పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

దేశంలో 28 రాష్ట్రాల‌ల‌కు సంబంధించిన 2.63 ల‌క్షల గ్రామీణ స్థానిక సంస్థ‌లకు ఆర్థిక మంత్రిత్వ‌శాఖ 2020 జూలై 15న 15,187.50 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేసింది. 15 వ ఆర్ధిక సంఘం 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సిఫార్సు చేసినట్టు టైడ్‌ గ్రాంటు కూడా ఇందులో ఇమిడి ఉంది.

టైడ్ గ్రాంటుల‌ను మౌలిక సేవ‌లైన (ఎ) పారిశుధ్యం, బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హిత (ఒడిఎఫ్) స్థాయి క‌ల్పించ‌డం (బి) మంచినీటి స‌ర‌ఫ‌రా , వ‌ర్ష‌పునిటీని భూమిలోకి ఇంకేట్టు చేయ‌డం, నీటి శుద్ధి వంటి కార్య‌క్ర‌మామ‌ల‌కు వాడ‌నున్నారు.

Posted On: 16 JUL 2020 8:17PM by PIB Hyderabad

పంచాయ‌తిరాజ్ మంత్రిత్వ‌శాఖ‌, తాగునీరు, పారిశుధ్య విభాగం, జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ‌శాఖ ల సిఫార్సుమేర‌కు దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాల‌లోగ‌ల 2.63 ల‌క్ష‌ల గ్రామీణ స్థానిక సంస్థ‌లు (ఆర్ఎల్ బిల‌)కు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 15187.50 కోట్ల రూపాయ‌లను 2020 జూలై 15న ఆర్ధిక మంత్రిత్వ‌శాఖ విడుద‌ల చేసింది. ఇందులో 15 వ ఆర్దిక సంఘం2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రానికి సిఫార్సుచేసిన టైడ్ గ్రాంటు కూడా ఇమిడి ఉంది.దీనిని గ్రామీణ స్థానిక సంస్థ‌లు మంచినీటి స‌ర‌ఫ‌రా, వ‌ర్ష‌పునీటి పొదుపు, నీటి శుద్ది,  బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హిత ప్రాంత స్థాయిని కాపాడేందుకు పారిశుధ్య నిర్వ‌హ‌ణ వంటి జాతీయ ప్రాధాన్య‌త క‌ల అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు వినియోగించ‌నున్నారు.
ఇందుకు సంబంధించిన స‌మాచారాన్ని తెలియజేస్తూ, కేంద్ర వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తిరాజ్ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌, గ్రామీణ స్థానిక సంస్థ‌లు కోవిడ్ -19 మ‌హ‌మ్మారి విసిరిన స‌వాలును ఎదుర్కొంటున్న‌ స‌మ‌యంలో వాటికి  అత్యంత స‌రైన స‌మ‌యంలో ఈ నిధులు విడుద‌ల కావ‌డం ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుందని ఆయ‌న అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు నిధులు అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల ,గ్రామీణ ప్రాంత‌ప్ర‌జ‌ల‌కు మౌలిక  స‌దుపాయాల‌ను మ‌రింత స‌మ‌ర్ధంగా అందించ‌డానికి వీలు కలుగుతుందని చెప్పారు. గ‌తంలో వ‌ల‌సపోయి  కోవిడ్ -19 కార‌ణంగా  తిరిగి స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్న కార్మికుల‌కు లాభ‌దాయ‌క ఉపాధిని క‌ల్పించ‌డానికి, గ్రామీణ ప్రాంతాల‌లో మౌలిక స‌దుపాయాల‌ను నిర్మాణాత్మ‌కంగా పెంపొందించ‌డానికి ఈ నిధులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు.
 ఇందుకు సంబంధించి మ‌రిన్ని  వివ‌రాలు తెలియ‌జేస్తూ శ్రీ తోమ‌ర్‌, పంచాయ‌తి రాజ్ మంత్రిత్వ‌శాఖ సిఫార్సుల‌మేర‌కు దేశ‌వ్యాప్తంగా గ‌ల 28 రాష్ట్రాల‌లోని 2.63 లక్ష‌ల స్థానిక సంస్థ‌ల‌కు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 15187.50 కోట్ల రూపాయ‌ల‌ను ఆర్థిక మంత్రిత్వ‌శాఖ 17 జూన్ 2020 న విడుద‌ల చేసింద‌న్నారు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ 15 వ ఆర్థిక సంఘం 2020-21 ఆర్ఙిక సంవ‌త్సరానికి సిఫార్సు చేసిన యునైటెడ్ గ్రాంటులో భాగ‌మ‌ని ఆయ‌న తెలిపారు. దీనిని గ్రామీణ స్థానిక సంస్థ‌లు ఆయా ప్రాంత అవ‌స‌రాలు తీర్చేందుకు వాడ‌తాయ‌న్నారు.
