నీతి ఆయోగ్
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్ధుల కోసం ఎటిఎల్ యాప్ డవలప్ మెంట్ మాడ్యూల్‌ను విడుదల చేసిన నీతి ఆయోగ్ కు చెందిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ పాఠశాల విద్యార్థులను యాప్ వినియోగదారులనుంచి యాప్ లు అభివృద్ది చేసేవారుగా మార్చడం దీని లక్ష్యం.
Posted On:
11 JUL 2020 4:58PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ కార్యక్రమాలకు చొరవ చూపాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ పూరించిన శంఖానికి అనుగుణంగా , భారతీయ మొబైల్ యాప్ అభివృద్ది, నవకల్పనల వాతావరణాన్నిపునరుద్ధరించే దిశగా నీతి ఆయోగ్‌కు చెందిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం) ,ఈరోజు ఎటిఎల్ యాప్ డవలప్‌మెంట్ మాడ్యూల్‌ను దేశవ్యాప్తంగా గల పాఠశాల విద్యార్థుల కోసం విడుదల చేసింది.
ఎటిఎల్ యాప్ డవలప్‌మెంట్ మాడ్యూళ్ళను దేశీయ స్టార్టప్ సంస్థ ప్లెజ్‌మొ సహకారంతో విడుదల చేశారు. పాఠశాల విద్యార్థుల నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో,వారిని ఎఐఎం ఫ్లాగ్ షిప్ కార్యక్రమమైన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ చొరవ కింద, యాప్ లు వాడే స్థాయినుంచి రానున్న రోజులలోయాప్ రూపకర్తల స్థాయికి తీసుకుపోవడం దీని లక్ష్యం.
ఈ మాడ్యూల్స్ పై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్, కోవిడ్ -19 మహమ్మారి పెద్ద ఎత్తున దైనందిన కార్యకలాపాలకు అంతరాయం కల్పించిందని, రోజువారి జీవితాలు సాగేందుకు సాంకేతిక పరిజ్ఙానాన్ని వాడడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కొవడం జరుగుతున్నదని చెప్పారు.
“ మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాల్సిందిగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్‌కు ఆవిష్కరణలు చేపట్టాల్సిందిగా కోరుతున్నారు. భారతీయ యువత చిన్నవయసులోనే తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞాన నాయకులుగా ఎదిగేందుకు వీలుగా నైపుణ్యాలు సంతరించుకోవడం ఎంతో కీలకం. అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్ చొరవ కింది, ఎటిఎల్ యాప్ డవలప్ మెంట్ మాడ్యూల్‌ను భారతీయ విద్యార్థులు- మన ప్రియమైన బాలల కోసం ఎఐఎం,నీతి ఆయోగ్ ప్రారంభించడం గర్వకారణంగా ఉంది” అని ఆయన అన్నారు.
ఎటిఎల్ యాప్ డవలప్‌మెంట్ మాడ్యూల్ ఆన్ లైన్ కోర్సు పూర్తిగా ఉచితం. 6 ప్రాజెక్టు ఆధారిత అభ్యసన మాడ్యూళ్లు, ఆన్‌లైన్ మెంటారింగ్ సెషన్ల ద్వారా యువ ఆవిష్కర్తలు, మొబైల్‌యాప్ లను అభివృద్ధి చేసే నైపుణ్యాన్ని వివిధ భారతీయ భాషలలో పొందగలుగుతారు. ఆ రకంగా వారి ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. అదనంగా పాఠశాల టీచర్లకు యాప్ డవలప్‌మెంట్‌కు సంబంధించిన సామర్ధ్యాలు, విజ్ఞానాన్ని అందించేందుకు వారికి క్రమానుగతంగా ఎఐఎం యాప్ డవలప్‌మెంట్ కోర్సుకు సంబంధించి ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ మాడ్యూలు విడుదల సందర్భంగా మాట్లాడుతూ నీతి ఆయోగ్ కు చెందిన , అటల్ ఇన్నొవేషన్ మిషన్ డైరక్టర్ ఆర్.రామన్ , “ మన దేశంలో గల అద్భుత జనాభా సానుకూలతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలతో సాంకేతిక పరిష్కారాలు , యాప్‌లు మన దేశం నుంచి ఎన్నో రావలసి ఉంది. ఆత్మనిర్భర భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలంజ్, దేశవ్యాప్తంగా పాఠశాలలు, యూనివర్సిటీలు, పరిశ్రమల స్థాయిలో అందరికీ ఎంతో ప్రేరణనిస్తోంది. నీతి ఆయోగ్ కు చెందిన ఎఐఎం ప్రస్తుతం యాప్ అభివృద్ధి నైపుణ్యాలను దేశవ్యాప్తంగా గల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లకు చెందిన యువ ఆలోచనాపరులకు అందించడం వల్ల వారు తమ టింకరింగ్ ల్యాబ్ లోని ఆవిష్కరణలను, మొబైల్ యాప్‌లతో అనుసంధానం చేయడానికి ,తద్వారా దాని ఉపయోగం, ఆవిష్కరణల అందుబాటును మరింత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. ఇది పాఠశాల స్థాయిలో యాప్ ల అభ్యాసం, అభివృద్ధికి సంబంధించి చేపట్టిన చొరవలలో అతి పెద్ద కార్యక్రమం.”అని ఆయన అన్నారు.
