వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్‌లో గత సంవత్సరంతో పోలిస్తే 2.5 రెట్లు పెరిగిన పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం
- గణనీయంగా పెరిగిన నూనె గింజల సాగు విస్తీర్ణం
- పెరిగిన వరి, ముతక తృణధాన్యాలు, పత్తి పంటల సాగు
Posted On:
10 JUL 2020 9:05PM by PIB Hyderabad
కోవిడ్- 19 మహమ్మారి విస్తరిస్తున్న వేళ క్షేత్ర స్థాయిలో రైతులకు బాసటగా నిలిచేందుకు, వ్యవసాయ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు గాను భారత ప్రభుత్వపు వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ శాఖ పలు చర్యలు చేపట్టింది. దీంతో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణంలో సంతృప్తికరమైన మేటి పురోగతి కనిపిస్తోంది. వివరాలు ఈ కిందన ఇవ్వబడ్డాయి:
వేసవి పంటల సాగు విస్తీర్ణం:
వరి: వేసవిలో సుమారు 120.77 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట సాగు చేయబడింది. గత సంవత్సరం ఇదే కాలంలో వరి సాగు విస్తీర్ణం 95.73 లక్షల హెక్టార్లుగా మాత్రమే ఉంది.
పప్పుధాన్యాలు: వేసవిలో సుమారుగా 64.25 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు సాగు చేయబడ్డాయి. గత సంవత్సరం సంబంధిత కాలంలో 24.49 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోనే ఇవి సాగు చేయబడ్డాయి.
ముతక తృణధాన్యాలు: అంతకు ముందు ఏడాది 71.96 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పోలిస్తే.. ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో 93.24 లక్షల హెక్టార్లలోనే ముతక తృణధాన్యాలు సాగు చేయబడ్డాయి.
నూనెగింజలు: గత ఏడాది వేసవి పంటకాలంలో 75.27 లక్షల హెక్టార్లతో పోలిస్తే .. ఈ ఏడాది వేసవిలో 139.37 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నూనె గింజల పంటలు సాగు చేయబడ్డాయి.
చెరకు: వేసవిలో దాదాపు 50.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయంలో 50.59 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేయబడింది.
జనపనార & గోగునార: వేసవిలో 6.87 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో జనపనార & గోగునారను సాగు చేయగా.. గత ఏడాది ఇదే కాలంలో 6.82 లక్షల హెక్టార్ల మేర ఈ పంటలు సాగు చేయబడ్డాయి.
పత్తి: సుమారు 104.82 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేయబడింది. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 77.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయబడింది.
పంటల సాగు వివరాలకు సంబంధించిన లింక్..
(Release ID: 1637964)
Visitor Counter : 301