ఆర్థిక సంఘం

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో ఆర్థిక సంఘం సమావేశం

- నిధుల అవ‌స‌రాన్ని రూ.6.04 ల‌క్ష‌ల కోట్ల‌కు స‌వరించిన ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ

Posted On: 13 JUL 2020 6:05PM by PIB Hyderabad

 

15 వ ఆర్థిక సంఘం ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ మరియు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఒక సమావేశం నిర్వహించింది. ఆరోగ్య శాఖ‌కు చెందిన ప‌లు నిర్ధిష్ట‌ స‌మ‌స్య‌లను చ‌ర్చించేందుకు ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. దేశంలో కోవిడ్‌-19 అనుభ‌వం నేప‌థ్యంలో మంత్రిత్వ శాఖ యొక్క రాష్ట్ర నిర్దిష్ట ప్రతిపాదనల్ని సవరించడం. ప్ర‌స్తుత ఆర్థిక ఒత్తిడి నేప‌థ్యంలో తిరిగి పుంజుకునే అవకాశాన్ని అన్వేషించడం. దేశంలో ఆరోగ్య రంగం విష‌య‌మై 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసిన అత్యున్న‌త స్థాయి సంఘం సూచ‌న‌ల‌ను మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకోవ‌డంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.
ఆర్థిక సంఘం చొర‌వ‌ను ప్ర‌శంసించిన మంత్రి
15వ ఆర్థిక సంఘం ఛైర్మెన్ శ్రీ ఎన్. కె. సింగ్ ఈ సమావేశాన్ని ప్రారంభించి ప్ర‌సంగించారు. కోవిడ్ మహమ్మారి యొక్క విచిత్ర స్థితిని చూస్తుంటే కమిషన్ తన తుది నివేదికలో ఆరోగ్యంపై ప్రత్యేక అధ్యాయాన్ని ప్ర‌భుత్వానికి ఇవ్వాలని నిర్ణయించింద‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యయాలు, షరతుల ఆధారంగా రంగాల నిర్దిష్ట కార్యక్రమాలు మరియు తృతీయ‌ శ్రేణికి కేటాయించిన నిధులు ఆరోగ్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం ఎలా కేటాయించవచ్చు అనే దాని గురించి మంత్రిత్వ శాఖ అభిప్రాయాల‌ను తెలుసుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని క‌మిషన్ భావిస్తోంద‌న్నారు. భారత ఆరోగ్య రంగం అభివృద్ధి విష‌య‌మై తనకున్న దృష్టి కోణాన్ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ సంద‌ర్భంగా వివరించారు. ఈ రంగానికి పునఃప్ర‌ధాన్య‌త‌ను క‌ల్పించాల‌ని కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా ప్రశంసించారు.

ఆర్థిక సంఘానికి అందించిన వివరణాత్మక ప్రదర్శనలో మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య విధానం (ఎన్‌హెచ్‌పీ) 2017లోని ఈ కింది లక్ష్యాలను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిందిః  
-2025 నాటికి ప్రగతిశీల పద్ధతిలో ప్రజారోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి  పెంచండి.
- ప్రాథమిక ఆరోగ్య వ్యయం మొత్తం ఆరోగ్య వ్యయంలో 2/3వ వంతుగా ఉండాలి.
- 2020 నాటికి రాష్ట్ర  ఆరోగ్య రంగ వ్యయాన్ని వారి బడ్జెట్‌లో ఎనిమిది శాతం కన్నా ఎక్కువకు పెంచండి.

ప్రస్తుతం ప్రజారోగ్య వ్యయంలో 35 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ సూచించింది. 65 శాతం వ్య‌యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న‌ట్టుగా తెలిపింది. పట్టణ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజారోగ్య రంగాన్ని, నిఘా మరియు ప్రజారోగ్య నిర్వహణ, నివారణ మరియు ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఈ మహమ్మారి తెలియ‌ప‌రిచింద‌న్నారు.
ఏడాది ప్రాతిప‌దిక‌న ‌ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూకు నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

మెరుగైన రాష్ట్ర నిర్దిష్ట నిధుల కోసం డీఓహెచ్ఎఫ్‌డ‌బ్ల్యూ ఈ క్రింది పద్ధతిలో ప్రతిపాన‌లు చేసింది -

అన్‌టైడ్ నిధుల కోసం :
- ఆరోగ్య రంగానికి కనీసం 10 శాతం నిధులు కేటాయించాలి ఇందులో ప్రాథమిక ఆరోగ్య రంగానికి కనీసం 2/3 వ భాగం కేటాయింపులు జ‌ర‌పాలి.
- రాష్ట్రాలలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నిమిత్తం ఏర్ప‌డే నిధుల అంతరాలు ఒక ప్రమాణంగా ఉపయోగించబడతాయి - ఇలా చేయ‌డం గణనీయమైన నిధుల అవసరాలు మరియు ఆరోగ్య మందగింపు ఉన్న రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందడానికి మరియు ఆరోగ్య రంగానికి ఖర్చు చేయడానికి.. ఈ రంగానికి త‌గిన‌ ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయపడుతుంది.

పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల కోసం:
- రాష్ట్రాలను ప్రోత్సహించడానికి సంవత్సర ప్రాతిపదికన పనితీరును ప్రదర్శించడానికి మిశ్రమ ఆరోగ్య సూచిక ఉపయోగించబడుతుంది- పనితీరు లింక్డ్ పూల్‌లో దీనికి 20 శాతం మేర ప్రాధాన్య‌త‌ ఉంటుంది.

నిధుల కోసం మంత్రిత్వ శాఖ సవరించిన ప్రతిపాదనల‌ను ఆర్థిక కమిషన్‌కు సమర్పించింది. 15వ ఆర్థిక సంఘం మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌య్యే కొత్త‌కొత్త ప్రాంతాల్ని ఇందులో గుర్తించింది.

- మద్దతు కోసం కొత్త ప్రాంతాలు - ప‌ట్ట‌ణ ప్రాంతాల ఆరోగ్యం, నిత్య‌వ‌స‌ర‌మైన
ఔష‌ధాలు, డీఎన్‌బీ కోర్సుల‌ను ప్రారంభించ‌డంతో పాటు కోవిడ్ అనంత‌రం ఆరోగ్య రంగంలో సంస్క‌ర‌ణ‌లు
- ఆరోగ్య రంగంపై ఏర్పాటు చేసిన అత్యున్న‌త స్థాయి సంఘం వారు అందించే సిఫార‌సులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం.
- ‌పాక్షికంగా నిధుల బ్యాక్ లోడింగ్ జ‌ర‌ప‌డం
- 15వ ఆర్థిక సంఘం స‌మ‌యంలో అంటే 2021-22 నుండి 2025-26 మ‌ధ్య‌కాలానికి నిధుల అవ‌స‌రంను రూ.4.99 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.6.04 కోట్ల‌కు సవరించబడింది.

ఆరోగ్య రంగంపై 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసిన హై లెవల్ గ్రూప్ యొక్క సిఫారసులకు తగిన విధంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌రువాత మరియు నిధులను పాక్షికంగా తిరిగి లోడ్ చేసిన తరువాత అవ‌స‌ర‌మైన నిధుల మొత్తాన్ని మంత్రిత్వ శాఖ రూ.6.04 లక్షల కోట్ల‌కు సవ‌రించింది. ఇంతకుముందు ఈ మొత్తం రూ. 4.99 లక్షల కోట్లుగా ఉంది.  జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాన్ని సాధించే దిశగా గణనీయమైన పురోగతికి దారితీస్తుందని భావించిన రాష్ట్రాలకు సంవత్సరానికి జీడీపీలో 0.4 శాతం మేర అదనపు వనరుల కేటాయింపులు జ‌ర‌పాలని మంత్రిత్వ శాఖ కోరింది.

మెరుగైన మ‌ద్ద‌తు అవ‌సర‌మ‌ని మంత్రిత్వ శాఖ గుర్తించిన ముఖ్య అంశాలు-

- జిల్లా ఆసుపత్రులతో (డీహెచ్) అనుబంధంగా మెడికల్ కాలేజీలను (ఎంసీ) ఏర్పాటు చేయండి
- ఆరోగ్య సంర‌క్ష‌ణ అనుబంధ రంగాల‌లో 15 ల‌క్ష‌ల మంది నైపుణ్యం గల శ్రామిక శక్తిని అందుబాటులో ఉండేలా శిక్షణ ఇవ్వ‌డం
- పీఎంఎస్ఎస్‌వై కింద సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ (ఎస్ఎస్‌బీలు) ప్రారంభించండి
- ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో సహా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం.

ఈ స‌మావేశంలో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ‌ మంత్రి మరియు మంత్రిత్వ శాఖ ప్ర‌ధానంగా వెలుగులోకి తెచ్చిన‌ అన్ని అంశాలను కమిషన్ గుర్తించింది. దేశంలో ప్రభుత్వ రంగ ఆరోగ్య వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, ఆరోగ్య కార్యకర్తల వృత్తిపరమైన కేడర్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక సంఘం అంగీకరించింది. ప్ర‌తిపాధిత ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు రాష్ట్రాలు మరియు తృతీయ శ్రేణితో మేటిగా మ‌రియు నిరంతర ఒప్పుద‌ల‌తో ముందుకు సాగాల్సిన‌‌ అవసరం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. సమావేశంలో  లేవనెత్తిన అన్ని సమస్యలపై తీవ్రంగా దృష్టి పెట్టాలని కోరుకోవడం లేదని అయితే ప్ర‌ధాన అంశాల‌ను త‌ప్ప‌క ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోనున్న‌ట్టుగా ఆర్థిక సంఘం హామీ ఇచ్చింది.


 

******


(Release ID: 1638420) Visitor Counter : 536