ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
6.35 లక్షలకు పైబడ్డ కోలుకున్న వారి సంఖ్య,
కోలుకున్న శాతం 63.33%
గత 24 గంటల్లో కోలుకున్నవారు దాదాపు 23 వేలు
Posted On:
17 JUL 2020 6:11PM by PIB Hyderabad
కేంద్రం మార్గనిర్దేశనం చేసిన " పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు" అనే వ్యూహాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలుచేయటం వల్ల కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ఆశించిన ఫలితాలు సాధించగలిగాం. కోవిడ్ నుంచి బైటపడుతున్నవారి సంఖ్య భారత్ లో రోజు రోజుకూ బాగా పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో 22,942 మంది కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 6,35,756 మంది బాధితులు కోలుకోగా, అలా కోలుకున్నవారిశాతం 63.33% కు చేరింది.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి ప్రధానంగా దృష్టి సారించవలసింది వీలైనంత త్వరగా బాధితులను గుర్తించటమేనని, అందుకుగాని పెద్ద ఎత్తున పరీక్షలు జరపాలని నిర్ణయించి అదే వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేసింది. బాధితులను కలుసుకున్నవారి ఆచూకీ గుర్తించి వ్యాప్తిని అరికట్టటంలో కూడా విజయం సాధించింది. ఇంటింటి సర్వే, నిఘా, శ్వాస సంబంధమైన వ్యాధులతోను, దీర్ఘకాల వ్యాధులతోను బాధపడుతున్నవారిని గుర్తించటం, ముఖ్యంగా వృద్ధుల మీద దృష్టిపెట్టటం లాంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. కమ్టెయిన్మెంట్ వ్య్హం ద్వారా కంటెయిన్మెంట్, బఫర్ జోన్లను గుర్తించగలిగారు. ఆ విధంగా కోవిడ్ బాధితులను సకాలంలో గుర్తించి తీవ్రత ఆధారంగా ఇంట్లో ఉంచటమా, ఆస్పత్రికి పంపటమా అనే నిర్ణయం తీసుకున్నారు.
రోజువారీ పరీక్షల సంఖ్య పెంచుకోవటంలోనూ భారత్ లో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకు జరుగుతున్న పరీక్షల సంఖ్య మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 3,33,228 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఈ రోజు వరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,30,72,718 కు చేరుకుంది. దీనివల్ల ప్రతి పదిలక్షల మందిలో 9473 మందికి పరీక్షలు జరిపినట్టయింది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధనామండలి ఉమ్మడి కృషి ఫలితంగా టెస్టింగ్ లాబ్ ల నెట్ వర్క్ దేశంలో బాగా బలం పుంజుకుంది. దీంతో దేశంలోని మొత్తం లాబ్ ల సంఖ్య 1244 కి చేరుకోగా అందులో 880 ప్రభుత్వ ఆధ్వర్యంలోను, 364 ప్రైవేట్ రంగంలోను ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ : 638 (ప్రభుత్వ: 392 + ప్రైవేట్: 246)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 504(ప్రభుత్వ: 452 + ప్రైవేట్: 52)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 102 (ప్రభుత్వ: 36 + ప్రైవేట్: 66)
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
****
(Release ID: 1639516)
Visitor Counter : 216