రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
మలేరియా నియంత్రణ కార్యక్రమం కోసం దక్షిణాఫ్రికా కి 20.60 మెట్రిక్ టన్నుల డిడిటి ని సరఫరా చేసిన హెచ్ఐఎల్ (ఇండియా)
Posted On:
21 JUL 2020 12:12PM by PIB Hyderabad
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పిఎస్‌యు అయిన హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ తమ మలేరియా నియంత్రణ కార్యక్రమం కోసం 20.60 మెట్రిక్ టన్నుల డిడిటి 75% డబ్ల్యుపిని దక్షిణాఫ్రికాకు నిన్నసరఫరా చేసింది.
హెచ్ఐఎల్ (ఇండియా) ప్రపంచవ్యాప్తంగా డిడిటి ఏకైక తయారీదారు. మలేరియా నియంత్రణ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు డిడిటి తయారీ, సరఫరా చేయడానికి 1954 సంవత్సరంలో ఈ సంస్థను విలీనం చేశారు. 2019-20 సంవత్సరంలో, దేశంలోని 20 రాష్ట్రాలకు ఈ ఉత్పత్తి సరఫరా జరిగింది. కంపెనీ అనేక ఆఫ్రికన్ దేశాలకు ఈ ఉత్పత్తిని ఎగుమతి చేస్తోంది.
దక్షిణాఫ్రికాలోని ఆరోగ్య శాఖ మొజాంబిక్ ప్రక్కనే ఉన్న మూడు ప్రావిన్స్‌లో డిడిటిని వినియోగించుకుంటోంది. ఈ ప్రాంతం మలేరియాతో బాగా ప్రభావితమైంది, ఇటీవలి సంవత్సరాలలో ఈ వ్యాధి కారణంగా అధికమైన అనారోగ్యం, మరణాలు ఆ ప్రాంతాల్లో నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా మలేరియా... ప్రధాన ప్రజారోగ్య సమస్యల్లో ఒకటిగా ఉంది. 2018 లో ప్రపంచవ్యాప్తంగా 228 మిలియన్ మలేరియా కేసులు సంభవించాయని, ఆఫ్రికన్ ప్రాంతం నుండి ఎక్కువ మలేరియా కేసులు, మరణాలు (93%) నమోదయ్యాయని అంచనా. ఆగ్నేయాసియా ప్రాంతంలో చుస్తే భారతదేశంలో ఎక్కువ కేసులు, మరణాలు ఉన్నాయి. మానవ నివాసాలలో పురుగుమందుల పిచికారీ- అంటే ఇండోర్ రెసెడ్యూల్ స్ప్రేయింగ్ (ఐఆర్ఎస్) దోమల నియంత్రణకు ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారణ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మలేరియా దోమల ప్రమాదాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన ఐఆర్‌ఎస్ రసాయనాలలో ఒకటిగా డిడిటిని సిఫారసు చేస్తుంది. దీనిని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జాంబియా, నమీబియా, మొజాంబిక్, భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2020-21లో జింబాబ్వే (128 ఎమ్‌టి), జాంబియా (113 ఎంటి) లకు డిడిటి 75% డబ్ల్యుపిని సరఫరా చేసే ప్రక్రియలో కంపెనీ నిమగ్నమై ఉంది. మిడతల నియంత్రణ కార్యక్రమం కింద హెచ్ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ ఇటీవల 25 మెట్రిక్ టన్నుల మలాథియాన్ టెక్నికల్ 95% ఇరాన్‌కు ఎగుమతి చేసింది, లాటిన్ అమెరికన్ ప్రాంతానికి అగ్రోకెమికల్-ఫంగైసైడ్ (32 ఎంటి) ను ఎగుమతి చేసింది.
*****
(Release ID: 1640230)
Visitor Counter : 334