మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల;
తిరువనంతపురం రీజియన్ లో అత్యధిక ఉత్తీర్ణత శాతం
ఫెయిల్ స్థానంలో తప్పనిసరి పునఃపరీక్ష అనే పదం చేర్చాలని సిబిఎస్ఇ నిర్ణయం
Posted On:
13 JUL 2020 8:30PM by PIB Hyderabad
సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల;
తిరువనంతపురం రీజియన్ లో అత్యధిక ఉత్తీర్ణత శాతం
ఫెయిల్ స్థానంలో తప్పనిసరి పునఃపరీక్ష అనే పదం చేర్చాలని సిబిఎస్ఇ నిర్ణయం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సిబి ఎస్ ఇ) ఈరోజు 12వ తరగతి ఫలితాలు విడుదల చేసింది. అన్ని రీజియన్ల కంటే తిరువనంతపురం రీజియన్ అత్యధిక ఉత్తీర్ణతాశాతం (97.67% ) నమోదు చేసుకోగా 97.05 శాతంతో బెంగళూరు రీజియన్ రెండో స్థానంలో నిలిచింది. 96.17% సాధించిన చెన్నై రీజియన్ మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 11, 92,961 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా వారిలో 10, 59,080 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఈ ఏడాది మొత్తంగా 88.78% మంది ఉత్తీర్ణులైనట్టయింది. ఇది నిరుటి కంటే 5.38 % ఎక్కువ.
ఈ ఏడాది సిబి ఎస్ ఇ పరీక్షలు 15.02.2020 నుంచి30.03.2020 వరకు జరగాల్సి ఉంది. అయితే, కోవిడ్ సంక్షోభం కారణంగా 19.03.2020 నుంచి 30.03.2020 వరకు పరీక్షలు రద్దయ్యాయి. దీంతో వీటిని జులై 1 నుంచి 15 వరకు జరపాలని కొత్త షెడ్యూల్ ప్రకటించారు. అయితే, అనిశ్చిత వాతావరణం,అనూహ్యమైన పరిస్థితి దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సుప్రీంకోర్టు 26.06.2020న ఆదేశాలు జారీచేసింది. ఈ దిగువ పేర్కొన్న పద్ధతిలో ఫలితాల లెక్కింపు జరగాలని ఆ ఆదేశాలలో పేర్కొంది.
లెక్కింపు విధానం:
a. అన్ని పరీక్షలూ పూర్తి చేసిన పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు వారి పరీక్షా ఫలితాల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తారు.
b. మూడు కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆ సబ్జెక్టులలో ఉత్తమ ఫలితాలు వచ్చిన మూడు సబ్జెక్టుల సరాసరి మార్కుల ఆధారంగా మిగిలిన సబ్జెక్టుల ఫలితాలను కూడా నిర్ణయిస్తారు.
c. మూడు సబ్జెక్టులలో మాత్రమే పరీక్షలు రాసిన విద్యార్థులకు వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన రెండు సబ్జెక్టుల సగటు ఆధారంగా మిగిలిన సబ్జెక్టుల ఫలితాలు నిర్ణయిస్తారు..
d. ఒకటి లేదా రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన పన్నెండవ తరగతి విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ కాగా వారిలో ప్రధానంగా ఢిల్లీ ప్రాంతానికి చెందినవారున్నారు. అలాంటివారు రాసిన పరీక్షల ఫలితాల ఆధారంగానూ, ఇంటర్నల్/ప్రాక్టికల్/ప్రాజెక్ట్ అసెస్ మెంట్ ఆధారంగానూ ఫలితాలు నిర్ణయిస్తారు. అయితే, ఈ విద్యార్థులు కావాలనుకుంటే తమ ఫలితాన్ని మెరుగుపరచుకొవటానికి మళ్ళీ పరీక్ష రాయటానికి కూడా వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ ఫలితాలను కూడా మిగిలిన విద్యార్థులతో కలిపి ప్రకటిస్తారు.
ఐచ్చిక పరీక్షకు అవకాశం
· ఐచ్ఛికంగా పరీక్ష రాయదలచుకున్నవారికోసం సిబిఎస్ఇ పరిస్థితులు అనుకూలిస్తే జులై 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుపుతామని ప్రకటించింది.
