ప్రధాన మంత్రి కార్యాలయం
నైపుణ్యాల ను సాధిస్తూ, వాటికి మెరుగులు దిద్దుకోవాలని, ఇంకా అదనపు ప్రావీణ్యాల ను కూడా అలవరచుకొంటూ ముందుకు సాగిపోవాలని ప్రపంచ యువజన నైపుణ్య దినం నాడు ఉద్బోధించిన ప్రధాన మంత్రి
స్కిల్ ఇండియా మిశన్ స్థానికం గాను మరియు ప్రపంచ స్థాయి లోను ఉద్యోగ లభ్యత కై అవకాశాల ను మెరుగుపరచింది: ప్రధాన మంత్రి
నైపుణ్యం గల కార్మికుల ను గుర్తించడానికి ఇటీవల ప్రారంభించిన పోర్టల్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది శ్రమికుల కు మరియు ఇటీవల వారి ఇళ్ల కు తిరిగి వచ్చిన ప్రవాసీ శ్రమికుల కు నౌకరీల ను అందుకోవడాన్ని సులభతరం చేయగలదన్నారు
నైపుణ్య సాధన అవకాశాల ను సద్వినియోగపరచుకొని మరి ప్రపంచ గిరాకీ ని భర్తీ చేయడం లో దేశాని కి విశాల సామర్థ్యం ఉందని ప్రముఖం గా పేర్కొన్న ప్రధాన మంత్రి
Posted On:
15 JUL 2020 11:33AM by PIB Hyderabad
ప్రపంచ యువజన నైపుణ్య దినం మరియు ‘స్కిల్ ఇండియా’ మిశన్ యొక్క అయిదో వార్షికోత్సవం సందర్భం లో ఈ రోజున జరిగిన డిజిటల్ స్కిల్స్ కాన్ క్లేవ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిన సందేశం లో శరవేగం గా మారిపోతున్న వ్యాపార వాతావరణం మరియు విపణి పరిస్థితుల లో ఉపయుక్తం గా ఉండడం కోసమని నైపుణ్యాల ను సాధిస్తూ, కౌశలానికి మెరుగులు దిద్దుకోవాలని, ఇంకా అదనపు ప్రావీణ్యాన్ని సైతం అలవరచుకొంటూ ముందుకు సాగిపోవలసింది గా యువతీయువకుల కు ఉద్బోధించారు. ప్రపంచ యువజన నైపుణ్య దినాన్ని మరియు స్కిల్ ఇండియా మిశన్ యొక్క అయిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశ యువత కు ఆయన అభినందనలు పలుకుతూ, ప్రపంచం యువతదే నని ఎల్ల వేళ ల క్రొత్త క్రొత్త ప్రావీణ్యాల ను అందిపుచ్చుకొనే సామర్థ్యం యువతీయువకుల లో ఉండడమే దీనికి కారణం అన్నారు.
స్కిల్ ఇండియా మిశన్ ను అయిదు సంవత్సరాల క్రితం ఇదే రోజు న ప్రారంభించగా అది నైపుణ్యాల ను సంతరించడానికి, కౌశలాని కి సాన పెట్టుకోవడానికి, ఇంకా అదనపు పటిమ ను సాధించుకోవడానికి విస్తృత స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కు దారి తీసిందని, స్థానికం గా, ప్రపంచవ్యాప్తం గా ఉపాధి అందుకొనే అవకాశాల ను కూడా అధికం చేసిందని ఆయన వివరించారు. ఇది దేశం అంతటా వందలాది పిఎమ్ కౌశల్ కేంద్రాలు ఏర్పాటు అవుతూ ఉండడానికి దోవ ను ఏర్పరచి మరి ఐటిఐ సంబంధి ఇకోసిస్టమ్ యొక్క సామర్ధ్యం పెరిగేందుకు దోహదపడిందన్నారు. ఈ ఏకోన్ముఖ ప్రయాసల వల్ల, అయిదు కోట్ల కు పైగా యువజనుల కు గడచిన అయిదు సంవత్సరాల కాలం లో పనితనాన్ని అందించడమైందన్నారు. నిపుణులైన ఉద్యోగులు మరియు యాజమాన్యాల వివరాలను సేకరించడం కోసం ఇటీవల ప్రారంభించిన పోర్టల్ ను గురించి ఆయన ప్రస్తావించి, ఇది చేయి తిరిగిన శ్రమికులు, సొంతవూళ్ల కు తిరిగివచ్చిన ప్రవాసీ శ్రమికులు సులభతర పద్ధతి లో కొలువుల ను అందుకోవడానికి తోడ్పడుతుందని, యాజమాన్యాలు కంప్యూటర్ యొక్క మౌస్ ను క్లిక్ చేసినంత మాత్రాన నే నిపుణ ఉద్యోగుల ను సంప్రదించేందుకు వీలు ఉంటుందన్నారు. ప్రవాసీ శ్రమికుల కౌశలాలు స్థానిక ఆర్థిక వ్యవస్థ రూపురేఖల ను మార్చడం లో కూడా ను సహాయకారి కాగలవు అని ఆయన ఉద్ఘాటించారు.
