సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి సమయంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు వారి రెగ్యూలర్ పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు జారీ అయ్యేవరకు "తాత్కాలిక" పింఛన్: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
27 JUL 2020 6:35PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి సమయంలో పదవీ విరమణ పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి రెగ్యూలర్ పింఛన్ చెల్లింపు ఆర్డర్ (పీపీఓ) జారీ అయ్యే వరకు మరియు ఇతర అధికారిక ఫార్మాలిటీలు పూర్తయ్యే వరకు "తాత్కాలిక" పింఛన్ పొందే సౌకర్యాన్ని సర్కారు కల్పించింది.
ఈశాన్య ప్రాంత (డోనెర్) అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్రహోదా), ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత పెన్షన్ల శాఖ అప్‌గ్రేడ్ అయిందని అన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యోగి సూపరన్యునేషన్‌కు పొందేనాటికి ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత ఉద్యోగికి పీపీఓను అందజేయడానికి గాను సన్నద్ధమై సేవలందిస్తోందని అన్నారు. ఇది కాకుండా, గత కొన్నేళ్లలో, డిజిటలైజేషన్ విధానంలో సేవలను అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నొక్కిచెప్పడం ద్వారా, పెన్షన్ విభాగం కూడా ఒక పోర్టల్‌ను రూపొందించిందని అన్నారు. ఇది ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సూపరన్యునేషన్‌కు చేరుకోగానే తన పెన్షన్ పత్రాల స్థితిని తెలుసుకొనేందుకు గాను తగిన వీలు కల్పించబడింది అని ఆయన పేర్కొన్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి మరియు లాక్‌డౌన్ కారణంగా అధికారిక పనిలో అంతరాయం ఏర్పడినందున .. ఈ కాలంలో పదవీ విరమణ చేసిన కొంతమంది ఉద్యోగులకు పీపీఓ జారీ చేయలేకపోయినట్టుగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కానీ, పింఛనుదారులు మరియు సీనియర్ సిటిజన్ల పట్ల ప్రస్తుత ప్రభుత్వపు అంకిత భావ సున్నితత్వానికి సాక్ష్యంగా, సీసీఎస్ (పెన్షన్ రూల్స్) 1972 పరిధిలో ఉన్న రెగ్యులర్ పెన్షన్ ప్రారంభంలో ఆలస్యాన్ని నివారించడానికి, నిబంధనలను సడలించవచ్చని ఒక నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పీపీఓ జారీ అయ్యేవరకు నిరంతరాయంగా “తాత్కాలిక పెన్షన్” మరియు “తాత్కాలిక గ్రాట్యుటీ” చెల్లింపులు ప్రారంభించబడినాయి. సిబ్బంది మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పెన్షన్ల విభాగం జారీ చేసిన ఓఎం(ఆఫీస్ మెమోరాండం) ప్రకారం, “తాత్కాలిక పెన్షన్” చెల్లింపు మొదట్లో పదవీ విరమణ తేదీ నుండి దాదాపు ఆరు నెలల వరకు కొనసాగుతుంది. అసాధారణమైన సందర్భాల్లో ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసిన సందర్భాలలో కూడా ఈ సూచనలు వర్తిస్తాయి, అనగా స్వచ్ఛంద పదవీ విరమణ, ఎఫ్ఆర్ 56 కింద పదవీ విరమణ మొదలైన వాటికి ఇవి వర్తిస్తాయి. కోవిడ్
మహమ్మారి మరియు లాక్‌డౌన్ యొక్క పరిమితుల కారణంగా, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పెన్షన్ ఫారాలను కార్యాలయ అధిపతికి సమర్పించడంలో ఇబ్బంది పడవచ్చు లేదా క్లెయిమ్ ఫారమ్‌ను హార్డ్ కాపీలో ఫార్వార్డ్ చేయలేకపోవచ్చు. సేవా పుస్తకంతో పాటు సంబంధిత పే & అకౌంట్స్ కార్యాలయానికి, ప్రత్యేకించి రెండు కార్యాలయాలు వేర్వేరు నగరాల్లో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ అసాధారణ పరిస్థితి నేపథ్యంలోనే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ వారికి (సీఏపీఎఫ్) ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది, వారు నిరంతరం కదలికలో ఉంటారు. వారి పే & అకౌంట్స్ కార్యాలయం ఉన్న నగరాలలో కాకుండా వేరేవేరే నగరాల్లో కార్యాలయాల అధిపతులు ఉన్నారు. దీనికి సంబంధించి ఒక సర్య్కూలర్ ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) జీపీఎఫ్(జనరల్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలను నిర్వహిస్తున్న అన్ని కార్యాలయాలకు పదవీ విరమణకు రెండు సంవత్సరాల ముందు మరియు పదవీ విరమణకు ఒక సంవత్సరం వరకు ఉద్యోగులకు వడ్డీతో సహా అన్ని క్రెడిట్ ఎంట్రీలను పూర్తి చేయాలని ఆదేశించింది. ఫండ్ కూడా కచ్చితంగా సమయానికి చెల్లించబడేలా చూడాలని సూచించింది.
***
(Release ID: 1641730)
Visitor Counter : 338