రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత వైమానిక దళానికి సకాలంలో ప్రోత్సాహాన్నిచ్చిన రఫెల్స్ : రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్

Posted On: 29 JUL 2020 5:34PM by PIB Hyderabad

ఐదు మధ్య తరహా మల్టీ-రోల్ యుద్ధ విమానాలు (ఎం.ఎం.ఆర్.సి.ఎ) రాఫెల్ జెట్ల మొదటి బ్యాచ్ ఈ రోజు అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోవడాన్ని, రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ వరుస ట్వీట్లు చేస్తూ, "పక్షులు భారతీయ గగనతలంలోకి ప్రవేశించాయి ... అంబాలాకు క్షేమంగా చేరుకున్నాయి!" అని స్వాగతం పలికారు. 

వృత్తిపరంగా అమలు చేసిన ఫెర్రీపై భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్) ను శ్రీ రాజనాథ్ సింగ్ అభినందిస్తూ,  "17 స్క్వాడ్రన్, గోల్డెన్ యారోస్ వారి "ఉదయం అజస్రం" నినాదానికి అనుగుణంగా కొనసాగుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. భారత వైమానిక దళం పోరాట సామర్ధ్యం సమయానుకూలంగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ” అని పేర్కొన్నారు. 

"భారతదేశానికి  రాఫెల్ యుద్ధ విమానాలు చేరుకోవడం మన సైనిక చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది. ఈ మల్టీ రోల్ విమానాలు, భారత వైమానిక దళం సామర్థ్యాలలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తాయి ”అని ఆయన మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ యుద్ధ విమానాల సామర్థ్యాల గురించి శ్రీ రాజనాథ్ సింగ్ ప్రత్యేకంగా పేర్కొంటూ,  "ఈ విమానం చాలా మంచి ఎగిరే పనితీరును కలిగి ఉంది మరియు దాని ఆయుధాలు, రాడార్, ఇతర సెన్సార్లు మరియు ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. భారతదేశానికి అవి చేరుకోవడంతో మన దేశంపై ఎదురయ్యే ఏ ముప్పునైనా అరికట్టడానికి భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరింది. ” అని వ్యాఖ్యానించారు,

సరైన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కి రక్షణ మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, "రాఫెల్ జెట్లను కొనుగోలు చేశారు, ఎందుకంటే, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సేకరణ కేసు పురోగతి సాధించక పోవడంతో, ఫ్రాన్సు ‌తో అంతర్-ప్రభుత్వ ఒప్పందం ద్వారా ఈ విమానాలను పొందడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సరైన నిర్ణయం తీసుకున్నారు." అని ట్వీట్ చేశారు. 

కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్ర ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, విమానం మరియు దాని ఆయుధాలను సకాలంలో అందజేసినందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం, డసాల్ట్ ఏవియేషన్ సంస్థ మరియు ఇతర ఫ్రెంచ్ సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “ భారత వైమానిక దళ కార్యాచరణ అవసరాలను పూర్తిగా తీర్చిన తర్వాతే రాఫెల్ జెట్‌లు కొనుగోలు చేయబడ్డాయి.  ఈ సేకరణపై నిరాధారమైన ఆరోపణలకు ఇప్పటికే సమాధానం ఇవ్వబడింది మరియు పరిష్కరించబడింది.” అని వివరించారు.  "భారత వైమానిక దళం యొక్క ఈ కొత్త సామర్ధ్యం గురించి ఎవరైనా ఆందోళన చెంది, విమర్శించారంటే, వారు తప్పకుండా, మన ప్రాదేశిక సమగ్రతను బెదిరించాలనుకునే వారే అయి ఉండాలి" అని కూడా ఆయన పేర్కొన్నారు. 

భారత వైమానిక ప్రదేశంలోకి ప్రవేశించే విమానాల చిత్రాలు, వీడియోలను శ్రీ రాజ్ నాథ్ సింగ్ పంచుకున్నారు.

అంతకుముందు, హిందూ మహాసముద్రంలో రాఫెల్ యారో నాయకునికి, "మీరు కీర్తితో ఆకాశాన్ని తాకవచ్చు." అని భారత నావికాదళ నౌక (ఐ.ఎన్.ఎస్) కోల్‌కతా కెప్టెన్ స్వాగతం పలికారు.  ఐదు రాఫెల్ విమానాలు భారతీయ గగనతలంలోకి ప్రవేశించేటప్పుడు రెండు ఎస్.యు. 30 ఎమ్.కే.ఐ. లు వాటిని తోడ్కొని వచ్చాయి. 

*****


(Release ID: 1642186) Visitor Counter : 138