రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఈ రోజు రక్షణ మంత్రుల సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోడానికి అంగీకరించిన - భారత్, ఇండోనేషియా దేశాలు.

Posted On: 27 JUL 2020 5:09PM by PIB Hyderabad

భారతదేశం మరియు ఇండోనేషియా దేశాలకు చెందిన రక్షణ మంత్రుల సమావేశం ఈ రోజు ఇక్కడ జరిగింది. భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ నాయకత్వం వహించగా,  ఇండోనేషియా ప్రతినిధి బృందానికి ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ప్రబోవో సుబియాంటో నాయకత్వం వహించారు.  ఆయన ప్రస్తుతం రెండు పొరుగు సముద్ర తీర దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికిగాను, భారతదేశంలో ఉన్నారు. 

చర్చల సందర్భంగా, భారత రక్షణ మంత్రి మాట్లాడుతూ, సన్నిహిత రాజకీయ సంభాషణ, ఆర్థిక, వాణిజ్య పరమైన అనుసంధానాలతో పాటు సాంస్కృతిక మరియు ప్రజలతో పరస్పర చర్యల సంప్రదాయంతో, రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకర చర్యల సుదీర్ఘ చరిత్రను పునరుద్ఘాటించారు. 

సైనిక పరస్పర చర్యలకు మిలిటరీపై సంతృప్తిని తెలియజేస్తూ, శ్రీ రాజ్‌నాథ్ సింగ్, భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య రక్షణ సహకారం ఇటీవలి సంవత్సరాలలో వృద్ధిని సాధించిందనీ, ఇది ఇరుపక్షాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా ఉందనీ పేర్కొన్నారు.  ఇరుదేశాలకూ ఆమోదయోగ్యమైన  ప్రాంతాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోడానికి, ఇద్దరు మంత్రులూ అంగీకరించారు.

రక్షణ పరిశ్రమలు, రక్షణ సాంకేతిక రంగాలలో పరస్పరం సహకరించుకోడానికి అనువైన ప్రాంతాలను కూడా రెండు దేశాలు గుర్తించాయి.  ఈ ప్రాంతాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికీ, తదుపరి స్థాయికి తీసుకువెళ్ళడానికీ, ఇద్దరు మంత్రులూ, కట్టుబడి ఉన్నారు.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పరిధిని మరింత బలోపేతం చేసి, విస్తృత పరచాలనే నిబద్ధతతో ఈ సమావేశం ఒక సానుకూల దృక్పధంతో ముగిసింది.

ఈ ద్వైపాక్షిక సమావేశంలో - రక్షణ సిబ్బంది అధిపతి, సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శి జనరల్ బిపిన్ రావత్, సైనిక దళాధిపతి జనరల్ ఎమ్.ఎమ్.నరవణే,  నావికాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కే.ఎస్.భదారియా,  రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ తో పాటు ఇతర సీనియర్ పౌర, సైనిక అధికారులు కూడా పాల్గొన్నారు. 

ఈ చర్చలలో పాల్గొనడానికి వచ్చిన జనరల్ సుబియాంటో కు సౌత్ బ్లాక్ ముందు ఉన్న పచ్చిక మైదానంలో సంప్రదాయ స్వాగతం పలికారు.  రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు.  అంతకుముందు, జనరల్ సుబియాంటో, జాతీయ యుద్ధ స్మారక చిహ్నం సందర్శించి, అమరవీరులకు గౌరవ సూచకంగా పుష్పాంజలి ఘటించారు. 

*****



(Release ID: 1641727) Visitor Counter : 244