రైల్వే మంత్రిత్వ శాఖ

2020-21 విద్యా సంవత్సరానికి గారు ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రక్రియను ప్రకటించిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్ ఇనిస్టిట్యూట్

· ఈ సంస్థలో అందిస్తున్న మొత్తం 10 కార్యక్రమాల్లో 8 కొత్తవి.

· వీటిలో చాలా వరకూ ఎన్.ఆర్.టి.ఐ.లో ప్రత్యేకంగా అందించే విలక్షణ కార్యక్రమాలు

· బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయ సహకారంతో రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ

· బి.బి.ఏ, బి.ఎస్.సి సహా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాల దరఖాస్తుకు చివరి తేదీ జులై 31.

· బి.టెక్. ప్రవేశాలు జె.ఈ.ఈ. ప్రధాన స్కోరు మీద ఆధారపడి ఉంటాయి. దరఖాస్తు చివరి తేదీ 2020 సెప్టెంబర్ 14.

· విద్యార్థులు మరిన్ని వివరాలను www.nrti.edu.in వెబ్ సైట్ లో పొందవచ్చు.

· కోవిడ్ 19 దృష్ట్యా నాణ్యమైన ఆన్ లైన్ కోర్సులు మరియు సమ్మర్ ఇంటర్న్ షిప్ బోధనలను పెంచిన ఎన్.ఆర్.టి.ఐ.

· మరింత అభివృద్ధి దిశగా ఎన్.ఏ.ఐ.ఆర్. క్యాంపస్ లో నూతన మౌలిక సదుపాయాల అభివృద్ధి

Posted On: 10 JUL 2020 3:55PM by PIB Hyderabad

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న వడోదరలోని నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్ ఇనిస్టిట్యూట్ (ఎన్.ఆర్.టి.ఐ) 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ప్రకటించింది. మూడేళ్ళుగా వివిధ కోర్సులు అందిస్తున్న ఈ విశ్వవిద్యాలయం, దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలబడే దిశగా గణనీయమైన పురోగతిని సాధించింది. ఇది భారత రవాణా రంగ వృద్ధి మరియు సానుకూల మార్పులకు మరింత శక్తిని అందించింది.

ఎన్.ఆర్.టి.ఐ. విద్యార్థుల కోసం ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీ మరియు ట్రాన్స్ పోర్టేషన్ మేనేజ్ మెంట్ లో బి.ఎస్.సి. మరియు బి.బి.ఏ. ప్రోగ్రామ్ లను, అదే విధంగా రెండు నూతన బి.టెక్ కార్యక్రమాలను, రెండు నూతన ఎం.బి.ఏ, కార్యక్రమాలు, నాలుగు కొత్త ఎం.ఎస్.సి. కార్యక్రమాలను అందిస్తోంది. వీటిలో చాలా వరకూ ఎన్.ఆర్.టి.ఐ.లో ప్రత్యేకంగా అందించే కార్యక్రమాలు. రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ మరియు ఇంటిగ్రేషన్ లో అంతర్జాతీయ స్థాయి మాస్టర్స్ కార్యక్రమాన్ని కూడా అందిస్తోంది. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయ సహకారంతో అందిస్తున్న ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు ఒక ఏడాది అక్కడ అభ్యాసం చేయవలసి ఉంటుంది.  

బి.బి.ఏ, బి.ఎస్.సి. మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాల దరఖాస్తుకు చివరి తేది 2020 జులై 31 కాగా, దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష 2020 ఆగష్టు 23న దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో జరుగుతుంది.

బి.టెక్. ప్రవేశాలు జె.ఈ.ఈ. మెయన్స్ స్కోరు మీద ఆధారపడి ఉంటాయి. దరఖాస్తుకు చివరి తేదీ 2020 సెప్టెంబర్ 14.

విద్యార్థులు మరిన్ని వివరాలను www.nrti.edu.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే అంగీకరించటం జరుగుతుంది.

 

కోవిడ్ 19 నేపథ్యంలో నాణ్యమైన ఆన్ లైన్ కోర్సులు మరియు సమ్మర్ ఇంటర్న్ షిప్ లతో బోధనను మరింత అభివృద్ధి చేసిన ఎన్.ఆర్.టి.ఐ.

