రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రోడ్డు నిర్మాణం, పునరావాస పరికరాలు, భారీ మట్టితవ్వకపు యంత్రాలకు సెంట్రల్ మోటార్ వెహికల్ నిబంధనలు (సిఎంవిఆర్ )1989 కింద రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల కోసం పట్టుబట్టవద్దని రాష్ట్రాలకు సూచించిన కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ
Posted On:
13 JUL 2020 8:37PM by PIB Hyderabad
రహదారుల నిర్మాణంలో ఉపయోగించే భారీ యంత్రపరికరాలు మోటారు వాహనాల కిందికి రావని , అందువల్ల ఇవి మోటారు వాహనాల చట్టం పరిధిలోకి రావని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ యంత్రాలకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులకోసం పట్టుబట్టవద్దని కేంద్ర మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా విభాగాలకు కేంద్ర మంత్రిత్వశాఖ లేఖలు రాస్తూ, రోడ్డు నిర్మాణం, పునరావాస పరికరాలకు సంబంధించి తాము ఎన్నో విజ్ఞప్తులు అందుకున్నామని, అందులో కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు (సిఎంవిఆర్)1989 కింద కోల్డ్ రీసైక్లింగ్‌యంత్రాలు, సాయిల్ స్టెబిలైజేషన్ యంత్రాలకు (రోడ్ బిల్డింగ్, పునరావాస పరికరాలకు) సంబంధించినవి ఉన్నాయని తెలిపింది.
కోల్డ్ మిల్లింగ్ యంత్రాలను ప్రస్తుత బిటుమిన్ పేవ్‌మెంట్‌ల పై పొరను తొలగించి దానినుంచి అస్ఫాల్ట్ మెటీరియల్‌ను సేకరించి తిరిగి దానిని వాడేందుకు ఉపయోగిస్తారు. దీనివల్ల బిటుమెన్ , అగ్రిగేట్లను పరిరక్షించడంతోపాటు మైనింగ్, క్రషింగ్ ఖర్చులు కలిసి వస్తాయి. దీనినుంచి సేకరించిన బిటుమెన్ వల్ల బిటుమినస్ ఆదా అవుతుంది . తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.
అలాగే ఈ ఎంప్లాయర్ ద్వారా పనులు పొందిన ఇలాంటి పరికరాలు వాడే వారు నిర్ణీత ప్రదేశంలో తమ పనులు చేయవలసి ఉంటుంది. అందువల్ల ఈ పరికరాలు నిర్దేశిత ప్రాంతాలలో పనులు సాగిస్తుంటాయి. దీనికితోడు పైన పేర్కొన్న పరికరాల నిర్వహణ వేగం గంటకు 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ యంత్రాలను ట్రెయిలర్ల సహాయంతో పనిజరిగే ప్రాంతాలకు చేరుస్తారు.
ప్రభుత్వానికి అందిన విజ్ఞాపనలలో హెవీ ఎర్త్ మూవింగ్ యంత్రాలకు (హెచ్.ఇ.ఎం.ఎంలకు) సంబంధించిన రిజిస్ట్రేషన్, వాటి నిర్వహణకుసంబంధించిన అంశాలను లేవనెత్తడం జరిగింది. హెచ్.ఇ.ఎం.ఎంలైన డంపర్లు, పేలోడర్లు, షొవెల్స్, డ్రిల్ మాస్టర్, బుల్‌డోర్లు, మోటార్ గ్రేడర్, రాక్ బ్రేకర్స్ వంటివి మైన్స్ మేనేజర్ ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలో నిర్ణీత మైన్ సరిహద్దులలొ వాడుతారని, వీటిని గనుల బయట వాడరని ఆ విజ్ఞాపన పత్రాలలో తెలియజేశారు.
ఇందుకు సంబంధించి కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ మోటారు వాహనాల నిర్వచనానికి సంబంధించి మోటారు వాహనాల చట్టం 1988, సెక్షన్ 2(28) కింద పంపిన సమాచారాన్ని గుర్తు చేసింది.
దీని ప్రకారం, మోటారు వాహనం అంటే రోడ్లపై ఉపయోగం కోసం నడిచే ఏదైనా యాంత్రికంగా నడిచే వాహనం. అంటే ప్రొపల్షన్ శక్తి బాహ్య లేదా అంతర్గతంగా ఉండేది , దేనికీ జతచేయనిది వెనుకనుంచి నెట్టబడనిది; కానీ స్థిర పట్టాలపై నడుస్తున్న వాహనం లేదా ఒక కర్మాగారంలో లేదా మరే ఇతర నిర్దేశిత ప్రాంగణంలో మాత్రమే ఉపయోగించటానికి అనువైన ప్రత్యేక రకం వాహనం లేదా ఇరవై ఐదు క్యూబిక్ సెంటీమీటర్లకు మించకుండా ఇంజిన్ సామర్థ్యంతో అమర్చిన నాలుగు చక్రాల కన్నా తక్కువ వాహనం వంటివి దీని పరిధి కిందికి రావు.
మోటారు వాహనాల చట్టం 1988 లోని సెక్షన్ 3(1) డ్రైవింగ్ లైసెన్సుఅవసరానికి సంబంధించిన ప్రస్తావనలో , సంబంధిత అధీకృత అధికారి వాహనం నడపడానికి అనుమతి ఇస్తూ జారీచేసిన డ్రైవింగ్ లైసెన్సు లేకుండా ఏ వ్యక్తీ బహిరంగ ప్రదేశంలో వాహనం నడపరాదు. అలాగే రవాణా వాహనాలు సంబంధించి ప్రత్యేకంగా అనుమతిస్తూ జారీచేసిన డ్రైవింగ్ లైసెన్సు లేకుండా మోటారు క్యాబ్, లేదా మోటార్ సైకిల్ కాకుండా ఏ ఇతర వాహనాన్ని అద్దెకు తీసుకున్నా లేక తన స్వంత వినియొగానికైనా సరే ఏ పథకం కింద అయినా సబ్ సెక్షన్ (2) సెక్షన్ 75 కింద రవాణా వాహనాన్ని ఏ వ్యక్తీ నడపడానికి వీలు లేదు.
ఇందుకు సంబంధించిన అంశాలను సిఎంవిఆర్-టిఎస్‌సి 56 వ సమావేశంలో చర్చించినట్టు కేంద్ర మంత్రిత్వశాక తెలిపింది. ఈ సమావేశం కోల్డ్ మిల్లింగ్ యంత్రం, కోల్డ్ రీసైక్లియర్, సాయిల్‌స్టెబిలైజర్లు మోటారు వాహనాల చట్టం 1998 నిర్వచనం కిందికి రావని అభిప్రాయపడింది.
అదే విధంగా హెచ్.ఇ.ఎం.ఎం. యంత్రాలు అంటే డంపర్లు, పేలోడర్లు, షోవెల్స్, డ్రిల్ మాస్టర్, బుల్డోజర్‌లు, మోటార్‌గ్రేడర్, రాక్‌బ్రేకర్‌లుకూడా మోటారు వాహనాల చట్టం 1988 పరిధి కిందికి రావని అందువల్ల వీటి రిజిస్ట్రేషన్‌కు మోటారువాహనాల చట్టం 1988 కింద పట్టుబట్టరాదని తెలిపింది.
***
(Release ID: 1638511)
Visitor Counter : 248