వ్యవసాయ మంత్రిత్వ శాఖ

గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 21.2 శాతం పెరిగిన ఖ‌రీఫ్ సాగు నాట్ల‌ విస్తీర్ణం
17.07.2020 నాటికి ఖ‌రీఫ్‌పంట‌లు 691.86 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లుప‌డ‌గా గ‌త ఏడాది ఇదే సంవ‌త్స‌రం 570.86 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లు ప‌డ్డాయి.

Posted On: 17 JUL 2020 4:03PM by PIB Hyderabad

దేశంలో 16.07.2020 నాటికి 338.3 మి.మీ వ‌ర్ష‌పాతం ప‌డింది. సాధార‌ణ వ‌ర్ష‌పాతం 308.4 మి.మీ. 16.07.2020 నాటికి సిడ‌బ్ల్యుసి నివేదిక ప్రకారం, దేశంలోని123 రిజ‌ర్వాయ‌ర్ల‌లో ప్ర‌త్య‌క్ష‌ నీటి నిల్వ అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 150 శాతం అధికంగా ఉంది. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల  స‌గ‌టు నీటి నిల్వ‌ను గ‌మ‌నిస్తే 133 శాతంగా  ఉంది.
17.07.2020న మొత్తం ఖ‌రీఫ్ పంట‌లు 691.86ల‌క్ష‌ల హెక్టార్ల‌లొ నాట్లువేయ‌గా, అంత‌కు ముందు సంవ‌త్స‌రం ఇదే కాలంలో 570.86 ల‌క్ష‌ల హెక్టార్ల‌లోనాట్లు వేశారు. దీనితో ప్ర‌స్తుతం దేశంలో గ‌త ఏడాది కంటే 21.20 శాతం అధిక విస్తీర్ణంలొ నాట్లుప‌డిన‌ట్టు లెక్క‌

ఖ‌రీఫ్ పంట‌ల‌కు సంబంధించి నాట్లుప‌డిన విస్తీర్ణం కింది విధంగా ఉంది:
రైతులు వ‌రి 16.47 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లువేయ‌గా గ‌త ఏడాది 142.06 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లువేశారు.  నాట్లుప‌డిన‌ విస్తీర్ణం పెరుగుద‌ల 18.59 శాతం.
ప‌ప్పులు 81.66 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లు వేయ‌గా గ‌త ఏడాది 61.70 ల‌క్ష‌ల హెక్టార్ల‌లోనాట్లువేశారు.  విస్తీర్ణంలో పెరుగుద‌ల 32.35 శాతం.
ముత‌క ధాన్యాలు 115.60 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేయ‌గా గ‌త ఏడాది 103.00 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు.  విస్తీర్ణంలో పెరుగుద‌ల 12.23 శాతం .
నూనె గింజ‌లు 154.95 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో వేయ‌గా గ‌త ఏడాది 110.09 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు.  విస్తీర్ణంలో పెరుగుద‌ల‌ 40.75 శాతం.
 చెర‌కు  51.29 ల‌క్ష‌ల హెక్టార్ల‌లొ వేయగా గ‌త ఏడాది 50.82 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు. విస్తీర్ణంలో పెరుగుద‌ల 0.92 శాతం.
  ప‌త్తి 113.01 ల‌క్ష‌ల హెక్టార్ల విస్తీర్ణంలో వేయ‌గా గ‌త ఏడాది 96.35 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు. విస్తీర్ణంలో పెరుగుద‌ల 17.28 శాతం.
జ‌న‌ప‌నార‌, గోగు పంట‌లు 6.88 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేయ‌గా, గ‌త ఏడాది 6.84 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు. విస్తీర్ణంలో పెరుగుద‌ల 0.70 శాతం.
అందువ‌ల్ల ప్ర‌స్తుతానికి దేశంలో ఖ‌రీఫ్ పంట‌ల సాగు విస్తీర్ణం పెరుగుద‌ల‌పై  కోవిడ్ -19 ప్ర‌భావం ఏదీ లేదని తెలుస్తోంది..

మ‌రిన్ని వివ‌రాల‌కు లింక్‌ క్లిక్ చేయండి..

 

****(Release ID: 1639434) Visitor Counter : 28