“ యువ మెదళ్లలొ అభ్యసన,సృజనాత్మకతను మరింత పెంపొందించడానికి ఎటిఎల్ -టింకర్ ఫ్రం హోం ప్రచారంలో భాగంగా , నీతి ఆయోగ్‌కు చెందిన అటల్ ఇన్నొవేషన్ మిషన్, దేశవ్యాప్తంగా గల విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం అత్యంత అధునాతన వేదికకు రూపకల్పన చేసింది. దీని ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృత్రిమ మేధస్సు, గేమ్ డిజైన్, డవలప్‌మెంట్, 3డి డిజైన్, ఆస్ట్రానమీ, సృజనాత్మక డిజిటల్ నైపుణ్యాల వంటి వాటిని ఎంతో సౌలభ్యంతో తమ ఇంటి నుంచే నేర్చుకోవడానికి, దానిని వర్తింపచేయడానికి అవకాశం కలుగుతుంది” అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న కృషిలో భాగంగా “నీతి ఆయోగ్ కు చెందిన ఎఐఎం, ఎటిఎల్ యాప్ డవలప్‌మెంట్ మాడ్యూల్‌ను , భారతీయ స్టార్టప్ సంస్థ ప్లెజ్‌మో తో కలసి విడుదల చేయడం గర్వంగా భావిస్తోంది. దేశవ్యాప్తంగా గల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ మాడ్యూల్‌ను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. భారత్‌లో రూపుదిద్దుకున్న ఈ మాడ్యూల్ ద్వారా విద్యార్దులు మన భవిష్యత్ టెక్నాలజీ నాయకులుగా, మన దేశ ఆవిష్కర్తలుగా ఎదగ గలరని ఆశిస్తున్నాను.” అని ఆయన అన్నారు
ప్లెజ్‌మొ సంస్థ సిఇఒ అమోల్ పల్షికార్ మాట్లాడుతూ, “ వ్యవసాయం, పారిశ్రామిక విప్లవాల తరువాత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సాంకేతిక విప్లవంద్వారా రూపుదిద్దుకుంటున్నాయి. ప్లెజ్‌మో లక్ష్యం ప్రతి ఒక్కరూ 21 వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞాన నైపుణ్యాలైన కోడింగ్, కంప్యుటేషనల్ థింకింగ్, డిజైన్ ఆలొచన, సమస్యల పరిష్కారం వంటి వాటిని ప్రతి ఒక్కరూ నేర్చుకునేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ చొరవ భారతీయ విద్యార్థుల మెదళ్లకు సాధికారత కల్పించడమే కాకుండా మన యువతరాన్ని ప్రపంచ సాంకేతిక సూపర్ పవర్‌గా మార్చడంతోపాటు ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు ఎంతగానో దోహదపడుతుంది.” అని అన్నారు.
ఇప్పటి వరకూ, దేశవ్యాప్తంగా అటల్ ఇన్నొవేషన్ మిషన్ కింద 660 జిల్లాలలో 5,100 కుపైగా ఎటిఎల్ లు ఏర్పాటయ్యాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు 2 మిలియన్ల మందికిపైగా విద్యార్థులకు అందబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రో్త్సహించడంతోపాటు, దేశ ఆర్థిక సామాజిక ప్రగతి కి వీలు కల్పించే విధంగా సేవలు,ఆవిష్కరణలు అందించేందుకు పలు సమీకృత కార్యక్రమాలు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లు, కమ్యూనిటీ కార్యకలాప కేంద్రాలు, అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్‌ల ద్వారా వీటిని సాధించడం ఈ దార్శనికత లక్ష్యం.
***
(Release ID: 1638064)
Visitor Counter : 327