· అసెస్ మెంట్ విధానంలో ఫలితాలు ప్రకటించబడిన విద్యార్థులు ఈ ఐచ్ఛిక పరీక్షలకు హాజరై ఫలితాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే, ఈ పరీక్షల ఫలితాలనే తుది ఫలితాలుగా పరిగణిస్తారు.
** అయితే, ఈ విధానం కింద 400 మంది విద్యార్థుల ఫలితాలను మాత్రమే ఇంకా వెల్లడించాల్సి ఉంది.
ఐచ్ఛిక పరీక్షల నిర్వహణ
ఇలా ఐచ్ఛిక పరీక్షలను ఎంచుకున్న విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ ఇంకా నిర్ణయించలేదు. భారత ప్రభుత్వ అనుమతితో తేదీ ఖరారు చేస్తారు.
కంపార్ట్ మెంట్ పరీక్ష నిర్వహణ
భారత ప్రభుత్వ అనుమతితో సిబిఎస్ ఇ ఈ పరీక్ష నిర్వహణ ఎప్పుడు చేపట్టేదీ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది.
ఫెయిల్ అనే పదం స్థానంలో "తప్పనిసరి పునఃపరీక్ష" వాడకం
సిబి ఎస్ ఇ అధికారులు ఈ సారి ఫెయిల్ అనే పదం స్థానంలో "తప్పనిసరి పునఃపరీక్ష" అని వాడాలని నిర్ణయించారు. అందువలన ఇప్పుడు ప్రకటించిన ఫలితాలలో విద్యార్థులకిచ్చిన డాక్యుమెంట్లలో గాని, వెబ్ సైట్ లో గాని ఫెయిల్ అనే మాట కనబడదు.
డిజి లాకర్ లో సర్టిఫికెట్లు
· అభ్యర్థుల డిజిటల్ మార్క్ షీట్లు, పాస్ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు, స్కిల్ సర్టిఫికెట్లు కూడా డిజి లాకర్ లో అందుబాటులో ఉంటాయి. అది తెరవటానికి అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే విద్యార్థులు సిబిఎస్ ఇ దగ్గర నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ కు ఎస్ ఎం ఎస్ ద్వారా పంపారు.
· గూగుల్ ప్లే లో అందుబాటులో ఉండే డిజి లాకర్ మొబైల్ యాప్ ద్వారా కూడా సర్టిఫికెట్లను దౌన్ లోడ్ చేసుకోవచ్చు. (https://play.google.com/store/apps/details?id=com.digilocker.android) లేదా యాపిల్ యాప్ స్టోర్ లో (https://apps.apple.com/in/app/digilocker/id1320618078) కూడా పొందవచ్చు. లాగిన్ కావటానికి సిబిఎస్ ఇ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వాడుతూ ఒటిపి ని, రోల్ నెంబర్ చివరి ఆరు అంకెలను సెక్యూరిటీ పిన్ గా ఎంటర్ చేయాలి.
రీచెకింగ్, రీవాల్యుయేషన్
విధి విధానాలను బోర్డ్ త్వరలో ప్రకటిస్తుంది
12వ తరగతి ఫలితాల విశ్లేషణ ఇలా ఉంది:
పరీక్షా సమయం
|
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30 వరకు
|
ఫలితాల ప్రకటన తేదీ
|
జులై 13
|
1.
మొత్తం పాఠశాలలు, పరీక్షా కేంద్రాలు ( అన్ని సబ్జెక్టులు )
|
సంవత్సరం
|
పాఠశాలల సంఖ్య
|
పరీక్షా కేంద్రాల సంఖ్య
|
2019
|
12441
|
4627
|
2020
|
13109
|
4984
|
2.
మొత్తం ఉత్తీర్ణతా శాతం ( పూర్తి సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదులు
|
హాజరు
|
ఉత్తీర్ణులు
|
శాతం
|
పెరుగుదల శాతం
|
2019
|
1218393
|
1205484
|
1005427
|
83.40
|
5.38 %
|
2020
|
1203595
|
1192961
|
1059080
|
88.78
|
3.
