హోం మంత్రిత్వ శాఖ
ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
- ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రారంభమైన స్కిల్ ఇండియా మిషన్‌కు ఐదేండ్లు పూర్తయిన తరుణమిది- హోం మంత్రి
- యువతలో వ్యవస్థాపక స్ఫూర్తిని పెంచడంలో స్కిల్ ఇండియా ప్రధాన పాత్ర పోషించింది- శ్రీ అమిత్ షా
- ఉద్యోగార్ధులుగా ఉన్న వారిని ఉద్యోగకల్పకులుగా మారేలా ప్రోత్సహించడం ద్వారా, ప్రధాన మంత్రి మోడీ ఆత్మనిర్భర్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విషయంలో స్కిల్ ఇండియా విధానం కచ్చితంగా ధీర్ఘకాలం దోహదం చేస్తుంది
Posted On:
15 JUL 2020 3:01PM by PIB Hyderabad
ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు యువతకు తన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి
శ్రీ అమిత్ షా ట్వీట్‌లో మాట్లాడుతూ “ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దూరదృష్టి గల నాయకత్వంలో ప్రారంభించబడిన స్కిల్ ఇండియా మిషన్ నేటితో ఐదేండ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది” అని అన్నారు. “స్కిల్ ఇండియా దేశంలోని యువతకు సరైన నైపుణ్య సమితులను అందించి తద్వారా వారిలో అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుతోందని మరియు వారిలో వ్యవస్థాపకత యొక్క స్ఫూర్తిని పెంచడంలో ప్రధాన పాత్రను పొషిస్తోంది" అని వివరించారు.
ఉద్యోగార్ధులుగా ఉన్న వారిని ఉద్యోగకల్పకులుగా మారేందుకు ప్రోత్సహించడం ద్వారా ప్రధాన మంత్రి మోడీ ఆత్మ నిర్భర్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విషయంలో స్కిల్ ఇండియా కచ్చితంగా దీర్ఘకాలం దోహదం చేస్తుందని శ్రీ అమిత్ షా తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. స్కిల్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క చొరవ, ఇది దేశంలోని యువతను నైపుణ్య సమితులతో శక్తివంతం చేయడానికి ప్రారంభించబడింది. ఇది వారి పని వాతావరణంలో మరింత ఉపాధి మరియు ఉత్పాదకతకు వీలు కల్పిస్తుంది. స్కిల్ ఇండియా అనేక రంగాలలోని కోర్సులను అందిస్తుంది. ఇవి జాతీయ నైపుణ్య అర్హత ముసాయిదా కింద పరిశ్రమ మరియు ప్రభుత్వం రెండింటిచే గుర్తించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
***
(Release ID: 1638900)