ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోజుకు మిలియన్ జనాభాకు 140 పరీక్షలు చేయాలని సూచించిన - ప్రపంచ ఆరోగ్య సంస్థ

భారతదేశంలోని 22 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు ఇప్పటికే రోజుకు మిలియన్ జనాభాకు 140 కంటే ఎక్కువ పరీక్షలు చేస్తున్నాయి.

మిలియన్ జనాభాకు 8,994 కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

Posted On: 15 JUL 2020 12:59PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) తన మార్గదర్శక ప్రకటనలో “కోవిడ్-19 సందర్భంలో ప్రజారోగ్యం మరియు సామాజిక చర్యలను సర్దుబాటు చేయడానికి ప్రజా ఆరోగ్య ప్రమాణాలు” అనే అంశంపై అనుమానిత కేసుల కోసం సమగ్ర నిఘా నిర్వహించాలని సూచించింది.  సమగ్ర నిఘా మరియు అనుమానిత కేసుల పరీక్షలు నిర్వహించే విధానాన్ని వివరిస్తూ, ఏ దేశానికైనా మిలియన్ జనాభాకు రోజుకు 140 పరీక్షలు చేయవలసిన అవసరం ఉందని, డబ్ల్యూ.హెచ్.ఓ. సలహా ఇచ్చింది. 

States testing more than 140 per day per million.jpg

కేంద్రం మరియు రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు చేసిన వివిధ సమన్వయ ప్రయత్నాల ఫలితంగా,   భారతదేశంలోని 22 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు ఇప్పటికే రోజుకు మిలియన్‌ జనాభాకు 140 మరియు అంతకంటే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.  డబ్ల్యూ.హెచ్.ఓ. సూచించిన పరీక్షల స్థాయికి సరిపోయేలా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు క్రమం తప్పకుండా సలహా ఇస్తున్నారు.

దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 పరీక్షల సంఖ్యకు బలంగా సహాయపడే కారకాల్లో ఒకటి, కోవిడ్-19 పరీక్షల కోసం క్రమంగా పెరుగుతున్న ప్రయోగశాలలు నెట్ ‌వర్క్.  ప్రభుత్వ రంగంలో 865 ప్రయోగశాలలతో పాటు, 358 ప్రయివేటు ప్రయోగశాలలతో ఈ రోజు వరకు మొత్తం 1,223 పరీక్షా ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.  పరీక్ష కోసం అత్యుత్తమ ప్రమాణంతో పాటు, ఆర్.టి-పి.సి.ఆర్., ట్రూ-నాట్ మరియు సి.బి-నాట్ కూడా ఈ సదుపాయాన్ని పెంచడానికి ఉపయోగించడం జరుగుతోంది. 

*     రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్.  ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 633 (ప్రభుత్వ391 + ప్రయివేటు242)  

*     ట్రూ-నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 491 (ప్రభుత్వ : 439  + ప్రయివేటు : 52 )   

*     సి.బి-నాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు : 99 (ప్రభుత్వ 35 + ప్రయివేటు :  64)   

ప్రయోగశాల సామర్థ్యం విస్తరణ 2020 జనవరిలో ఒక ప్రయోగశాల నుండి 2020 మార్చిలో 121 ప్రయోగశాలలకు మరియు ఈ రోజు 1223 ప్రయోగశాలలకు విశేషంగా పెరిగింది.

గత 24 గంటల్లో 3,20,161 నమూనాలను పరీక్షించడం జరిగింది.  ఇంతవరకు పరీక్షలు నిర్వహించిన మొత్తం నమూనాల సంఖ్య 1,24,12,664.  భారతదేశంలో మిలియన్ జనాభాకు నిర్వహించే పరీక్షల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. ఈ రోజున మిలియన్ జనాభాకు నిర్వహించే పరీక్షల సంఖ్య 8994.7 కి చేరింది. 2020 జులై, 14వ తేదీన, ఒక్క రోజులో 3.2 లక్షలకు పైగా పరీక్షలు జరిగాయి.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు 

 technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

 ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +191-11-23978046  లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

****



(Release ID: 1638764) Visitor Counter : 232