పర్యటక మంత్రిత్వ శాఖ

బౌద్ధ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పిలుపు “సీమాంతర పర్యాటకం”పై వెబన్ నార్ లో ప్రసంగం

దేశంలోని బౌద్ధ పర్యాటక స్థలాల అభివృద్ధికి తమ మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుందని ప్రకటన

Posted On: 17 JUL 2020 12:36PM by PIB Hyderabad

సీమాంతర పర్యాటకంపై వెబ్.నార్.ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ప్రహ్లాద్ సింగ్ పటేల్ 2020 జూలై 15  ప్రారంభించారు. బౌద్ధ స్థలాల పర్యటనల నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో జరిగన కార్యక్రమంలో ప్రహ్లాద్ సింగ్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల మండలి ప్రతినిధులు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఇండోనేసియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం తదితర దేశాలకు చెందిన పర్యాటక, ఆతిథ్య సంఘాల ప్రతినిధులు వెబ్.నార్ లో పాల్గొన్నారు.

  వెబ్ నార్ లో కేంద్రమంత్రి మాట్లాడుతూ,..భారతదేశంలో గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన స్థలాల జాబితాను పేర్కొన్నారు. బౌద్ధమతాన్ని అనుసరించేవాళ్లు, అభిమానించేవాళ్లు ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఉన్నారని, అయితేబుద్ధ భూమి పేరుగాంచిన భారతదేశంలో అనేక బౌద్ధమత వారసత్వ కట్టడాలు ఉన్నా, చాలా తక్కువమంది పర్యాటకులను మాత్రమే భారత్ ఆకర్షించగలుగుతోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధుల్లో కొద్దిమంది బౌద్ధ పర్యాటకులను మనదేశం మాత్రమే ఆకర్షించడానికి కారణాలేమిటో మదింపు చేసుకుని, తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

   దేశంలోని ప్రముఖమైన బౌద్ధ క్షేత్రాల స్థలాల్లో చైనా భాషతో సహా ఇతర అంతర్జాతీయ భాషల్లో అవసరమైన గుర్తింపు బోర్డులను ఏర్పాటుచేయాలని మంత్రి సూచించారు. ఐదు బౌద్ధ క్షేత్రాల్లో ఇదివరకే చైనా భాషలో ఏర్పాటుచేసిన గుర్తింపు బోర్డుల వంటివి ముఖ్యమైన బౌద్ధ పర్యాటక స్థలాన్నింటిలో ఏర్పాటు చేయాలన్నారు. ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్, కుషీనగర్, శ్రావస్తి ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సాంచి బౌద్ధ క్షేత్రం శ్రీలంనుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నందున సాంచి క్షేత్రంలోని బౌద్ధ కట్టడాలవద్ద సింహళ భాషలో గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేశారన్నారు.

  ఉత్తరప్రదేశ్ లోని బౌద్ధ క్షేత్రమైన కుషీనగర్ లోని విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.

  కుషీనగర్.ను అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్రకటించిన పక్షంలో,..విమాన ప్రయాణికులతో అనుసంధానం మరింత మెరుగుపడుతుందని మంత్రి అన్నారు. దీనితో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకానికి ఊపు వస్తుందని, ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి చెప్పారు.

 దేశంలోని బౌద్ధ క్షేత్రాల పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు, ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు.

   బౌద్ధ స్థలాల పర్యటనా నిర్వాకుల సంఘం,.. బౌద్ధ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి అంకిత భావంతో కృషి చేస్తోంది. సంఘానికి మన దేశంలోనూ, విదేశాల్లోనూ 1500మంది సభ్యులు ఉన్నారు.

 

***

 



(Release ID: 1639378) Visitor Counter : 191