ఆర్థిక మంత్రిత్వ శాఖ

రూ.600 కోట్లకు పైగా పన్ను ఎగవేతల‌కు సంబంధించి 3 సంస్థలపై కేసు న‌మోదు చేసిన‌ డీజీజీఐ

Posted On: 27 JUL 2020 4:43PM by PIB Hyderabad

వాస్త‌వంగా ఎలాంటి వ‌స్తువుల‌ స‌ర‌ఫ‌రా జ‌ర‌పకుండానే ఇన్వాయిస్‌ల జారీలో పాల్గొన్న మెస్స‌ర్స్‌ ‌
ఫార్చ్యూన్ గ్రాఫిక్స్ లిమిటెడ్, మెస్స‌ర్స్‌ రీమా పాలీచెమ్ ప్రై. లిమిటెడ్ మ‌రియు మెస్స‌ర్స్‌
గ‌ణపతి ఎంటర్ప్రైజెస్‌ల‌పై కేసు న‌మోదు అయింది. ఎగుమతిదారులలో నమోదు చేసిన కేసులో మరింత డేటా విశ్లేషణలో అధికారులు ఈ కేసును గుర్తించారు మరియు అభివృద్ధి చేశారు. మెస్స‌ర్స్‌ అనన్య ఎక్సిమ్, 2019 సెప్టెంబర్‌లో డీజీజీఐ-డీఆర్‌ఐ ప్రారంభించిన అఖిల భారత ఉమ్మడి ఆపరేషన్‌లో వివిధ ఎగుమతిదారులకు వ్యతిరేకంగా నమోదు చేసిన కేసులో మరింత డేటా విశ్లేషణలలో అధికారులు  ఈ కేసును గుర్తించారు. వివిధ ఎగుమ‌తిదారులు అనర్హమైన ఐటీసీ, మోసపూరిత ఐజీఎస్టీ వాపసుల‌ను జ‌ర‌ప‌డాన్ని అధికారులు క‌నుగోన్నారు. డీజీజీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వహించిన దర్యాప్తులో పైన పేర్కొన్న మూడు కంపెనీలు / సంస్థలు మెస్స‌ర్స్‌ ‌ఫార్చ్యూన్ గ్రాఫిక్స్ లిమిటెడ్, మెస్స‌ర్స్‌ రీమా పాలీచెమ్ ప్రై. లిమిటెడ్ మ‌రియు మెస్స‌ర్స్‌ గ‌ణపతి ఎంటర్ప్రైజెస్‌లు దాదాపు రూ.4,100 కోట్ల‌కు పైగా బోగ‌స్ ఇన్వాయిస్‌ల‌ను జారీ చేశాయి. ప్ర‌తిగా రూ.600 కోట్ల సొమ్మును మోస‌పూరితంగా ఐటీసీ క్రెడిట్‌గా రూ.600 కోట్లు మ‌ళ్లించాయి. ఈ విషయమై జీఎస్‌టి చట్టం కింద నేరాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మెస్స‌ర్స్‌ ‌ఫార్చ్యూన్ గ్రాఫిక్స్ లిమిటెడ్, మెస్స‌ర్స్‌ రీమా పాలీచెమ్ ప్రై. లిమిటెడ్ మ‌రియు మెస్స‌ర్స్‌ గ‌ణపతి ఎంటర్ప్రైజెస్ డైరెక్ట‌ర్లు/ య‌జ‌మానులు ఉన్నారు. వీరిలో ఇద్దరు డీజీజీఐ ప్రధాన కార్యాలయానికి హాజ‌రుకాకుండా త‌ప్పించుకొని తిరుగుతున్నారు. మూడో వ్యక్తి మెస్స‌ర్స్ ఏబీ ప్లేయ‌ర్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మరియు ఈ సంస్థలు జారీ చేసిన నకిలీ ఇన్‌వాయిస్‌ల బలం మీద ఐజీఎస్‌టీ వాపసు ఇస్తున్నట్లు పేర్కొన్న ఇతర ఎగుమతి సంస్థలు / కంపెనీల కంట్రోలర్ ఉన్నాయి. సీజీఎస్‌టీ చ‌ట్టం, 2017 లోని సెక్షన్లు 132 (1) (బీ) మరియు 132 (1) (సీ) నిబంధనల ప్రకారం నేరాలకు పాల్పడినందుకు ముగ్గురు వ్యక్తులను డీజీజీఐ (ప్రధాన కార్యాల‌యం) అరెస్టు చేసి, న్యాయాధికారి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

 

****



(Release ID: 1641682) Visitor Counter : 186