·        అన్ని కార్యక్రమాలు మరియు బ్యాచ్ ల కోసం కోర్సుల అధ్యాపకులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూ, భద్రతలో రాజీ లేకుండా తరగతులను పూర్తి చేస్తున్నారు.

·        తరగతులకు అనుబంధంగా విద్యార్థుల కోసం ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి 4,000 ఆన్ లైన్ కోర్సుల లైబ్రరీకి ఉచిత ప్రవేశం కల్పించటం జరిగింది. వీటిలో డేటా సైన్స్, మైక్రో ఎకనామిక్ ప్రిన్సిపల్స్ మరియు అండర్ స్టాండింగ్ రీసెర్చ్ మెథడ్స్ కోర్సులు ఉన్నాయి.

·        ఎన్.ఆర్.టి.ఐ. విద్యార్థులకు విశ్వవిద్యాలయం నుంచి డిజిటల్ సర్టిఫికేట్స్ తో పాటు ఎన్.ఆర్.టి.ఐ. క్రెడిట్స్ ను అందజేస్తారు.

·        రవాణా రంగంలో ప్రముఖ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలతో రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం 6 వారాల ఆన్ లైన్ పరిశ్రమ ఇంటర్న్ షిప్ ల ఏర్పాటు జరిగింది.

మరింత అభివృద్ధి దిశగా ఎన్.ఏ.ఐ.ఆర్. క్యాంపస్ లో నూతన మౌలిక సదుపాయాల కల్పన

·        ఎన్.ఏ.ఐ.ఆర్. యొక్క 55 ఎకరాల ప్రాంగణం కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. త్వరలోనే నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.

·        క్యాంపస్ లో 5000 మంది విద్యార్థులు చదువుకునేందుకు అదే విధంగా 2000 మంది నివాసం కోసం సామర్థ్యం ఉండనుంది.

·        తరగతి గదులు, ప్రయోగ శాలలు, సెమినార్ హాళ్ళు, ఫ్యాకల్టీ ఛాంబర్లు, నిర్వాహక కార్యాలయాలు, 400 మంది సామర్థ్యం కలిగిన ఆడిటోరియం మరియు ఒక మోడల్ గదితో కూడిన అకాడమిక్ బ్లాక్ ఏర్పాటు.

·        నివాస వసతి, 550 సామర్థ్యం గల వ్యాయామ శాలలు, కార్యాచరణ గదులు, లాండరెట్స్ వంటి సౌకర్యాలు కలిగి 3 టవర్లలో విస్తరించిన భవనాలు.

·        బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్టులు, బిలియర్డ్స్ మరియు ఇండోర్ స్పోర్ట్స్ రూమ్ తో పాటు టెన్నిస్ కోర్టు, దాని పైకప్పుతో సెంట్రల్ ప్రాంగణం చుట్టూ రూపొందించిన నూతన క్రీడా భవనం.

·        నూతనంగా నిర్మించబోతున్న అన్ని భవనాలు వారసత్వానికి తగన ప్రాముఖ్యతను ఇస్తాయి. ఇప్పటికే ఉన్న చెట్లు, జంతువులకు ఎలాంటి హానీ కలగకుండా తక్కువ భూమిని వినియోగించటం, పగలంతా క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూడటం వంటి హరిత భవన నిబంధనలు పాటించటం జరుగుతోంది.

నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్ ఇనిస్టిట్యూట్ (ఎన్.ఆర్.టి.ఐ)లో మొత్తం 10 కార్యక్రమాలు అందించటం జరుగుతోంది (వీటిలో 8 కొత్తవి). కార్యక్రమాలు వివరాలు...

అండర్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలు :

1.   రవాణా నిర్వహణలో బి.బి.ఏ (3 సంవత్సరాలు)

2.   ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీలో బి.ఎస్.సి (3 సంవత్సరాలు)

3.   రైల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇంజనీరింగ్ లో బి.టెక్ (4 సంవత్సరాలు)

4.   రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బి.టెక్ (4 సంవత్సరాలు)

పోస్ట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలు (2 సంవత్సరాలు):

1.   రవాణా నిర్వహణలో ఎం.బి.ఏ.