నైపుణ్యాలు అనేవి ఒక బహుమతి వంటివి, అని వాటి ని మనల కు మనం ఓ బహుమానం గా ఇచ్చుకోవచ్చు అంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు. అలాగే నైపుణ్యాలు అనేవి కాలానికి అతీతం అయినవని, విశిష్టం అయినవని, ఒక ఖజానా వంటివి, అంతే కాదు అది ఒక వ్యక్తి ఉద్యోగార్హత ను సంపాదించుకోవడం ఒక్కటే కాకుండా ఒక సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేందుకు కూడాను సహాయకారి అవుతాయి అని ఆయన అన్నారు. నూతన నైపుణ్యాల ను ఆర్జించాలి అనే స్వాభావిక ఆకర్షణ ఎవరికైనా ఓ నవీనమైన శక్తి తో పాటు జీవనం లో ప్రోత్సాహాన్ని కూడా అందిస్తుందన్నారు. నైపుణ్యాలు కేవలం బ్రతుకుతెరువు కు ఒక సాధనమే కాకుండా మన రోజువారీ నియమిత చర్యల లో హుషారు గాను, శక్తిమంతం గాను ఉండేందుకు ఒక హేతువు కూడా అవుతాయి అని ఆయన అన్నారు.
జ్ఞానాని కి మరియు నైపుణ్యాని కి మధ్య భిన్నత్వాన్ని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో వెల్లడి చేశారు. ఆయన దీనిని ఒక ఉదాహరణ తో చాటిచెప్పారు.. సైకిల్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడం జ్ఞానం అని, అదే సైకిల్ ను నడపగలగడం నైపుణ్యం కిందకు వస్తుందన్నారు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మరియు వాటి భిన్న సందర్భాల ను, అలాగే ఈ రెంటి నడుమ న గల అంత:సూచనల ను అర్థం చేసుకోవడం యువత కు ముఖ్యం అని ఆయన చెప్పారు. వడ్రంగాన్ని గురించిన ఉదాహరిస్తూ, నైపుణ్యాన్ని సాధించడానికి, నైపుణ్యాని కి మెరుగులు దిద్దుకోవడానికి మరియు నైపుణ్యాన్ని పెంపొందింపచేసుకోవడానికి మధ్య గల స్వల్పభేదాల ను వివరించారు.
దేశం లో లభిస్తున్న నైపుణ్య సాధన సంబంధి అవకాశాల ను సద్వినియోగపరచుకొనేందుకు దేశాని గల సామర్ధ్యాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ఆరోగ్య సంరక్షణ రంగాన్ని గురించి ఆయన ఒక ఉదాహరణ గా తీసుకొంటూ, ఈ రంగం లో నైపుణ్యం గల భారతీయ శ్రమ శక్తి ప్రపంచ గిరాకీ ని భర్తీ చేయగలదిగా ఉన్నది అన్నారు. ఈ డిమాండు ను మేప్ చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని, అలాగే భారతీయ ప్రమాణాల ను ఇతర దేశాల ప్రమాణాల తో తుల తూగేటట్టు చేసుకోవాలని చెప్పారు. అదే విధం గా, దీర్ఘకాలిక నౌకావాణిజ్య సంబంధి సంప్రదాయం కలిగిన భారతీయ యువత ఈ రంగం లో పెరుగుతున్న గిరాకీ కారణం గా ప్రపంచంలోని పలు దేశాల లో వాణిజ్య నౌకల కు చేయి తిరిగిన నావికుల రూపం లో తోడ్పాటు ను అందించవచ్చు అని ఆయన సూచించారు.
ప్రతి సంవత్సరం జూలై 15వ తేదీ నాడు జరుపుకొనే ప్రపంచ యువ నైపుణ్య దినాన్ని ఈ ఏడాది లో వర్చువల్ పద్ధతి న జరిపారు. నైపుణ్యాభివృద్ధి మరియు నవపారిశ్రామికత్వం శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే, నైపుణ్యాభివృద్ధి మరియు నవపారిశ్రామికత్వం శాఖ సహాయ మంత్రి శ్రీ ఆర్.కె. సింహ్, మరియు లార్నెస్ ఎండ్ టుబ్రో లిమిటెడ్ గ్రూపు చైర్ మన్ శ్రీ ఎ.ఎమ్. నాయిక్ లు ఈ కాన్ క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించారు. లక్షల సంఖ్య లో గల శిక్షణార్థులు సహా వ్యవస్థ లోని సంబంధిత అన్ని వర్గాల వారు ఈ కాన్ క్లేవ్ లో పాలుపంచుకొన్నారు.
***
(Release ID: 1638787)
Visitor Counter : 238
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam