రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హైడ్రోజన్ చోదక వాహనాల భద్రతా మూల్యాంకన ప్రమాణాలపై అభిప్రాయాలకు ఆహ్వానం
Posted On:
11 JUL 2020 3:33PM by PIB Hyderabad
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ల ద్వారా నడిచే వాహనాల భద్రత కు సంబంధంచిన ప్రమాణాలను చేర్చేందుకు వీలుగా, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 లో సవరణలు ప్రతిపాదిస్తూ 2020 జూలై 10న జిఎస్ఆర్ 436(ఇ) నెంబరుతో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ ను జారీచేసింది.
కంప్రెస్‌డ్ గ్యాసెస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ లపై ఆధారపడి నడిచే ఎం, ఎన్ కేటగిరీల మోటారు వాహనాలను ఇందులో చేర్చాలని ప్రతిపాదించారు. ఇది ఎఐఎస్ 157:2020 ప్రకారం, ఎప్పటి కప్పుడు చేసే సవరణలకు అనుగుణంగా ఉండాలి. ఇందుకు సమానంగా బ్యూరొ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యాక్ట్ 2016 (11 ఆఫ్ 2016) కింద బిఐఎస్ ప్రమాణాలు ప్రకటించేంత వరకు ఇది అమలులో ఉంటుంది.
హైడ్రోజన్ ఫ్యూయల్ స్పెసిఫికేషన్లు ఫ్యూయల్ సెల్ వాహనాలకు ఐఎస్ఒ 14687 కు అనుగుణంగా ఉండాలి. ఇవి బ్యూరొ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ 2016(11 ఆఫ్ 1986 ) కింద బిఐఎస్ ప్రమాణాలు జారీ అయ్యేంతవరకు ఇవి అమలులో ఉంటాయి.
ప్రతిపాదిత సవరణలకు సంబంధించి సాధారణ ప్రజలతోపాటు, దీనితో సంబంధం ఉన్న పక్షాలందరి నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరుతున్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. వీటిని జాయింట్ సెక్రటరీ (ఎంవిఎల్), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్, ట్రాన్స్‌పోర్ట్ భవన్,పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ -110001(email: jspb-morth[at]gov[dot]in)కు 2020 ఆగస్టు 9 లోగా పంపవచ్చు.
***
(Release ID: 1637997)
Visitor Counter : 280