విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఇటువంటి తరహాలో దేశంలోనే మొదటిదైన ఈవీ ఛార్జింగ్ ప్లాజాను ప్రారంభించిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
ఈఈఎస్ఎల్, యుఎస్ఎయిడ్ సంయుక్త చొరవతో ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫిషియెన్సీ (రైస్) ను మెరుగుపరచడానికి మంత్రి రెట్రోఫిట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్‌ను ప్రారంభించారు
ఈ రెండు కార్యక్రమాలు శక్తి సామర్థ్యం, ఇ-మొబిలిటీని ప్రోత్సహించడం, ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడతాయి
Posted On:
20 JUL 2020 6:51PM by PIB Hyderabad
ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, ఇ-మొబిలిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఈ రోజు భారతదేశపు మొట్టమొదటి పబ్లిక్ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) ఛార్జింగ్ ప్లాజాను న్యూ ఢిల్లీ లోని చెల్మ్స్ ఫోర్డ్ క్లబ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సింగ్ మాట్లాడుతూ “ఇ-మొబిలిటీని భారతదేశంలో సర్వవ్యాప్తి, సౌకర్యవంతంగా చేయడానికి ఈవీ ఛార్జింగ్ ప్లాజా ఒక కొత్త మార్గం అని అన్నారు. దేశంలో బలమైన ఇ-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ఇటువంటి వినూత్న కార్యక్రమాలు తప్పనిసరి అని తెలిపారు. ఈఈఎస్ఎల్, ఎన్డిఎంసి సంస్థలను ఆయన అభినందించారు.
ఈవీ లను సేకరించడం కోసం ఉత్పన్నమయ్యే డిమాండ్ కు అనుగుణంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ (పిసిఎస్) అమలులోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందు కోసం వినూత్న వ్యాపార నమూనాలను గుర్తించడం ద్వారా భారతదేశంలో ఈవీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ఈఈఎస్ఎల్ నాయకత్వం వహిస్తుంది. ఈఈఎస్ఎల్, ఎన్డిఎంఎస్ సహకారంతో సెంట్రల్ ఢిల్లీలో దేశం లోనే మొట్టమొదటి పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ ప్లాజాను స్థాపించింది. ఈ ప్లాజా వివిధ స్పెసిఫికేషన్ల 5 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను అందుబాటులోకి తెస్తుంది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ నందన్ సహాయ్ ఈవీ ప్లాజా ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ “ఛార్జింగ్ ప్లాజా, విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలతో దాని అనుకూలతతో ఇ-మొబిలిటీ స్వీకరణకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఇది ఈవీ ఛార్జింగ్ కి ఇబ్బంది లేకుండా వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది, తద్వారా ఇ-మొబిలిటీ స్వీకరణ ఆకర్షణీయమైన ప్రతిపాదన అవుతుంది, అని నందన్ సహాయ్ తెలిపారు.
కేంద్ర విద్యుత్ మంత్రి శ్రీ ఆర్ కె సింగ్ ఈ రోజు “రెట్రోఫిట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ ఫర్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫిషియెన్సీ” (రైస్) జాతీయ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
గాలి నాణ్యత పడిపోవడం కొంతకాలంగా ఆందోళన కలిగిస్తుంది కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రజలు తమ కార్యాలయాలు మరియు బహిరంగ ప్రదేశాలకు తిరిగి వచ్చేటప్పుడు, నివాస సౌకర్యం, శ్రేయస్సు, ఉత్పాదకత, మొత్తం ప్రజారోగ్యానికి మంచి ఇండోర్ గాలి నాణ్యతను కాపాడుకోవడం చాలా అవసరం.
ఈ పరిస్థితుల్లో ఈఈఎస్ఎల్ రెట్రోఫిట్ ఆఫీస్ ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ వ్యవస్థ ఏర్పాటుకు సన్నద్ధం అయింది. యు.ఎస్. ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్ఎయిడ్) మైత్రి కార్యక్రమ భాగస్వామ్యంతో ఆరోగ్యకరమైన, పొదుపుతో విద్యుత్ వాడకం గల భవనాల కోసం అభివృద్ధి చేసిన “భద్రత, సమర్థత కోసం ఇండోర్ వాయు నాణ్యతను మెరుగుపరచడానికి రెట్రోఫిట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్” కోసం ఇది పెద్ద ప్రయత్నం.
******
(Release ID: 1640123)
Visitor Counter : 368