ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఒక ఉద్యమంలా 'మైగవ్' మరింత పురోగతి చెందాలి : శ్రీ రవిశంకర్ ప్రసాద్

పౌరులను భాగస్వామ్య పాలనలో మిళితం చేసే ఈ వేదిక ఆరవ వార్షికోత్సవం జరుపుకుంటోంది

సోషల్ మీడియాలో ట్విట్టర్‌లో 2.1 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 1.1 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ మందికి పైగా ఉన్న ఈ ప్లాట్‌ఫాం అత్యంత క్రియాశీల ప్రొఫైల్‌లలో ఒకటి

Posted On: 26 JUL 2020 8:07PM by PIB Hyderabad

న్యాయ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ “మైగవ్ ఉద్యమం ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు. ఆరు సంవత్సరాల మైగవ్ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైగవ్ 'సాతీస్' - 1.2 కోట్ల మైగోవ్ వినియోగదారులు, అనుచరుల ప్రతినిధులుగా , 6 సంవత్సరాల పౌరుల సమ్మిళిత వేదికలో పాలుపంచుకుని భాగస్వామ్య పాలనకు ప్రతిరూపంగా నిలిచారు. 

మైగవ్ చేస్తున్న కృషిని శ్రీ ప్రసాద్ ప్రశంసించారు. మైగవ్ ద్వారా ప్రతి మునిసిపాల్టీ, ప్రతి జిల్లా, ప్రతి పంచాయతీ పౌరులను మిళితం చేయడానికి చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.  వారి ఆలోచనలను పంచుకోవడానికి అత్యంత ప్రతిభావంతులైన వారికి వేదిక ఇవ్వడానికి ఉత్ప్రేరకంగా ఉండాలన్నారు. సమర్థవంతమైన డేటా విశ్లేషణలను ప్రారంభించడానికి పౌరులు ఇచ్చిన సలహాలను సంబంధిత విభాగాలతో పంచుకునేలా చూడాలని, అమలయ్యేలా చొరవ చూపాలని మంత్రి మైగవ్‌కు పిలుపునిచ్చారు.

ఈ ఆన్‌లైన్ ఉత్సవాలలో  హెచ్‌ఆర్‌డి, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ , ఐటి సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ సాహ్నీ; మైగవ్ సిఇఓ శ్రీ అభిషేక్ సింగ్ కూడా పాల్గొన్నారు.

కొంతమంది ప్రత్యేక అతిథులు కూడా పాల్గొన్నారు. అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర ముఖ్యమంత్రులు, ఈ కార్యక్రమంలో వీడియో సందేశాలు పంచుకున్నారు.

నాగాలాండ్- కేరళ-ముంబై నుండి కాశ్మీర్ వరకు సాతీలు - ఈ సందర్భంగా ప్రత్యేకంగా కంపోజ్ చేసిన పాటలు, కవితలను ప్రదర్శించారు, దేశాన్ని ఆత్మ నిర్భర్ దిశగా తీసుకెళ్లడానికి  ఆలోచనలు, సలహాలను పంచుకున్నారు. 

భాగస్వామ్య పాలనను మరింత పటిష్ఠం చేయడానికి, మైగవ్ ని మరింత మందికి చేర్చడానికి కృషి చేయాలనీ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే పిలుపునిచ్చారు. 

మైగవ్ ప్రాంతీయ భాషలకు విస్తరించి, ప్రతి వ్యక్తిని భాగస్వామ్యం చేయాలనీ శ్రీ అజయ్ సాహ్ని అన్నారు. 

సురాజ్య దిశగా ప్రజాఉద్యమం ఉండాలి.. ప్రజల ఆశలు ఆశయాలను గుర్తెరిగి భారత్ ను ఉన్నత శిఖరాల వైపు నడిపించాలి అనే ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా మైగవ్ ని 2014 జులై 26న ప్రారంభించారు.

మైగవ్.ఇన్  "పౌరుల నుండి ఆలోచనలను సమీకరించి పాలన అందించే" ఒక ఉమ్మడి వేదికగా రూపుదిద్దుకుంది.

పౌరులను మిళితం చేసి వారి కోసమే చక్కటి పాలన అందించే దిశగా విధానాలు రూపొందించే వేదికగా విజయవంతంగా నడుస్తున్న వ్యవస్థ.

2014 లో ప్రారంభించినప్పటి నుండి, మైగవ్ 122 లక్షలకు పైగా నమోదిత వినియోగదారులను కలిగి ఉంది, 953 పనులలో 778,000 కామెంట్లు నమోదయ్యాయి. 839 చర్చా వేదికలలో 45 లక్షల వ్యాఖ్యలు వచ్చాయి. 126 క్విజ్‌లలో సుమారు 53 లక్షల మంది, 24 ప్రతిజ్ఞల్లో 33.70 మంది పాలుపంచుకున్నారు. 

****



(Release ID: 1641479) Visitor Counter : 169