ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో కేసు మరణాల రేటు (సి.ఎఫ్.ఆర్.) మెరుగుపడుతోంది, ఇదిప్రస్తుతం 2.28 శాతంగా ఉంది.
మొత్తం రికవరీలు 9 లక్షలు దాటాయి.
వరుసగా 4వ రోజున కూడా రోజుకు 30,000 కంటే ఎక్కువ రికవరీలు నమోదయ్యాయి.
प्रविष्टि तिथि:
27 JUL 2020 1:23PM by PIB Hyderabad
ఎక్కువ సంఖ్యలో పరీక్షల నిర్వహణ, ఆసుపత్రిలో చేరిన కేసులకు సమర్థవంతమైన వైద్య చికిత్స అందించడం ద్వారా, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం, ఐసోలేషన్ లో ఉంచడం వంటి చర్యలపై కేంద్రప్రభుత్వంతో పాటు, రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు దృష్టిని కేంద్రీకరించడంతో, కేసు మరణ రేటు గణనీయంగా తగ్గడంతో పాటు రికవరీ రేటు పెరుగుతోంది.
సమర్థవంతమైన నియంత్రణ వ్యూహం, పెద్ద సంఖ్యలో పరీక్షలతో పాటు, ప్రామాణిక వైద్య చికిత్సా విధానం అమలుచేయడంతో, కేసు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. కేసు మరణాల రేటు క్రమంగా తగ్గుతూవస్తోంది, ప్రస్తుతం ఇది 2.28 శాతంగా నమోదయ్యింది. ప్రపంచంలో అత్యల్ప మరణాల రేటు నమోదౌతున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది.
రోజుకు 30,000 రికవరీల పరంపరను కొనసాగిస్తూ వరుసగా 4వ రోజున, గత 24 గంటల్లో 31,991 మంది రోగులు డిశ్చార్జి అయ్యారు. దీంతో, మొత్తం రికవరీల సంఖ్య 9 లక్షలు దాటి, ప్రస్తుతం 9,17,567 కు చేరుకుంది. ఫలితంగా, రికవరీ రేటు 64 శాతానికి పెరిగింది.
తక్కువ మరణాలు మరియు ఎక్కువ మంది ప్రజలు కోలుకోవడం ఫలితంగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య (4,85,114) కంటే చికిత్స అనంతరం కోలుకున్న రోగుల సంఖ్య ఈ రోజు 4,32,453 ఎక్కువగా నమోదయ్యింది. ఆసుపత్రులలోనూ, ఇళ్ళల్లోనూ చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగులందరికీ వైద్య సహాయం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు,
సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం
ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను
దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న
ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా,
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన
ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046
లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన
కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
****
(रिलीज़ आईडी: 1641614)
आगंतुक पटल : 318
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam