వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో పురోగతి; బియ్యం, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనెగింజల సాగు గతేడాది కంటే అధికం రబీ మార్కెటింగ్ సీజన్-2020-21లో 389.75 ఎల్‌ఎంటీల గోధుమలు కొన్న భారత ఆహార సంస్థ
Posted On:
24 JUL 2020 5:56PM by PIB Hyderabad
కరోనా సమయంలో వ్యవసాయ పనులు ఆగకుండా, "కేంద్ర వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ" రైతు సౌలభ్య చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల, ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణంలో సంతృప్తికర పురోగతి కనిపిస్తోంది. ఆ గణాంకాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం:
బియ్యం: ఈ ఏడాది 220.24 లక్షల హెక్టార్లలో వరి పండిస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో 187.70 లక్షల హెక్టార్లలో సాగయింది.
పప్పుధాన్యాలు: ఈ ఏడాది 99.71 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు పండిస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో 79.30 లక్షల హెక్టార్లలో సాగయింది.
తృణధాన్యాలు: గతేడాది ఇదే సమయంలో సాగుచేసిన 120.30 లక్షల హెక్టార్లతో పోలిస్తే, ఈ ఏడాది 137.13 లక్షల హెక్టార్లలో తృణధాన్యాలు పండిస్తున్నారు.
నూనె గింజలు: గతేడాది ఇదే సమయంలో సాగుచేసిన 133.56 లక్షల హెక్టార్లతో పోలిస్తే, ఈ ఏడాది 166.36 లక్షల హెక్టార్లలో నూనె గింజలు పండిస్తున్నారు.
చెరకు: ఈ ఏడాది 51.54 లక్షల హెక్టార్లలో చెరకు పండిస్తుండగా, గతేడాది ఇదే సమయంలో ఇది 51.02 లక్షల హెక్టార్లుగా ఉంది.
జనపనార&గోగునార: ఈ ఖరీఫ్‌లో 6.94 లక్షల హెక్టార్లలో ఇవి సాగవుతున్నాయి. గత ఖరీఫ్‌లో ఇది 6.84 లక్షల హెక్టార్లు.
పత్తి: పత్తిని ఈ ఏడాది 118.03 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో ఈ విస్తీర్ణం 96.35 లక్షల హెక్టార్లు.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లోని 123 జలాశయాల్లో ప్రస్తుతమున్న నీటి నిల్వ, గత సంవత్సరం ఇదే సమయానికంటే 155 శాతం అధికమని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదించింది.
రబీ మార్కెటింగ్ సీజన్-2020-21లో, 420.90 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు భారత ఆహార సంస్థ గోదాములకు రాగా, వీటిలో 389.75 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
****
(Release ID: 1641002)
Visitor Counter : 213