రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్రజల్లో దేశభక్తి భావం పెంచేందుకు "ఆత్మనిర్భర్‌ భారత్‌-స్వతంత్ర భారత్‌" క్విజ్‌ నిర్వహిస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ

Posted On: 29 JUL 2020 3:09PM by PIB Hyderabad

మరికొన్ని రోజుల్లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా, ‘ఆత్మనిర్భర్ భారత్’ను భారీగా ప్రచారం చేస్తున్నారు. MyGov సహకారంతో, "ఆత్మనిర్భర్‌ భారత్‌-స్వతంత్ర భారత్‌" క్విజ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. జులై 29 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ పోటీ జరుగుతుంది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడం లక్ష్యం. 

    ప్రథమ, ద్వితీయ, తృతీయతోపాటు ఏడు ప్రోత్సాహక బహుమతులు ‍(మొత్తం పది బహుమతులు) ఉంటాయి:
 

(ఎ)     మొదటి బహుమతి            రూ.25,000/-
(బి)    రెండో బహుమతి            రూ.15,000/-
(సి)    మూడో బహుమతి            రూ.10,000/-
(డి)    ప్రోత్సాహక బహుమతులు (ఏడు)    రూ.5,000/-

 

    14 ఏళ్ల వయసు దాటిన భారతీయ పౌరులు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. MyGov పోర్టల్‌లో https://quiz.mygov.in/quiz/aatmanirbhar-bharat-swatantra-bharat-quiz/ లింక్‌ ద్వారా క్విజ్‌లో పాల్గొనవచ్చు.

***
 


(Release ID: 1642113) Visitor Counter : 146