మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ట్రిపుల్ తలాఖ్ దురాచారం నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కలిగించిన ఆగస్టు 1: ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

ట్రిపుల్ తలాఖ్ అనేది ఇస్లాం సంప్రదాయంకాదు,

చట్టబద్ధం కూడా కాదని కేంద్రమంత్రి వ్యాఖ్య
మైనారిటీల జాతీయ కమిషన్ ఆధ్వర్యంలో “ముస్లి మహిళా హక్కుల దినోత్సవం”

Posted On: 31 JUL 2020 2:45PM by PIB Hyderabad

   ప్రభుత్వంఆమోదయోగ్యమైన ప్రజా సాధికారతకు కట్టుబడి ఉందే తప్ప, రాజకీయ పీడనకు కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రోజు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న అనేకసాహసోపేతమైన, భారీస్థాయి సంస్కరణలుతమ చిత్తశుద్ధికి, పటిష్టమైన కృషికి నిదర్శనాలని, ప్రభుత్వ చర్యలు మెరుగైన ఫలితాలను కూడా ఇచ్చాయని నఖ్వీ అన్నారు.

  “ముస్లిం మహిళా హక్కుల దినోత్సవంసందర్భంగా జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి నఖ్వీ మాట్లాడుతూ, వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలు ఆన్ లైన్ ద్వారా పాల్గొన్న వర్చువల్ సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, జాతీయ మైనారిటీల కమిషన్ ఉపాధ్యక్షుడు మంజిత్ సింగ్ రాయ్ పాల్గొన్నారు.

  సమావేశంలో నఖ్వీ మాట్లాడుతూ,..మూడు సార్లు తలాఖ్ చెప్పి, బలవంతంగా విడాకులు కట్టబెట్టే సాంఘిక దురాచారంనుంచి ముస్లిం మహిళలకు విముక్తి కలిగించిన రోజు ఆగస్టు ఒకటవ తేదీ అని,..ఇది,  “ముస్లిం మహిళా హక్కుల దినోత్సవంగా దేశ చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు. భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ చరిత్రలో స్వర్ణమయంగా ఆగస్టు 1 నిలిచిపోతుందన్నారు.

  సామాజిక దురాచారమైన ట్రిపుల్ తలాఖ్.ను ఒక నేరంగా పరిగణిస్తూ తీసుకువచ్చిన చట్టం,..దేశంలోని ముస్లిం మహిళల స్వావలంబనను, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసిందన్నారు. ట్రిపుల్ తలాఖ్ అనే క్రూరమైన సామాజిక దురాచానికి వ్యతిరేకంగా చట్టం తేవడం ద్వారా స్త్రీపురుష సమానత్వానికి ప్రభుత్వం గట్టి భరోసాను ఇచ్చిందని, ముస్లిం మహిళల రాజ్యాంగ బద్ధమైన, ప్రాథమిక, ప్రజాస్వామ్య హక్కులను మరింత పటిష్టం చేసిందని అన్నారు.

   ట్రిపుల్ తలాఖ్ లేదా తలాఖ్ బిద్దత్ అనేది ఇస్లాం సంప్రదాయం కానే కాదని, చట్టబద్ధం కాదని నఖ్వీ అన్నారు. వాస్తవం ఇలా ఉండగా, కొందరుఓట్ల వ్యాపారులు”.ట్రిపుల్ తలాఖ్.కురాజకీయ ప్రాపకంకల్పించారని నఖ్వీ వ్యాఖ్యానించారు.

  1986లో సుప్రీంకోర్టు షాబానో కేసులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చినపుడే ట్రిపుల్ తలాఖ్.కు వ్యతిరేకంగా చట్టం తెచ్చి ఉండవచ్చని నఖ్వీ అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో 545 స్థానాలకు గాను 400 సభ్యుల మెజారిటీ, రాజ్యసభలో 245 స్థానాలకు 159మంది సభ్యుల మెజారిటీఉందని, అయినా, సుప్రీంకోర్టు తీర్పును బలహీన పరిచేందుకే రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంటులో తమ బలాన్ని దుర్వినియోగం చేసిందని, ముస్లిం మహిళలకు రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు దక్కకుండా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

    ట్రిపుల్ తలాఖ్ చట్టవిరుద్ధం, ఇస్లాం వ్యతిరేకమని ప్రపంచంలోని ముస్లిం మెజారిటీ ఉన్న పలు దేశాలు చాలా కాలం కిందటే ప్రకటించాయని నఖ్వీ చెప్పారు. సాంఘిక దురాచారాన్ని రద్దుచేసిన మొదటి ముస్లిందేశంగా ఈజిప్టు 1929లోనే రికార్డులకెక్కిందని, సూడాన్ కూడా 1929లోనే చర్య తీసుకుందని అన్నారు. పాకిస్తాన్ 1956 లో, బంగ్లాదేశ్ 1972లో, ఇరాక్ 1959లో, సిరియా 1953లో, మలేసియా 1969లో ట్రిపుల్ తలాఖ్ దురాచారాన్ని రద్దు చేశాయన్నారు. అలాగే, సైప్రస్, జోర్డాన్, అల్జీరియా, ఇరాన్, బ్రునై, మొరాకో, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా ఏళ్ల కిందటే దురాచారాన్ని అంతమొందించాయని, అయితే కిరాతక దురాచారంనుంచి విముక్తి కోసం భారతదేశంలోని ముస్లిం మహిళలు మాత్రం  దశాబ్దాల తరబడి పోరాడవలసి వచ్చిందని నఖ్వీ వ్యాఖ్యానించారు.

  సుప్రీంకోర్టు తీర్పును బలోపేతం చేసేందుకే ట్రిపుల్ తలాఖ్.కు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని, చట్టం వచ్చిన ఏడాది కాలంలో ట్రిపుల్ తలాఖ్ కేసులు 82 శాతంవరకూ తగ్గాయని నఖ్వీ చెప్పారు.

  కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమావేశంలో మాట్లాడుతూ, ట్రిపుల్ తలాఖ్. దురాచారానికి వ్యతిరేకంగా దేశంలో చట్టం తీసుకురావడానికి 70ఏళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవ రక్షణ కోసమే ట్రిపుల్ తలాఖ్.కు వ్యతిరేకంగా చట్టం తెచ్చినట్టు ఆయన చెప్పారు. ముస్లిం మహిళలను డిజిటల్ పరిజ్ఞానంతో తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

    మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ,..ట్రిపుల్ తలాఖ్. బిల్లు ఆమోదం లక్షలాది ముస్లిం మహిళల విజయానికి సంకేతమని, 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' నినాదానికి ఇది 'సిసలైన నిదర్శనమ'ని అన్నారు. వివిధ రాష్ట్రాలనుంచి ఆన్ లైన్ ద్వారా  వర్చువల్ సదస్సులో పాల్గొన్న ముస్లిం మహిళలను ఉద్దేశించి మంత్రులు ప్రసంగించారు. న్యూఢిల్లీలోని బాట్లా హౌస్, ఉత్తమ్ నగర్, ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా, వారణాసి, రాజస్థాన్ లోని జైపూర్, మహరాష్ట్రలోని ముంబై, మధ్యప్రదేశ్ లోని భోపాల్, తమిళనాడులోని కృష్ణగిరి, తెలంగాణలోని హైదరాబాద్ తదితర ప్రాంతాల వారితో సహా దేశవ్యాప్తంగా దాదాపు 50వేల మంది ముస్లిం మహిళలు వర్చువల్ సమావేశంలో పాలుపంచుకున్నారు.

*****



(Release ID: 1642610) Visitor Counter : 266