శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డిపార్టమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ మద్దతుతో రికాంబినెంట్ బిసిజి వాక్సిన్, విపిఎం 1002 సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు పరీక్షల కోసం 6000 మంది ఆరోగ్య కార్యకర్తలు, రిస్క్ ఎక్కువ కలిగిన వ్యక్తుల నమోదు పూర్తి
Posted On:
27 JUL 2020 4:55PM by PIB Hyderabad
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఐపిఎల్), డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారి నేషనల్ బయోఫార్మా మిషన్ మద్దతుతో , వివిధ ప్రాంతాలలో
మల్టీసైట్ రాండమైజ్డ్ డబుల్ బ్లైండ్డ్ ప్లేసిబో-కంట్రోల్డ్ ఫేజ్ III క్లినికల్ పరీక్షల కింద రీకాంబినెంట్ బిసిజి వ్యాక్సిన్ విపిఎం 1002ను పరీక్షించనుంది. ఈ పరీక్షల లక్ష్యం , హై రిస్క్ పేషెంట్లు, వయసు పైబడిన వారు, ఇతర వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నవారు , వ్యాధి బారిన పడడానికి ఎక్కు వ అవకాశం ఉన్న ఆరోగ్య కార్యకర్తల వంటి వారిలో కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గింపు, కోవిడ్ వ్యాధి లక్షణాల తీవ్రతను తగ్గించడంలో ఈ వాక్సిన్ సామర్ద్యాన్ని అంచనావేయడానికి పరీక్షలు నిర్వహించనున్నారు.
బిసిజి వాక్సిన్ ను సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డలకు జాతీయ శిశువులలో వ్యాధినిరోధక శక్తి పెంచే కార్యక్రమంలో భాగంగా టిబి వ్యాధి నిరోధించేందుకు వేస్తారు. ఈ టిబి వ్యాధి బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇది వైవిధ్యంతో కూడిన ప్రభావాలను కలిగి ఉంటుంది. యాంటీవైరల్ రోగనిరోధక మాడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉండి,సహజ రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం ద్వారా అంటు వ్యాధుల నుండి రక్షిస్తుంది. సుమారు 6000 మంది ఆరోగ్య కార్యకర్తలు, కోవిడ్ పేషెంట్లతో సన్నిహిత కాంటాక్టు కలిగిన వారితో సహా హై రిస్క్ వ్యక్తులను ఈ పరీక్షల కోసం నమోదు చేసుకున్నారు. బిసిజి వాక్సిన్ కోవిడ్ వైరస్ పై పోరాటంలో, వ్యాధినిరోధక శక్తి పెంచగలదా అనే దానిపై పరీక్షలు నిర్వహించనున్నారు.
డిబిటి కార్యదర్శి, బిఐఆర్ ఎ సి ఛైర్‌పర్సన్ డాక్టర్ రేణుస్వరూప్, ఈ అంశంపై మాట్లాడుతూ, “బిసిజి వాక్సిన్ అనేది ఒక రుజువైన వాక్సిన్ ., అయితే టిబికి కాక ఇతర వ్యాధుల నియంత్రణలో దీని ప్రభావం ఎంత వరకు ఉందన్నది పరిశీలించి చూడడమనేది జరుగుతున్నది. .ఈ పరీక్షలు 2020 మేలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 40 ఆస్పత్రులలో 6000 మంది పేర్లను నమోదు చేసుకోవడం పూర్తయింది. వ్యాధి నిరోధంలో ఈ పరీక్షలు కీలక మలుపుకానున్నాయి. ముఖ్యమైన ఈ ప్రయోగ పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి” అని అన్నారు.
“ మేం డిబిటి- బిఐఆర్ ఎ సి లతో ఈ అధ్యయనంలో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రయోగ పరీక్షలలో సానుకూల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. ఇవి ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రాగలవు” అని అదార్ పూనావాలా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్.ఐ.ఐ) యజమాని, సిఇఒ అన్నారు. కోవిడ్ మహమ్మారిపై పోరాడుతన్న ఆరోగ్య కార్యకర్తల ఆరోగ్యం ,భద్రత అలాగే కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు, ఇతర ప్రజలు, కోవిడ్ హాట్‌స్పాట్‌లో సేవలు అందిస్తున్న వారు, కోవిడ్ -19 వేగంగా సోకడానికి అవకాశం ఉన్న వారి ఆరోగ్యం కాపాడడం ఎంతైనా అవసరం. కెనడాకు చెందిన పాల్ ఎర్లిచ్ ఇన్‌స్టిట్యూట్ (పిఇఐ) అండ్ హెల్త్ కూడా బిసిజిపై ఇలాంటి పరీక్షలకు అనుమతిచ్చింది.
