శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సోకిన వ్యక్తులను గుర్తించి, ప్రమాదాన్ని అంచనా వేయడం కోసం ఒక మొబైల్ ను రూపొందించిన - బెంగళూరుకు చెందిన అంకురసంస్థ.

ఇది శరీర సంకేతాల సమూహాన్ని సంగ్రహించడానికి స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ మరియు స్మార్ట్ ఫోన్ సెన్సార్ల శక్తిని ఉపయోగిస్తుంది.

Posted On: 28 JUL 2020 1:10PM by PIB Hyderabad

భారీ సంఖ్యలో పరీక్షల ద్వారా సాంప్రదాయిక పరీక్ష క్యూకు ప్రాధాన్యత ఇవ్వడానికి వ్యాధి యొక్క ముందస్తు గుర్తింపు మరియు వ్యాధి సోకిన జనాభా యొక్క ప్రమాద అంచనాను భర్తీ చేయడానికి నూతన పద్ధతులు కనుక్కోవలసిన అవసరాన్ని ఒక సవాలుగా కోవిడ్-19 మహమ్మారి మన ముందు ఉంచింది.  ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి సాంకేతిక పరిష్కారాలు అవసరం, ఇది ఆరోగ్య నిపుణుల ప్రమాదాన్ని తగ్గించేటప్పుడు వేగంగా చేయగలదు.

శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి) చొరవతో సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ విత్ కోవిడ్ -19 హెల్త్ క్రైసిస్ (కావాచ్), లైఫాస్ కోవిడ్ స్కోర్ అనే కోవిడ్ రిస్క్ అసెస్‌మెంట్ ప్రొఫైల్‌ను అభివృద్ధి చేయడానికి బెంగళూరుకు చెందిన అంకురా సంస్థ అకులి ప్రయోగశాలను ఎంపిక చేసింది.  అక్యులి ప్రయోగశాల "లైఫాస్" అనే క్లినికల్-గ్రేడ్, నాన్-ఇన్వాసివ్, డిజిటల్ ఫంక్షనల్ బయోమార్కర్ స్మార్ట్ ఫోన్ సాధనంతో పరీక్ష, ముందస్తుగా గుర్తించడం, మూల కారణ విశ్లేషణ, తీవ్రమైన ఈవెంట్ రిస్కు అంచనా, రోగ నిరూపణ మరియు దీర్ఘకాలిక వ్యాధుల ఇంటి పర్యవేక్షణ వంటి లైఫాస్ కోవిడ్ స్కోరుకు అవసరమైన ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. 

భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ కు చెందిన జాతీయ శాస్త్ర, సాంకేతిక వ్యవస్థాపక మండలి (ఎన్. ఎస్.‌టి.ఈ.డి.బి) చేత ప్రారంభించబడిన కావాచ్, అనుబంధ సవాళ్లను పరిష్కరించడానికి కోవిడ్-19 మరియు అంకురసంస్థల ఆలోచనల నియంత్రణ కోసం మార్కెట్ కు సిద్ధంగా ఉన్న ఆవిష్కరణలకు మద్దతు ఇస్తోంది.

శాస్త్ర, సాంకేతిక శాఖ మద్దతుతో అభివృద్ధి చేయబడిన ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం, సాంప్రదాయిక పరీక్ష క్యూకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వ్యాధి లక్షణాలు లేని ఒక వ్యక్తిలో సంక్రమణను కనుగొంటుంది, రికవరీ కోసం వ్యాధి లక్షణాలు లేని ఆ వ్యక్తి రోగ లక్షణకారిగా, ప్రమాద అంచనాగా మారడానికి, రోగ లక్షణం లేని వ్యక్తి యొక్క ప్రమాద అంచనాను నిర్వహిస్తుంది.

2020 మార్చి నెలలో, కోవిడ్ సమస్యను పరిష్కరించే సాంకేతిక పరిజ్ఞానాలకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ సహకరించింది.  భారీ సంఖ్యలో పరీక్షల నిర్వహణ పరిష్కారం కోసం అనేక దశల పరీక్షల అనంతరం అక్యులీ ప్రయోగశాల ఎంపిక చేయబడింది.  దీని ఉత్పత్తి "లైఫాస్" ‌కు డి.ఎస్.‌టి. నుండి 30 లక్షల రూపాయల గ్రాంట్ లభించింది. ఇప్పుడు  ఐ.ఐ.టి., మద్రాస్, హెల్త్ కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ (హెచ్‌.టి.ఐ.సి), మెడ్ ‌టెక్ ఇంక్యుబేటర్ సంస్థలు ఆన్ లైన్ లో మద్దతు ఇస్తున్నాయి. 

