ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19పై చికిత్సా నిర్వహణకు ప్రమాణబద్ధమైన వ్యూహం

Posted On: 11 JUL 2020 4:51PM by PIB Hyderabad

    కోవిడ్ వైరస్ కు విరుగుడు ఇప్పటికీ అందుబాటులోకి రానందున వ్యాధిలక్షణాలు లేనివారిని ప్రాతిపదికగా తీసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స విధానంలో వైద్యులు ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రోగుల చికిత్సలో భాగంగా శరీరంలో తగినంత నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవడం కూడా అత్యవసరం. వ్యాధి లక్షణాల తీవ్రత ప్రాతిపదికగా కోవిడ్-19ను మూడు గ్రూపులుగా వర్గీకరించవచ్చు. స్వల్ప లక్షణాలు, మోస్తరు లక్షణాలు, తీవ్రమైన లక్షణాలు అని మూడు వర్గాలుగా కోవిడ్ వైరస్ బాధితులను వర్గీకరించే అవకాశం ఉంది. కోవిడ్ వైరస్ కు విరుగుడు లేనందున, వైరస్ బాధితుల చికిత్సా విధానంలో ప్రత్యేక పద్ధతులు అవసరమని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. స్వల్ప లక్షణాలు, మోస్తరు లక్షణాలు, తీవ్రమైన లక్షణాలు కలిగిన కేసుల్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్దేశించినట్టుగా ప్రమాణబద్ధంగా జాగ్రత్తలతో కూడిన చికిత్సా విధానం పాటిస్తే అది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని తాజాగా జరిగిన రెండు సమావేశాల్లో భారతీయ వైద్య పరిశోధనా మండలి (.సి.ఎం.ఆర్.), అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంస్థ (...ఎం.ఎస్.) అభిప్రాయపడ్డాయి. కోవిడ్ కేసుల చికిత్సా నిర్వహణపై 10-07-2020 తేదీన వివిధ రాష్ట్రాలతో కేంద్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్.లో, అదే రోజున రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ప్రతిభా కేంద్రాల ప్రతినిధులు జరిపిన వర్చువల్ సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.

  ఒక మోస్తరుగా, తీవ్రంగా లక్షణాలున్న కేసులకు కోవిడ్ నిబంధనల ప్రకారం తగినంత ఆక్సిజన్ సదుపాయం, రక్తం గడ్డకట్టకుండా నియంత్రించే మందులు, కార్టికో స్టెరాయిడ్లు సకాలంలో సిద్ధంగా ఉంచుకోవడం కోవిడ్-19 ప్రధాన థెరపీగా పేర్కొనవచ్చు. నమోదయ్యే మొత్తం కోవిడ్ కేసుల్లో స్వల్ప లక్షణాలు ఉండే కేసులు 80శాతందాకా ఉంటాయి. ఇలాంటి కేసుల్లో రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ (HCQ) మాత్రలు ఇవ్వవచ్చని సిఫార్సు చేశారు. కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్సకోసం చేపట్టిన ప్రమాణబద్ధమైన  చికిత్సా వ్యూహం సానుకూల ఫలితాలను చూపిస్తోంది

    కోవిడ్19రోగులకు ప్రభావవంతమైన చికిత్సకోసం అనేక మందులను వాడుతున్నావాటిని ప్రధాన చికిత్సా నిర్వహణలో భాగంగా పరిగణించడంలేదు. కేవలంపరిశోధనాత్మక చికిత్సా విధానంలో భాగంగా మాత్రమే మందులను వాడుతున్నట్టు పేర్కొంటున్నారు. రోగుల్లో కొంతమందికి మాత్రమే మందులను వాడవచ్చని మందులను సిఫార్సు చేసే ముందుగా రోగితో కలసి ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని పేర్కొంటున్నారు. మందుల వినియోగానికి భారతీయ ఔషద నియంత్రణా సంస్థ ఇంకా ఆమోదం తెలపలేదు. ఏవో కొన్ని అత్యవసర కేసుల్లో మరీ పరిమిత స్థాయిలో మాత్రమే వీటి వినియోగానికి అనుమతిస్తున్నారు. అయితే, ఇలాంటి మందులను విచక్షణా  రహితంగా, వాడకూడని పరిస్థితుల్లో వాడినపక్షంలో మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని వివిధ రాష్ట్రాలను, కోవిడ్ చికిత్సా ప్రతిభా కేంద్రాలుగా గుర్తించిన వైద్యకళాశాలల ఆసుపత్రులను .సి.ఎం.ఆర్., ...ఎం.ఎస్. మరో సారి హెచ్చరించాయి.

   కరోనా చికిత్సలో వాడే, రెమ్ డెసివిర్ అనే మందు ఒక మోస్తరు లక్షణాలు, తీవ్రమైన లక్షణాల  కేసుల్లో రోగులు కోలుకునే వ్యవధిని తగ్గించే అవకాశం ఉండవచ్చని,..మరణాల రేటును తగ్గించేంత ప్రయోజనం అయితే కనిపించలేదని కూడా ఆయా రాష్ట్రాలకు సూచించాయి. మందు వినియోగంతో కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినేంత  ప్రతికూల ప్రభావం కూడా ఉందని అందువల్ల విషయంలో ఎంతో జాగ్రత్త అవసరమని సూచించాయి. అలాగే, టాసిలీజుమాబ్ అనే మందు కూడా మరణాల రేటును తగ్గించడంలో ఎలాంటి సానుకూల ఫలితాలు చూపించలేదని అధ్యయనాల ద్వారా తెలిసింది. అయితే, తీవ్రమైన లక్షణాలతో బాధపడే రోగులకు ఇది వాడిన పక్షంలో అందుకు ముందుగానే అవసరమైన అనుమతి తీసుకోవలసి ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని దెబ్బతీసేలాసైకోటీన్ల ఉప్పెనను  మందు పెంచే ప్రభావం ఉన్నందున దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్తృతంగా వాడరాదు. ఏది ఏమైనా,   సరైన వైద్య సదుపాయాల మధ్య, రోగుల పరిస్థితిపై నిశితమైన పర్యవేక్షణ ఉన్నపుడు మాత్రమే ఇలాంటిపరిశోధనాత్మక చికిత్సా విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే చికిత్సలో  సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. కరోనా చికిత్సా నిర్వహణలో ఆక్సిజన్ సదుపాయం, అవసరమైన స్టెరాయిడ్స్ వినియోగంపైనే దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని .సి.ఎం.ఆర్. ఇప్పటికే గట్టిగా సిఫార్సు చేసింది. అలాగే,.అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యపరమైన రక్షణను రోగులకు కల్పించాలని, చికిత్సలో రక్తం గడ్డకట్టకుండా నివారించే యాంటీ కోగులాంట్లను సకాలంలో, తగిన మోతాదులో వాడాలని .సి.ఎం.ఆర్. సూచించింది. రోగులకు, రోగుల కుటుంబాలు తగిన కౌన్సెలింగ్ చేయడం, వారికి అంతకు ముందే ఇతర విధాలైన అస్వస్థతఅనారోగ్యం ఏదైనా ఉంటే అందుకు అత్యున్నత ప్రమాణాలతో వైద్యపరమైన రక్షణ కల్పించడం అత్యంత ఆవశ్యకమని

 .సి.ఎం.ఆర్. సిఫార్సు చేసింది.

 

****



(Release ID: 1638032) Visitor Counter : 450