాలకోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

కోవిడ్-19పై బయోటెక్నాలజీ విభాగం ప్రతిస్పందనకు సంబంధించిన వివరాలకోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

 


(Release ID: 1642945) Visitor Counter : 434