పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా పులుల సెన్సస్ యొక్క సమగ్ర నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి విడుదల చేయనున్నారు.
Posted On:
27 JUL 2020 5:28PM by PIB Hyderabad
ప్రపంచ పులుల దినోత్సవం 2020 సందర్భంగా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జవడేకర్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును భారతప్రజలకు అంకితం చేయనున్నారు. భారత దేశ పులుల పర్యవేక్షణకు సంబంధించిన గణనను, ప్రపంచంలో క్రూరమృగాల గణనకు సంబంధించిన అతిపెద్ద కెమెరా ట్రాప్ సర్వేగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గుర్తించింది.
ఈ ఈవెంట్ న్యూఢిల్లీ లోని నేషనల్ మీడియా సెంటర్ లో జరగనుంది. ఈ కార్యక్రమం https://youtu.be/526Dn0T9P3E లింక్ ద్వారా 2020 జూలై 28 ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 500 మంది పాల్గొననున్నారు.
టైగర్ రేంజ్ కలిగిన దేశాల ప్రభుత్వాధిపతులు రష్యాలోని సెంట్ పీటర్స్ బర్గ్‌లో సమావేశమై 2022 నాటికి పులు సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా రెట్టింపు చేయాలని తీర్మానించారు. ఇందుకుసంబంధించి పులుల సంరక్షణకు సంబంధించి సెంట్ పీటర్స్ బర్గ్ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో నే ప్రపంచవ్యాప్తంగా జూలై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటినుంచి , పులుల సంరక్షణ విషయంలో చైతన్యాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
గత ఏడాది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , పులుల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలంటూ 2010లో రష్యాలోని సెంట్ పీటర్స్‌బర్గ్‌లో చేసిన తీర్మానానికి నాలుగు సంవత్సరాల ముందుగానే పులుల సంఖ్యను రెట్టింపు చేయడాన్ని ఇండియా సాధించిందని ప్రపంచానికి తెలియజేశారు. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 70 శాతం పులులు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాయి.
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జవడేకర్, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఔట్ రీచ్ జర్నల్‌ను, కొత్త వెబ్‌సైట్ తదితరాలను ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్ ప్రత్యక్షప్రసారాన్ని కింది లింక్ ద్వారా వీక్షించవచ్చు.
https://youtu.be/526Dn0T9P3E .
***
(Release ID: 1641631)
Visitor Counter : 228