భారత ఎన్నికల సంఘం
ఎమ్మెల్యేల కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉపఎన్నికలు
Posted On:
30 JUL 2020 2:12PM by PIB Hyderabad
శాసన సభ్యుల ద్వారా ఎన్నికయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ వివరాలు:
సభ్యుని పేరు
|
ఎన్నిక స్వభావం
|
ఖాళీకి కారణం
|
పదవి ముగింపు కాలం
|
శ్రీ మోపిదేవి వెంకట రమణా రావు
|
ఎమ్మెల్యేలతో
|
01.07.2020 న రాజీనామా
|
29.03.2023
|
2. పైన పేర్కొన్న ఖాళీని భర్తీ చేయటానికి శాసన సభ్యుల ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి దిగువ పేర్కొన్న
షెడ్యూల్ కు అనుగుణంగా ఉపఎన్నిక జరపాలని కమిషన్ నిర్ణయించింది:
క్రమ సంఖ్య
|
కార్యక్రమం
|
తేదీలు
|
1
|
నోటిఫికేషన్ జారీ
|
2020 ఆగస్టు 6 (గురువారం)
|
2
|
నామినేషన్లకు ఆఖరితేదీ
|
2020 ఆగస్టు 13 (గురువారం)
|
3
|
నామినేషన్ల పరిశీలన
|
2020 ఆగస్టు14 ( శుక్రవారం)
|
4
|
ఉపసంహరణకు ఆఖరుతేదీ
|
2020 ఆగస్టు 17 (సోమవారం)
|
5
|
ఎన్నిక జరిగే తేదీ
|
2020 ఆగస్టు 24 (సోమవారం)
|
6
|
పోలింగ్ సమయం
|
ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
|
7
|
వోట్ల లెక్కింపు
|
2020 ఆగస్టు 24 (సోమవారం) సాయంత్రం 05:00 కు
|
8
|
ఎన్నికల ముగింపు తేదీ
|
2020 ఆగస్టు 26 (బుధవారం)
|
3. ఎన్నికల నిర్వహణ సందర్భంగా జరిగే ఏర్పాట్లన్నీ కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఒక సీనియ అధికారిని
నియమించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.
***
(Release ID: 1642329)