15వ ఆర్ధిక సంఘం 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రానికి త‌న మ‌ధ్యంత‌ర నివేదిక‌ను స‌మ‌ర్పించింది. స్థానిక సంస్జ‌లకు సంబంధించి దాని సిఫార్సుల‌ను భార‌త ప్ర‌భుత్వం ఆమోదించింది. గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు(ఆర్‌.ఎల్‌.బిల‌కు) 2020-21 ఆర్ధిక సంవ‌త్సరానికి మొత్తం గ్రాంటు రూ 60,750 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని క‌మిష‌న్ లెక్క‌కట్టింది. ఒక‌ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఫైనాన్సు క‌మిష‌న్ ఇప్ప‌టివ‌ర‌కు కేటాయించిన మొత్తాల‌లో ఇదే గ‌రిష్ఠం.
 15 వ ఫైనాన్స్ క‌మిష‌న్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పంచాయ‌తిరాజ్ వ్య‌వ‌స్థ‌లోని అన్ని ద‌శ‌ల‌కూ, అంటే 28 రాష్ట్రాల‌లోని ఐదు, ఆరు షెడ్యూలు ప్రాంతంలోని సంప్ర‌దాయ స్థానిక సంస్థ‌ల‌కు కూడా  ఈ నిధుల‌ను రెండు భాగాలుగా (1) బేసిక్‌గ్రాంటు (2) టైడ్ గ్రాంటుగా విడుద‌ల చేయాల‌ని  సిఫార్సు చేసింది. 50 శాతం గ్రాంటు బేసిక్ గ్రాంటుగా, మిగిలిన 50 శాతం టైడ్ గ్రాంటుగా ఉంటుంది.బేసిక్‌గ్రాంటులను క‌లిపి వాటిని గ్రామీణ స్థానిక సంస్థ‌లు  జీతాలు, ఇత‌ర ఎస్టాబ్లిష్‌మెంట్ ఖ‌ర్చుల‌కు మిన‌హా ఆయా ప్రాంత ప్ర‌త్యేక అవ‌స‌రాల‌కు అనుగుణంగా వాడ‌వ‌చ్చు.  టైడ్ గ్రాంటుల‌ను బేసిక్ స‌ర్వీసులైన (ఎ) పారిశుధ్యం, బ‌హిరంగ మ‌ల‌విసర్జ‌న ర‌హిత ప్ర‌దేశ స్థాయి నిర్వ‌హ‌ణ‌ (బి) తాగునీటి స‌ర‌ఫ‌రా, వ‌ర్ష‌పునీటిని కాపాడ‌డం, నీటి శుద్ది వంటి వాటికి వాడాల్సిఉంటుంది. ఈ టైడ్ గ్రాంటుల‌లో ఒక అర్ధ భాగాన్ని ఈ రెండు కీల‌క సేవ‌ల కోసం కేటాయించాలి. అయితే ఏదైనా గ్రామీణ స్థానిక సంస్థ‌లో ఒక కేట‌గిరీ అవ‌స‌రాలు పూర్తిగా తీరిపోతే ఆ నిధుల‌ను మ‌రో కేట‌గిరీ ప‌నుల‌కు వాడ‌వ‌చ్చు.
 రాష్ట్ర ప్ర‌భుత్వాలు 15 వ ఆర్దిక సంఘం గ్రాంటుల‌ను పంచాయ‌తిరాజ్ వ్య‌వ‌స్థ‌లోని అన్ని ద‌శ‌ల‌కూ అంటే గ్రామ‌, బ్లాకు, జిల్లా, అలాగే సంప్ర‌దాయ సంస్థ‌లైన ఐదు, ఆరు షెడ్యూళ్ళ‌లొని ప్రాంతాల‌కు ఆయా రాష్ట్రాల ఫైనాన్స్ క‌మిష‌న్ సిఫార్సుల‌కు అనుగుణంగా, 15 వ ఫైనాన్సు క‌మిష‌న్ సూచించిన శాత‌ల మేర‌కు పంపిణీ చేయ‌వ‌ల‌సి  ఉంటుంది.
    70-85 %  గ్రామ‌, గ్రామ‌పంచాయ‌తి
     10-25 %  బ్లాకు, మ‌ధ్య‌శ్రేణి పంచాయ‌తీలు
       5-15 %   జిల్లా, జిల్లా పంచాయ‌తీలు
గ్రామ‌, జిల్లా పంచాయ‌తీల వంటి రెండంచెల వ్య‌వ‌స్థ‌ మాత్ర‌మే  ఉన్న రాష్ట్రాల‌లో పంపిణీ  గ్రామ‌, గ్రామ‌పంచాయితీల‌కు 70-85% , ,  జిల్లా,జిల్లా పంచాయ‌తీల‌కు15-30 % కేటాయిస్తారు.
 అంత‌ర్గ‌త పంపిణీకి సంబంధించి  ఒక ద‌శ‌లోని సంస్థ‌ల విష‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా(ఐదు, ఆరు షెడ్యూలు ఏరియాల‌తో స‌హా) జ‌నాభా, ప్రాంత విస్తీర్ణం నిష్ప‌త్తి 90:10 లేదా రాష్ట్ర ఫైనాన్సు క‌మిష‌న్ ఆమోదించిన‌ సిఫార్సుల‌కు అనుగుణంగా ఉంటుంది.
 15 వ ఆర్ధిక సంఘం గ్రాంట్లను సమర్థంగా ఉపయోగించుకోవడంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ చురుకైన‌ మద్దతు ఇస్తుంది. ప్రతి గ్రామీణ స్థానిక సంస్థ‌ స్థాయిలో పనులు , నిధుల ప్రవాహ ప్రణాళిక, పర్యవేక్షణ, అకౌంటింగ్ , ఆడిటింగ్ కోసం వెబ్ , ఐటి ఆధారిత ప్లాట్‌ఫాంను అందించడం ద్వారా ఈ మ‌ద్ద‌తు నిస్తుంది.

 

*****


(Release ID: 1639509) Visitor Counter : 547