భారత ఎన్నికల సంఘం
భారత ఎన్నికల కమిషన్ వారి ప్రకటన
Posted On:
28 JUL 2020 1:27PM by PIB Hyderabad
ది ట్రిబ్యూన్‌లో ఈ రోజు అనగా జులై 28, 2020వ తేదీన “పునర్విభజన తర్వాత జే అండ్ కే ఎన్నికలు” అంటూ ఒక కథనం వెలువడింది. గౌరవ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) జే అండ్ కే శ్రీ జి.సి.ముర్ము పేరును ఉటంకిస్తూ ఈ కథనం వెలువడింది. ఇలాంటి కథనాలు 18.11.2019 నాటి ది హిందూ పత్రికలోనూ గతంలో వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు న్యూస్18 లో 14.11.2019 తేదీన; హిందూస్థాన్ టైమ్స్ 26.6.2020, ఎకనామిక్ టైమ్స్ (ఈపేపర్) 28.7.2020లలో కూడా ఇలాంటి సంబంధిత కథనాలు వెలువడ్డాయి. ఎన్నికల కమిషన్ ఇలాంటి వాటిని ఆసాధారణంగా పరిగణలోకి తీసుకుంది. రాజ్యాంగబద్ధమైన విధానం ప్రకారం ఎన్నికల సమయ నిర్ధారణ మొదలైనవి భారత ఎన్నికల కమిషన్ యొక్క ఏకైక ముఖ్యమైన విధి. సమయాన్ని నిర్ణయించే ముందుగా ఎన్నికలు జరగబోయే ప్రాంతం(ల) లోని ప్రాంతీయ మరియు స్థానిక ఉత్సవాల నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితులు, వాతావరణం, సున్నితత్వం వంటి సంబంధిత అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం కోవిడ్-19 కొత్త శక్తిశీలతతో కూడిన పరిస్థితిని ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తక్షణ సందర్భంలో, డీలిమిటేషన్ యొక్క ఫలితం కూడా నిర్ణయానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా, సీపీఎఫ్‌ల రవాణా, కేంద్ర దళాలు మరియు రైల్వే కోచ్‌లు మొదలైన వాటి లభ్యత వంటి అంశాలను కూడా పరిశీలనలోకి తీసువాల్సి ఉంటుంది. కమిషన్ సీనియర్ అధికారులు కచ్చితమైన కసరత్తుతో పాటు సంబంధిత అధికారులతో తగిన సంప్రదింపులలో వివరణాత్మక అంచనా తర్వాతే ఇవన్నీ జరుగుతాయి. ఎన్నికల కమిషన్ అవసరమైన చోట సంబంధిత రాష్ట్ర సందర్శనను షెడ్యూల్ చేస్తుంది.అన్ని భాగస్వామ్య పక్షాల వారితో విస్తృతంగా తగిన సంప్రదింపులు జరుపుతుంది. ఎన్నికల కమిషన్ కాకుండా ఇతరులెవరూ ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉంటే మంచింది. వాస్తవంగా ఇది ఎన్నికల కమిషన్ యొక్క రాజ్యాంగ విధుల్లో జోక్యం చేసుకోవటంతో సమానమైంది. ఎన్నికల కమిషన్ కాకుండా ఇతర అధికారులు ఈ విషయమై దూరంగా ఉండటం మంచిది.
***
(Release ID: 1641805)
Visitor Counter : 233