రైల్వే మంత్రిత్వ శాఖ

డిసెంబర్‌ 2022 నాటికి అన్ని వ్యాగన్లను ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ చేయనున్న భారతీయ రైల్వే ఇప్పటివరకు ఆర్‌ఎఫ్‌ఐడీ ప్రాజెక్ట్‌ పరిధిలోకి 23,000 వ్యాగన్లు

Posted On: 24 JUL 2020 2:55PM by PIB Hyderabad

డిసెంబర్ 2022 నాటికి అన్ని వ్యాగన్లను 'ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్' చేసేందుకు భారతీయ రైల్వే సంకల్పించింది. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

    'రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌' (ఆర్‌ఎఫ్‌ఐడీ)ను వ్యాగన్లకు అనుసంధానించే ప్రక్రియను 2022 డిసెంబర్‌ నాటికి రైల్వే పూర్తి చేయనుంది. దీనివల్ల అన్ని వ్యాగన్ల కదలికలను గుర్తించవచ్చు.

    ఆర్‌ఎఫ్‌ఐడీ ప్రాజెక్టు పరిధిలోకి 23,000 వ్యాగన్లు వచ్చాయి. కొవిడ్‌ కారణంగా కొంతకాలం పాటు ఈ ప్రాజెక్టు  నెమ్మదిగా సాగినా, పనులు కొనసాగుతున్నాయి. 2022 డిసెంబర్‌ నాటికి అన్ని వ్యాగన్లకు ఆర్‌ఎఫ్‌ఐడీని బిగింపు పనులు పూర్తి కావాలని కేంద్రం గడువును నిర్దేశించింది.

    ప్రస్తుతం, వ్యాగన్ల కదలికల సమాచారాన్ని సిబ్బందే నమోదు చేస్తున్నారు. దీనివల్ల పొరపాట్లకు అవకాశం ఉంది. ఆర్‌ఎఫ్‌ఐడీ వల్ల ఈ పని సులభమవుతుంది. వ్యాగన్లు, లోకోమోటివ్స్‌, కోచ్‌లు ఎక్కడున్నాయో కచ్చిత సమాచారం తెలుస్తుంది.

    ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను సరకు రవాణా వ్యాగన్లకు బిగిస్తారు. స్టేషన్లతోపాటు ముఖ్య ప్రాంతాల్లో రైలు పట్టాల పక్కన రీడర్లను అమరుస్తారు. వ్యాగన్లను రెండు మీటర్ల దూరం నుంచే ఈ రీడర్‌లు గుర్తించి, ఆ సమాచారాన్ని కేంద్ర కంప్యూటర్‌కు పంపుతాయి. దీనివల్ల, రవాణాలో ప్రతి వ్యాగన్‌ను కచ్చితంగా గుర్తించవచ్చు.

    ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ల బిగింపుతో.., వ్యాగన్లు, లోకోమోటివ్స్‌, కోచ్‌ల కొరతను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అధిగమించే అవకాశముంది.
 



(Release ID: 1640969) Visitor Counter : 209