లైఫాస్ అనేది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్, దీనిలో ఒక మొబైల్ ఫోన్ యొక్క వెనుక ఫోన్ కెమెరాలో చూపుడు వేలును 5 నిమిషాలు ఉంచినప్పుడు, కేశనాళిక నాడి మరియు రక్త పరిమాణం మార్పును సంగ్రహిస్తుంది మరియు యాజమాన్య అల్గోరిథంలు మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ పద్ధతులతో 95 బయోమార్కర్లను పొందుతుంది.  ఇది శరీర సంకేతాల సమూహాన్ని సంగ్రహించడానికి స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ మరియు స్మార్ట్ ఫోన్ సెన్సార్ల శక్తిని ఉపయోగిస్తుంది.  ఆ తరువాత, ఫోటోప్లెథిస్మోగ్రఫీ (పి.పి.జి), ఫోటో క్రోమాటోగ్రఫీ (పి.సి.జి), ఆర్టిరియల్ ఫోటోప్లెథిస్మోగ్రఫీ (ఎ.పి.పి.జి), మొబైల్ స్పైరోమెట్రీ మరియు పల్స్ రేట్ వేరియబిలిటీ (పి.ఆర్.వి) సూత్రంపై సిగ్నల్స్ ప్రాసెస్ చేయబడతాయి.

లైఫాస్ అప్పుడు కార్డియో-రెస్పిరేటరీ, కార్డియో-వాస్కులర్, హెమటాలజీ, హెమోరియాలజీ, న్యూరాలజీ బేస్డ్ పారామితులను అందిస్తుంది, ఇవి ఒక నిముషంలో శరీరంలోని పాథోఫిజియోలాజికల్ మార్పులను ట్రాక్ చేయగలవు. ఈ మార్పులు అవయవ వ్యవస్థ వ్యాప్త ప్రతిస్పందనగా మరింత వివరించబడ్డాయి.

జనాభా పరీక్ష, నిర్బంధ వ్యక్తుల పర్యవేక్షణ మరియు సమాజ వ్యాప్తి దశలో నిఘా వంటి వాటిపై సాంకేతికత దృష్టి సారించింది.  మేదాంత మెడిసిటీ ఆసుపత్రితో నిర్వహించిన అధ్యయనంలో 92 శాతం ఖచ్చితత్వం, 90 శాతం నిర్దిష్టత మరియు 92 శాతం సున్నితత్వం కలిగిన వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులను గుర్తించడానికి నిరూపించబడింది.

అధ్యయనం విజయవంతం కావడానికి సాక్ష్యంగా, పెద్ద జనాభా అధ్యయనం కోసం మేదాంత ఎథిక్స్ కమిటీ దీనిని ఆమోదించింది.  ఈ అధ్యయనం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ- ఇండియా (సి.టి.ఆర్.ఐ) లో నమోదు చేయబడింది మరియు దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.‌ఓ) అంగీకరించింది.  ఆరోగ్య సేతు యాప్ మీ లక్షణాలను నమోదు చేయాల్సిన చోట కాంటాక్ట్ ట్రేసింగ్‌లో పనిచేస్తుండగా, లైఫాస్ అనేది సరైన మెడికల్ స్క్రీనింగ్ పరీక్ష, ఇది పరీక్ష ఫలితాలపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

ఈ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, "చవకైన, అందుబాటులో ఉండే, పాయింట్-ఆఫ్-కేర్ స్మార్ట్ ఫోన్ ఆధారిత విశ్లేషణ అనేది అధిక ప్రమాదకర కేసులను పరీక్షించడంలో, నిర్బంధ కేసుల నిరంతర పర్యవేక్షణ మరియు సాధారణ నిఘాలో అద్భుతంగా సహాయపడే శక్తివంతమైన సాధనం." అని పేర్కొన్నారు. " వేగం మరియు సమర్థతతో ఉద్భవిస్తున్న సవాళ్లకు సంబంధిత మరియు సృజనాత్మక పరిష్కారాలను ఆవిష్కరించడంలో సాంకేతిక అంకురసంస్థల శక్తి పెరుగుతున్నదని చెప్పడానికి "లైఫాస్" ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ” అని ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.

పరీక్షా ప్రయత్నాలు మరియు నియంత్రణ చర్యలు సెప్టెంబర్ చివరి నాటికి పూర్తవుతాయని, ఆ తర్వాత పరీక్షా సౌకర్యం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కోవిడ్-19 యొక్క ప్రభావాన్ని చూస్తే, సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మరియు ఆర్ధికవ్యవస్థకు మరింత నష్టం కలుగకుండా నివారించడానికి ఆర్.&డి. ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా అవసరం. అంకుర సంస్థల - పర్యావరణ వ్యవస్థ ద్వారా సమగ్ర పరిష్కారాలను అందించే ఆవిష్కరణలకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి.) సహకరిస్తోంది, అలాంటి పరిష్కారాలలో ఒకటి లైఫాస్ కోవిడ్ స్కోరు.

*****



(Release ID: 1641814) Visitor Counter : 249