శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

'శాస్త్రీయ సహకార ఒప్పందం'ను మ‌రో అయిదేండ్ల పాటు పున‌రుద్ధ‌రించేందుకు భార‌త్-ఐరోపా స‌మాఖ్యల‌‌ అంగీకారం

Posted On: 16 JUL 2020 7:21PM by PIB Hyderabad

'శాస్త్రీయ సహకార ఒప్పందాన్ని' వ‌చ్చే ఐదేండ్ల కాలానికీ (2020-2025 వ‌ర‌కు) పున‌రుద్ధ‌రించేందుకు గాను.. ఇండియా-ఈయూ 15వ స‌మావేశంలో భారత్ మ‌రియు ఐరోపా స‌మాఖ్య‌లు అంగీకరించాయి. భారత్‌- ఈయూ శిఖరాగ్రపు సమావేశానికి భారతదేశం త‌ర‌ఫున‌ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం వహించారు. ఈ వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందానికి యూరోపియన్ స‌మాఖ్య‌ అధ్యక్షుడు ఛార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లు పాల్గొన్నారు.
తాజాగా స్వీకరించిన పునరుద్ధరణ ఒప్పందంలో భాగంగా భారతదేశం మరియు ఐరోపా స‌మాఖ్య‌లు రెండూ.. పరస్పర ప్రయోజనం, పరస్పర సూత్రాల ఆధారంగా పరిశోధనలు మరియు ఆవిష్కరణలలో మరింత సహకరించుకోవాల‌ని అంగీక‌రించాయి. సైన్స్ అండ్ టెక్నాలజీపై 2001లో ఏర్ప‌టైన భార‌త్‌-ఐరోపా స‌మాఖ్యల‌ శాస్త్రీయ సహకార ఒప్పందం మే 17 తో ముగిసింది. "పునరుద్ధరణ విధానాన్ని సకాలంలో ప్రారంభించడానికి రెండు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. పరిశోధన మరియు ఆవిష్కరణలపై గ‌త 20 సంవత్సరాల బలమైన సహకారాన్ని గుర్తించాం" అని ఇరుప‌క్షాలు ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. నీరు, శక్తి, ఆరోగ్య సంరక్షణ, అగ్రిటెక్ మ‌రియు బయో ఎకానమీ, ఇంటిగ్రేటెడ్ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్, ఇన్‌ఫ‌ర్మేషన్  కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీస్, నానో టెక్నాలజీ మరియు క్లీన్ టెక్నాలజీస్ వంటి వివిధ రంగాలలో పరిశోధన మరియు ఆవిష్కరణ సహకారాన్ని పెంచడానికి తాజా ఒప్పందం పున‌రుద్ధ‌ర‌ణ దోహ‌దం చేయ‌నుంది. ఇది పరిశోధనలో సంస్థాగత సంబంధాలను బలోపేతం చేయ‌డంతో పాటుగా పరిశోధకులు, విద్యార్థులు, అంకుర సంస్థ‌ల మార్పిడితో పాటు జ్ఞాన సహతరం వనరులను సహ పెట్టుబడుల‌ను ఆకర్షించ‌నుంది.
భాగ‌స్వామ్య‌ప‌క్షాల వారితో స‌మావేశం..
ఐరోపా స‌మాఖ్యతో 'శాస్త్రీయ సహకార ఒప్పంద‌' పున‌రుద్ధ‌ర‌ణ విష‌య‌మై అంతకుముందు కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక, ఆరోగ్య మరియు కుంటుంబ
సంక్షేమ శాఖ‌, ఎర్త్ సైన్సెస్‌ల‌ శాఖల‌ మంత్రి డాక్టర్ హర్ష్‌ర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భాగ‌స్వామ్య‌ప‌క్షాల వారితో ఒక సమావేశాన్ని నిర్వ‌హించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్& టెక్నాలజీ (డీఎస్‌టీ), బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంఓఈఎస్) మ‌రియు సీఎస్ఐఆర్ అధికారుల‌తో మంత్రి ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సమీక్షా సమావేశం దేశాల మధ్య ఎస్ & టీ సహకారంపై ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సూచించింది. భాగ‌స్వామ్య ప‌క్షాల వారు గత 5 సంవత్సరాల కాలంలో దాదాపు 73 ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు అమలు చేయబడ్డాయి. ఫలితంగా 200 ఉమ్మడి పరిశోధన ప్రచురణలు మరియు కొన్ని పేటెంట్లను దాఖలు చేయ‌బ‌డిన‌ట్టుగా వెల్ల‌డించారు.
ఇదే స‌మ‌యంలో.. 500ల‌కు పైగా పరిశోధకులు మ‌రియు విద్యార్థులు విజ్ఞాన
మార్పిడి సందర్శనలు కూడా జరిపారు. గ‌త అయిదు సంవత్సరాలలో జ్ఞాన ఉత్పత్తి, మానవ సామర్థ్య అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి, నీరు, ఆరోగ్యం, మెటీరియల్ (నానో సైన్సెస్‌తో సహా) & బయో ఎకానమీ విభాగాల్లో‌నూ త‌గిన‌ సాంకేతిక విస్తరణ జరిగింది. సమీక్షా సమావేశంలో డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, డీబీటీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, సీఎస్ఐఆర్ డీజీ ప్రొఫెసర్ శేఖర్ మాండే, ఎంఓఈఎస్ సైంటిస్ట్ పర్విందర్ మైనీ, బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం సైంటిఫిక్ కౌన్సిలర్ ఎన్ మధుసూదన్ రెడ్డి, డాక్ట‌ర్ ఎస్‌కే వ‌ర్షిణై ఇత‌ర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


 

*****


(Release ID: 1639198) Visitor Counter : 217