డిబిటి గురించి:
డిపార్టమెంట్ ఆఫ్ బయొటెక్నాలజీ (డిబిటి), కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద పనిచేస్తున్న విభాగం. ఇది దేశంలో బయోటెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించి వేగవంతం చేస్తుంది. వ్యవసాయం, ఆరోగ్య రంగం, పశువిజ్ఞానం, పర్యావరణం,పరిశ్రమలరంగాలలో బయొటెక్నాలజీ వినియోగానికి ఇది కృషి చేస్తుంది.
బిఐఆర్ఎసి గురించి:
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ ఎసి) లాభాపేక్ష లేని సెక్షన్ 8, షెడ్యూలు బి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజ్. దీనిని భారత ప్రభుత్వ డిపార్టమెంట్ ఆప్ బయోటెక్నాలజీ (డిబిటి) ఏర్పాటుచేసింది. బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనవ్యూహాలు, ఆవిష్కరణలకు సాధికారత కల్పించేందుకు దేశ అభివృద్ధి అవసరాలు, దేశానికి అవసరమైన ఉత్పత్తులను చేపట్టడం కోసం దీనిని ఏర్పాటు చేశారు.
నేషనల్ బయోఫార్మా మిషన్:
భారత ప్రభుత్వానికి చెందిన,డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి)కి చెందిన పరిశ్రమ, అధ్యయన సంస్థల సంయుక్త మిషన్ ఆధ్వర్యంలో పరిశోధనలను వేగవంతం చేయడంతోపాటు, 250 మిలియన్ డాలర్ల వ్యయంతో కేంద్ర కేబినెట్ అనుమతించిన బయో ఫార్మాసూటికల్‌లను బయోటెక్నాలజీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ ఎసి)లో అభివృద్ధి చేస్తారు. ఇందులో 50 శాతం మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు సమకూరుస్తుంది. దేశానికి చౌక ఉత్పత్తులు అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం. ఆ రకంగా భారత దేశ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగు పరచడం దీని లక్ష్యం. వాక్సిన్‌లు, వైద్య పరికరాలు, రోగనిర్ధారణ పరీక్షలు, బయో థెరాపిటిక్స్ వంటివి దీని ప్రధాన అంశాలు. దీనితోపాటు క్లినికల్ ప్రయోగాల సామర్ధ్యాన్ని పెంచడం, దేశంలో సాంకేతిక బదిలీ సామర్ధ్యాలు పెంచడం కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి.
ఎస్.ఐ.ఐ.పి.ఎల్ :
సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సిన్ తయారీ సంస్జ. ఇది తయారు చేసే వాక్సిన్ డోస్‌లు కానీ లేదా అంతర్జాతీయంగా అమ్మే డోస్ లలో ఇదే పెద్దది. ఇందులో పోలియో వాక్సిన్, డిఫ్తీరియా, టిటనస్,పెర్తూసిస్, హెఐబి, బిసిజి, హెపటైటిస్ బి, మీసిల్స్, ముమ్‌ప్సు, రుబెల్లా వాక్సిన్ వంటి వి ఉన్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేసే వాక్సిన్‌లకు జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. వీటిని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 170 దేశాలలో తమ తమ జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలలో వాడుతున్నారు. ఆ రకంగా ప్రపంచ వ్యాప్తంగా అది కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతున్నది.
( మరింత సమాచారం కోసం సంప్రదించండి, డిబిటి, బిఐఆర్ ఎ సి కమ్యూనికేషన్ సెల్
@DBTIndia @BIRAC_2012· www.dbtindia.gov.in www.birac.nic.in)
***
(Release ID: 1641763)
Visitor Counter : 362