2.   సరఫరా గొలుసు నిర్వహణలో ఎం.బి.ఏ.

3.   ట్రాన్స్ పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీలో ఎం.ఎస్.సి.

4.   ట్రాన్స్ పోర్ట్ ఎకనామిక్స్ లో ఎం.ఎస్.సి.

5.   రవాణా సమాచార వ్యవస్థలు మరియు విశ్లేషనలో ఎం.ఎస్.సి.

6.   రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ మరియు ఇంటిగ్రేషన్ లో ఎం.ఎస్. (బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం, బ్రిటన్ సహకారంతో అందించే అంతర్జాతీయ డిగ్రీ కార్యక్రమం)

కార్యక్రమాల ఎంపిక ప్రక్రియ:

·        దేశ వ్యాప్తంగా పలు చోట్లు ఎన్.ఆర్.టి.ఐ. యూజీ మరియు పీజీ ప్రవేశ పరీక్షలు (ఆప్టిట్యూడ్ కోసం) నిర్వహంచటం జరుగుతుంది.

·        ఎన్.ఆర్.టి.ఐ. యూజీ ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా బి.బి.ఏ, బి.ఎస్.సి. కార్యక్రమాలకు ఎంపిక జరుగుతుంది.

·        జె.ఈ.ఈ. మెయిన్స్ 2020లో స్కోరు ఆధారంగా బి.టెక్ ఎంపిక కార్యక్రమం ఉంటుంది.

·        ఎన్.ఆర్.టి.ఐ. పీజీ ప్రవేశ పరీక్ష ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన దరఖాస్తు దారులు ఎం.ఎస్.సి. ప్రోగ్రామ్ ల కోసం సబ్జెక్ట్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల కోసం హాజరు కావాలి. మొత్తం ఫలితాల ఆధారంగా ప్రవేశం ఇవ్వటం జరుగుతుంది.

·        చెల్లుబాటు అయ్యే క్యాట్ (2019), ఎక్సాట్ (2020) లేదా మ్యాట్ (మే 2019 తర్వాత) స్కోర్ లు కలిగిన ఎం.బి.ఏ. ప్రోగ్రామ్స్ దరఖాస్తు దారులు పి.జి. ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు పొందవచ్చు. దరఖాస్తు దారులు ఎన్.ఆర్.టి.ఐ. పి.జి. ప్రవేశ పరీక్షలో వారి స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ లేదా పైన పేర్కొన్న విధంగా క్యాట్ / ఎక్సాట్ / మాట్ వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. మొత్తం ఫలితాల ఆధారంగా ప్రవేశం ఇవ్వటం జరుగుతుంది.

·        రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ మరియు ఇంటిగ్రేషన్ లో మాస్టర్స్ కు ఎంపికను బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం మరియు ఎన్.ఆర్.టి.ఐ. సంయుక్తంగా నిర్వహిస్తుంది.

కార్యక్రమాల్లో చేరేందుకు దరఖాస్తు విధానం :

·        దరఖాస్తులను ఎన్.ఆర్.టి.ఐ. వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో సమర్పించాలి. జనరల్, ఈ.డబ్ల్యూ.ఎస్, ఓ.బి.సి. అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 500 రూపాయలు మరియు ఎస్.సి, ఎస్.టి. పి.డబ్ల్యూ.డి. అభ్యర్థులకు 250 రూపాయలు.

·        ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ నింపేందుకు, దరఖాస్తు రుసుము చెల్లించేందుకు www.nrti.edu.in/data/applications.html ద్వారా నమోదు చేసుకోవచ్చు.

·         

రిజర్వేషన్:

ఎస్.సి. ఎస్టీ, ఓబీసీ మరియు ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్లకు సంబంధించి ఎన్.ఆర్.టి.ఐ. భారత ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తుంది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పి.డబ్ల్యూ.డి, కాశ్మీరీ వలస దారులు మరియు మాజీ సైనికులకు సూపర్ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఫీజులు, ఆర్థిక సహాయం మొదలైన వివరాలు ఎన్.ఆర్.టి.ఐ. వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.



(Release ID: 1637963) Visitor Counter : 162