ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీ ‘ఎయిమ్స్’లో రాజ్ కుమారి అమృత్ కౌర్ ఓపీడీ బ్లాకును ప్రారంభించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్

“ప్రస్తుత ఆరోగ్య రక్షణ వ్యవస్ధను మదింపు చేద్దాం..
నాణ్యతకోసం సంస్కరణలు తెద్దాం”

“రోజుకు పదిలక్షల స్థాయికి కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుదాం”
పారంభోత్సవ ప్రసంగంలో హర్షవర్ధన్ పిలుపు

Posted On: 16 JUL 2020 5:02PM by PIB Hyderabad

 న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన అధ్యయన సంస్థ (ఎయిమ్స్) ఆసుపత్రిలో రాజ్ కుమారి అమృత్ కౌర్ పేరిట ఏర్పాటు చేసిన ఔట్ పేషెంట్ బ్లాకును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రోజు ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వనీకుమార్ చౌబే, ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్. గులేరియా, ఎయిమ్స్ సీనియర్అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

  సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ,..సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధురాలు, దేశం తొలి ఆరోగ్యమంత్రి అయిన రాజ్ కుమారి అమృత్ కౌర్ పేరిట కొత్త ఔట్ పేషెంట్ బ్లాకును ప్రారంభించడం హర్షదాయకమని అన్నారు. కోవిడ్-19పై దేశంలో సమైక్యంగా సాగుతున్న పోరాటాన్ని మంత్రి వివరిస్తూ,.. కోవిడ్ మహమ్మారిపై విజయ సాధన దిశగా మనం ముందుకు సాగుతున్నామని అన్నారు. కోవిడ్ సోకిన వారిలో 2శాతంకంటే తక్కువ మందికి మాత్రమే .సి.యు.లో చికిత్స అవసరమవుతోందని, దేశంలో లేబరేటరీ వ్యవస్థకూడా ఎంతో పటిష్టపడిందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. 2020 జనవరిలో కేవలం ఒక లేబరేటరీ మాత్రమే ఉండగా, ఇపుడు వాటి సంఖ్య 1,234కు చేరిందని అన్నారు. ఇప్పటివరకూ రోజుకు 3లక్షల 26వేలకు పైగా పరీక్షలు చేశామని, రానున్న 12 వారాల వ్యవధిలో రోజూ పదిలక్షల స్థాయికి టెస్టింగ్ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు. టెస్టుల సామర్థ్యం పెంపుదలకు అనుగుణంగా కోలుకుంటున్నకోవిడ్ రోగుల సంఖ్య కూడా పెరుగుతోందని, కోలుకుంటున్న వారి సంఖ్యకు, చికిత్స పొందుతున్నవారి సంఖ్యకు మధ్య తేడా (2,81,668) స్థిరంగా  పెరుగుతూ వస్తోందని అన్నారు. కోవిడ్ వైరస్ మహమ్మారిపై  క్రమానుసారంగా, ముందస్తు జాగ్రత్తగా, క్రియాశీలంగా చర్యలు తీసుకునే పద్ధతిని అనుసరించడం వల్లనేప్రభుత్వం మొత్తంగాచేపట్టిన వ్యూహం సానుకూల ఫలితాలనిస్తోందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.

  ఎయిమ్స్ ఆసుపత్రిలోని తల్లీ, బిడ్డల బ్లాకు, వయోవృద్ధుల బ్లాకు, శ్రస్త్ర చికిత్సా బ్లాకులను పూర్తిస్థాయిలో క్రియాశీలంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ హర్షవర్ధన్ ఎయిమ్స్ డైరెక్టర్ ను, ఇతర అధికారులను ఆదేశించారు. అప్పుడే,.సాధ్యమైనంత త్వరగా ప్రజలు ఆరోగ్య రక్షణ ప్రయోజనాలు పొందగలుగుతారని  అన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ ఉత్తమమైన, నాణ్యతతో కూడిన ఆరోగ్య రక్షణ లభించేలా తీసుకోవలసిన వినూత్న చర్యలపై చర్చించేందుకు ఆసుపత్రిలోని ప్రతి విభాగంలో మేథోమధనం జరగాలన్నారు. ఆసుపత్రి అధికారులు, వివిధ విభాగాల అధిపతులు అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

 “రోగులకు ఇబ్బంది కలిగించేలా, నాసిరకం ఆరోగ్య రక్షణ పద్ధతులను మాత్రం సహించరాదు.” అని ఆయన అన్నారు. రోగులకు మేలు చేకూర్చే సంస్కరణలను ఆసుపత్రిలో ప్రవేశపెట్టే అంశంపై మేథోమధనం జరగాలని సూచించారు.

  కేంద్ర సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే మాట్లాడుతూ,.. అధునాతన సదుపాయాలతో కూడిన ఔట్ పేషెంట్ విభాగం భవన నిర్మాణానికి దోహదపడిన వారందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఉత్తమ ప్రమాణాలతో కూడిన చికిత్సను, ఆరోగ్య రక్షణను అందిస్తున్నందున ఆసుపత్రిపై దేశం నలుమూలల్లో ఉన్న పౌరులకు విశ్వాసం ఉందని, ఎయిమ్స్ గొప్ప సంప్రదాయాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకోవాలని అన్నారు. కోవిడ్ వైరస్ మహమ్మారిపై పోరాటంలో తమ జీవితాలను త్యాగం చేస్తున్న కరోనా యుద్ధవీరులపట్ల తనకు ఎంతో గౌరవభావం ఉందని మంత్రి అన్నారు.

  మంత్రులు ఎయిమ్స్ ఆసుపత్రిలోని పలు ఔట్ పేషెంట్ విభాగాలను తనిఖీచేశారు. రోగులకు అందిస్తున్న సదుపాయాలను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

  ఎయిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 6,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన రాజ్ కుమారి అమృత్ కౌర్ ఔట్ పేషెంట్ బ్లాకు దేశంలోనే అతిపెద్దది. బ్లాకులోని స్మార్ట్ లేబరేటరీని 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. పలువురు పరీక్షల విశ్లేషకులు, సాంకేతిక నిపుణులు ఒకే చోట కలిసి, సమైక్యంగా పనిచేసే కేంద్రంగా లేబరేటరీని తీర్చిదిద్దారు. ఇక్కడ పరీక్షల విశ్లేషణలన్నింటినీ ఒకే రోబోటిక్ ట్రాక్.తో అనుసంధానం చేశారు. రోజుకు రెండు లక్షల పరీక్షల స్థాయి వరకూ వైద్య పరీక్షలను విస్తరించగలిగే శక్తి లేబరేటరీకి ఉంది. రోజుకు పదివేల మంది రోగులకు సేవలందించ గలిగేలా విభాగాన్ని నిర్మించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్దదైన ట్రాక్ ఆధారిత లేబరేటరీగా ఇది నిర్మితమైంది. కేవలం సంవత్సరంకంటే తక్కువ వ్యవధిలోనే బ్లాకును ప్రారంభించారు.  

***


(Release ID: 1639161) Visitor Counter : 206