రీజియన్ల వారీగా ఉత్తీర్ణతాశాతం - 2020 రీజియన్లు ( పూర్తి సబ్జెక్టులు)
|
|
రీజియన్ పేరు
|
ఉత్తీర్ణతాశాతం
|
1
|
తిరువనంతపురం
|
97.67
|
2
|
బెంగళూరు
|
97.05
|
3
|
చెన్నై
|
96.17
|
4
|
ఢిల్లీ పశ్చిమ
|
94.61
|
5
|
ఢిల్లీ తూర్పు
|
94.24
|
6
|
పంచ్ కుల
|
92.52
|
7
|
చండీగఢ్
|
92.04
|
8
|
భువనేశ్వర్
|
91.46
|
9
|
భోపాల్
|
90.95
|
10
|
పూణె
|
90.24
|
11
|
అజ్మీర్
|
87.60
|
12
|
నోయిడా
|
84.87
|
13
|
గువాహతి
|
83.37
|
14
|
డెహ్రాడూన్
|
83.22
|
15
|
ప్రయాగ్ రాజ్
|
82.49
|
16
|
పాట్నా
|
74.57
|
4.
ఢిల్లీ రీజియన్ మొత్తంలో అభ్యర్థుల ఫలితాల తీరు (పూర్తి సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదులు
|
హాజరు
|
ఉత్తీర్ణులు
|
శాతం
|
2020
|
239870
|
237901
|
224552
|
94.39
|
5.
విదేశీ పాఠశాలల్లో ఫలితాల తీరు ( పూర్తి సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదులు
|
హాజరు
|
ఉత్తీర్ణులు
|
శాతం
|
2019
|
16099
|
16005
|
15273
|
95.43
|
2020
|
16103
|
16043
|
15122
|
94.26
|
6.
బాలబాలికల వారీగా ఉత్తీర్ణతాశాతం ( పూర్తి సబ్జెక్టులు)
|
లింగభేదం
|
2019
|
2020
|
బాలుర కంటే బాలికల ఉత్తీర్ణతా ఆధిక్యం 5.96 %
|
బాలికలు
|
88.70
|
92.15
|
బాలురు
|
79.40
|
86.19
|
ట్రాన్స్ జెండర్లు
|
83.33
|
66.67
|
7.
సంస్థలవారీగా ఫలితాల పోలిక ( పూర్తి సబ్జెక్టులు)
|
|
సంస్థ
|
ఉత్తీర్ణతా శాతం
|
1
|
జె ఎన్ వి
|
98.70
|
2
|
కెవి
|
98.62
|
3
|
సిటి ఎస్ ఎ
|
98.23
|
4
|
ప్రభుత్వ
|
94.94
|
5
|
ప్రభుత్వఎయిడెడ్
|
91.56
|
6
|
స్వతంత్ర
|
88.22
|
8.
సి డబ్ల్యు ఎస్ ఎన్ అభ్యర్థుల పనితీరు ( పూర్తి సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
నమోదులు
|
హాజరు
|
PASSED
|
PASS%
|
2020
|
2536
|
2475
|
2269
|
91.68
|
9.
90% కంటే 95% కంటే ఎక్కువ సాధించిన అభ్యర్థులు (పూర్తి సబ్జెక్టులు)
|
|
90% కంటే ఎక్కువ
|
ఉత్తీర్ణతా శాతం
|
95% కంటే ఎక్కువ
|
ఉత్తీర్ణతా శాతం
|
మొత్తం అభ్యర్థులు
|
157934
|
13.24
|
38686
|
3.24
|
10.
90% కంటే ఎక్కువ 95% కంటే ఎక్కువ ఉత్తీర్ణతా శాతం సాధించిన సి డబ్ల్యు ఎస్ ఎన్ అభ్యర్థులు (పూర్తి సబ్జెక్టులు)
|
|
90% కంటే ఎక్కువ
|
95% కంటే ఎక్కువ
|
మొత్తం అభ్యర్థులు
|
243
|
42
|
11.
కంపార్ట్ మెంట్ లో ఉంచిన అభ్యర్థుల నంఖ్య ( పూర్తి సబ్జెక్టులు)
|
సంవత్సరం
|
అభ్యర్థులు
|
శాతం
|
2019
|
99207
|
8.23
|
2020
|
87651
|
7.35
|
*****
(Release ID: 1638458)
Visitor Counter : 311