రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హర్యానాలో రూ.20,000 కోట్లకు పైగా విలువైన కొత్త ఆర్థిక కారిడార్‌లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించడం మరియు శంఖుస్థాపనలు చేయనున్న గడ్కరీ
Posted On:
13 JUL 2020 5:04PM by PIB Hyderabad
హర్యానాలో రూ.20 వేల కోట్లకు పైగా విలువైన కొత్త ఆర్థిక కారిడార్‌లో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్‌ఎంఈల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రేపు (14వ తేదీ) వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. ఆన్‌లైన్‌లో వెబ్ ఆధారితంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షత వహించనున్నారు. గడ్కరీ ప్రారంభించనున్న ప్రాజెక్టులలో రూ.1183 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎన్‌హెచ్ 334బీ లోని 35.45 కి.మీ. నిడివి గల 4 వరుసల రోహ్నా / హసన్‌ఘర్ నుండి జజ్జార్ సెక్షన్ రహదారి, ఎన్‌హెచ్ 71లోని పంజాబ్-హర్యానా సరిహద్దు నుండి జింద్ సెక్షన్ వరకు రూ.857 కోట్ల వ్యయంతో చేపట్టిన 70 కిలో మీటర్ల పొడువైన 4 వరుసల రహదారి, జాతీయ రహదారి 709లోని జింద్-కర్నాల్ మార్గంలో రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టిన 85.36 కి.మీ. నిడివి గల రెండు-వరుసల రహదారి మార్గం తదితరాలు ఉన్నాయి.
శంఖుస్థాపన చేయనున్న పనులివే..
కేంద్ర మంత్రి శంఖుస్థాపన చేయనున్న ప్రాజెక్టులలో జాతీయ రహదారి 152డీలో ఇస్మాయిల్‌పూర్ నుండి నార్నాల్ వరకు రూ.865 కోట్లతో చేపట్టనున్న 8 ప్యాకేజీలలోని 227 కి.మీ. నిడివి గల 6-వరుసల యాక్సెస్ నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు ఉన్నాయి. దీనికి తోడు జాతీయ రహదారి 352 లోని గురుగ్రామ్ పటౌడి-రేవారి సెక్షన్‌లోన్‌లో రూ.1524 కోట్లతో చేపట్టనున్న 46 కి.మీ. నిడివి గల 4-వరుసల రహదారి పనులు, రూ.928 కోట్ల విలువైన 14.4 కి.మీ. 4-వరుసల రేవారి బైపాస్ రహదారి పనులు, జాతీయ రహదారి 11లోని రేవారి-అటెలి మండి సెక్షన్‌లో సుమారు రూ.1057 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 30.45 కి.మీ. నిడివి గల నాలుగు వరుసల రోడ్డు పనులు, జాతీయ రహదారి 148బీ నందు సుమారు 40.8 కి.మీ. నిడివితో 6-వరుసలతో నిర్మించనున్న నార్నాల్ బైపాస్ పనులు, 1380 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న జాతీయ రహదారి 11లోని నార్నాల్ నుండి అటెలి మండి సెక్షన్‌లోని పనులు, జాతీయ రహదారి 352 ఏ నందు జింద్-గోహానా (ప్యాకేజీ 1, గ్రీన్ఫీల్డ్ అలైన్‌మెంట్) మధ్య 40.6 కి.మీ. నిడివిలో 4-వరుసలుగా చేపట్టనున్న రూ.1207 కోట్ల రూపాయల పనులు, రూ.2502 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎన్‌హెచ్ 352ఏ లోని 38.23 కిలో మీటర్ల 4-లేన్ల గోహానా-సోనిపట్ సెక్షన్ పనులు మరియు ఎన్‌హెచ్ 334బీ లోని 40.47 కిలో మీటర్ల నిడివి గల నాలుగు లేన్ల యుపీ-హర్యానా బోర్డర్ నుండి రోహ వరకు చేపట్టనున్న రూ.1509 కోట్ల విలువైన రహదారి పనులు ఉన్నాయి. ఈ కొత్త ప్రాజెక్టులు హర్యానా ప్రజలకు రాష్ట్రంలో మెరుగైన కనెక్టివిటీని అందించడంతో పాటుగా పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు సున్నితమైన మేటి కనెక్టివిటీ అందించేందుకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ ప్రాజెక్టుల వల్ల సమయం, ఇంధనం మరియు వ్యయాలు ఆదా అవుతాయి.
దీనికి తోడు ఆయా రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ రహదారులు దోహదం చేయనున్నాయి.
****
(Release ID: 1638344)
Visitor Counter : 214