ప్రధాన మంత్రి కార్యాలయం

స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 31 JUL 2020 1:04PM by PIB Hyderabad

స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 1 వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.  ఇదే సందర్భం లో విద్యార్థుల తో ఆయన సంభాషిస్తారు కూడా.

మన నిత్య జీవనం లో మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల లో కొన్ని సమస్యల కు పరిష్కారాల ను కనుగొనడానికి విద్యార్థుల కు ఒక వేదిక ను అందించేటటువంటి, మరి ఆ విధం గా సమస్య ను పరిష్కరించే మనస్తత్వాన్ని, ఇంకా ఉత్పత్తుల ను ఆవిష్కరించే సంస్కృతి ని మనస్సు లో నాటే ఒక దేశవ్యాప్త కార్యక్రమమే స్మార్ట్ ఇండియా హ్యాకథన్.  ఇది యువ మస్తిష్కాల లో కొంచెం భిన్నమైన విషయాల ను ఆలోచించడాన్ని ప్రోత్సహించడం లో ఎంతగానో విజయవంతం అయింది.   

స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2017 ఒకటో సంచిక లో 42000 మందది విద్యార్థులు పాలుపంచుకోగా 2018 వ సంవత్సరం లో ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారి సంఖ్య 1 లక్ష కు మరియు 2019 వ సంవత్సరం లో అది కాస్తా 2 లక్షల కు పెరిగిపోయింది.  స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క ఒకటో వృత్తం లో 4.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు.  ఈ సంవత్సరం లో గ్రాండ్ ఫినాలే యొక్క సాఫ్ట్ వేర్ సంచిక ను దేశం అంతటి నుండి పాలుపంచుకొంటున్న వారి ని ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఒక ఆధునిక వేదిక ద్వారా కలుపుతూ ఆన్ లైన్ మాధ్యమం లో నిర్వహించడం జరుగుతున్నది. 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు మరియు 20 పరిశ్రమలు ఇచ్చిన 243 సమస్యాత్మక నివేదనల కు పరిష్కారాలను కనుగొనడం కోసం 10,000 మంది కి పైగా విద్యార్థులు పోటీపడనున్నారు.  
 

***


 



(Release ID: 1642609) Visitor Counter : 227