విద్యుత్తు మంత్రిత్వ శాఖ
రక్తదాన శిబిరం నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ
Posted On:
13 JUL 2020 7:01PM by PIB Hyderabad
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, కేటగిరి-1 'మినీ రత్న' హోదాలో ఉన్న భారతదేశ ప్రధాన జలవిద్యుత్ సంస్థ. కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. ఫరీదాబాద్ మిడ్‌టౌన్ రోటరీ క్లబ్‌తో కలిసి, ఫరీదాబాద్‌లోని ఎన్‌హెచ్‌పీసీ కాలనీలో రక్తదాన శిబిరాన్ని ఈ సంస్థ నిర్వహించింది.
ఎన్‌హెచ్‌పీసీ ఛైర్మన్ శ్రీ ఎ.కె.సింగ్ దంపతులు శిబిరాన్ని ప్రారంభించారు. సంస్థ ఉద్యోగులు, రోటరీ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో రక్త కొరతతో ఆస్పత్రులు పనిచేస్తున్నాయని, రక్త నిల్వ కేంద్రాలకు మద్దతుగా నిలిచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎ.కె.సింగ్ చెప్పారు. ఎన్‌హెచ్‌పీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉన్నతమైన కారణంతో రక్తదానానికి ముందుకు రావాలని అభ్యర్థించారు. రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. 75 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
చొరవ తీసుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించి, విజయవంతం చేసినందుకు, ఎన్‌హెచ్‌పీసీకి రోటరీ క్లబ్ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, క్రిమిసంహారక కార్యక్రమాలు, క్వారంటైన్ సదుపాయాల కల్పన, ఐసీయూలకు పోర్టబుల్ వెంటిలేటర్ల అందజేత, ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీలు, రక్త విశ్లేషణ పరికరాలు, అల్ట్రా సౌండ్ యంత్రాల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా, దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో ఎన్‌హెచ్‌పీసీ పాల్గొంది. ఎన్‌హెచ్‌పీసీకి చెందిన వైద్యుల ద్వారా సంస్థ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో 24 గంటలూ సేవలు అందిస్తున్నారు.
***
(Release ID: 1638371)
Visitor Counter : 232