వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు ఆత్మ నిర్భర్ భారత్ కింద మిగిలిన ఆహార ధాన్యాల పంపిణీ ఆగస్టు చివరిలోగా పూర్తి చేయాలి
వచ్చే జనవరిలోగా మిగిలిన రాష్ట్రాలనూ ఒక దేశం-ఒక రేషన్ కార్డు కిందికి తెచ్చే ప్రయత్నం: రామ్ విలాస్ పాశ్వాన్
Posted On:
09 JUL 2020 6:54PM by PIB Hyderabad
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పురోగతి గురించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖామంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈ రోజు వీడియో కాన్ఫరెస్న్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ను నవంబర్ దాకా ఐదు నెలలపాటు పొడిగించాలన్న ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు. నిరుపేదలకోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే రెండు అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారని, దీనివలన ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో ఎవరూ ఆకలితో నిద్రపోయే పరిస్థితే రాదన్నారు.ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద కేటాయిమ్చిన మిగిలిన ఆహార ధాన్యాలను పంపిణీ చేయటానికి ఆగస్టు 31 వరకు అదనపు సమయం కేటాయించిన కాబినెట్ నిర్ణయాన్ని కూడా పాశ్వాన్ మీడియాకు తెలియజేశారు. దేశంలో ఆర్హిక సమస్య కారణంగా కోవిడ్ బారిన పడిన నిరుపేదల ఆహార అవసరాలను ఈ రెండు పథకాలూ తీర్చగలవన్నారు.
వలస కార్మికులకు ఆహార ధాన్యాల పంపిణీ: (ఆత్మ నిర్భర్ భారత్ పాకేజ్)
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించటం గురించి చెబుతూ, ఈ పథకాన్ని ఈ ఏడాది మే 15న ప్రారంభించిన సంగతి గుర్తు చేశారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించటానికి కొంత సమయం పట్టిందన్నారు. అందుకే ఇప్పటికీ తీసుకువెళ్ళిన ధాన్యాల పంపిణీకి గాను రాష్ట్రాలకు అదనపు సమయం ఇచ్చామన్నారు. ఇప్పుడిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుమిగిలిన ఆహార ధాన్యాల పంపిణీని ఆగస్టు 31 లోగా పంపిణీ చేసేందుకు అవకాశం కలిగిందన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ పాకేజ్ కింద వలస కార్మికులలో ఒక్కో వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యం, ఒక్కో కుటుంబానికి 1 కిలో చొప్పున పప్పు దినుసులు పంపిణీ జరుగుతాయన్నారు. ఎన్ ఎఫ్ ఎస్ ఎ లేదా ప్రజా పంపిణీ కార్డుల కిందికి రాని కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో మేలు చేస్తుందని చెప్పారు.
ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 6.39 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు తీసుకున్నాయని, వాటిలో ఇప్పటివరకు మే నెలలో 2.24 కోట్లమంది లబ్ధిదారులకు, జూన్ నెలలో 2.25 కోట్ల మంది లబ్ధిదారులకు మొత్తం 2,32,433 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపిణీ చేశాయన్నారు. అదే విధంగా 33,620 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించగా ఇప్పటికే 32,968 మెట్రిక్ టన్నులు తీసుకున్నాయని వాటిలో 10,645 మెట్రిక్ టన్నుల పంపిణీ పూర్తయిందని మంత్రి పాశ్వాన్ వెల్లడించారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన-1:
ఆహార ధాన్యాలు ( బియ్యం. గోధుమలు)
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏప్రిల్ నెలలో మొత్తం 116.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నాయని, అందులో 37.43 లక్షల మెట్రిక్ టన్నులు (94 %) ఏప్రిల్ లో 74.14 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా మే నెలలో 73.75 కోట్ల లబ్ధిదారులకు న్ 37.41 లక్షల మెట్రిక్ టన్నులు (94%), జూన్ నెలలో 64.42 కోట్లమంది లబ్ధిదారులకు 32.44 లక్షల మెట్రిక్ టన్నుల ( 82%) ఆహార ధాన్యాలను పంపిణీ చేశాయన్నారు.
పప్పుధాన్యాలు
ఇక పప్పు ధాన్యాల విషయానికొస్తే ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 5.83 లక్షల టన్నులు పంపగా వాటిలో 5.72 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రాలకు చేరాయని, అందులో 4.66 లక్షల మెట్రిక టన్నుల పప్పు ధాన్యాల పంపిణీ పూర్తయిందని చెప్పారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన - 2:
ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభాన్ని, నిరుపేదలకు నిరాటంకంగా అందాల్సిన సాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన మరో ఐదు నెలలపాటు, అంటే నవంబర్ చివరి దాకా పొడిగించారన్నారు. కేటాయింపు ఉత్తర్వులను జులై 8 నాడే రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, భారత ఆహార సంస్థకు జారీ చేశామని మంత్రి పాశ్వాన్ చెప్పారు. దీనివలన ఒక్కో వ్యక్తికి నెలకు అదనంగా మరో ఐదు కిలోల ఆహార ధాన్యాలు ( బియ్యం. గోధుమలు) చొప్పున జులై-నవంబర్ మధ్య కాలంలో కూడా అందుతాయి. ఆ విధంగా 80.43 కోట్ల మంది ఎన్ ఎఫ్ ఎస్ ఎ లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారు. వారిలో చండీగఢ్, పుదుచేరి, దాద్రా నాగర్ హవేలి లో డిబిటి నగదు బదలీ పథకం కింద లబ్ధి పొందిన వారు కూడా ఉంటారు. మొత్తం 203 లక్షల కోట్ల ఆహార ధాన్యాలను 81 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన - 2 కింద రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 201.1 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను జులై-నవంబర్ మధ్య ఐదు నెలల కాలానికి కేటాయించినట్లు మంత్రి చెప్పారు. వాటిలో 91.14 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 109.94 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి. నాలుగు రాష్ట్రాలకు గోధుమలు కేటాయించగా, బియ్యం 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ పథకం కింద పంపిణీ చేశారు.
మొత్తం ఆహార ధాన్యాల స్టాక్
జులై 8 నాడు భారత్ ఆహార సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ సంస్థ దగ్గర ప్రస్తుతం 267.29 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 545.22 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు ఉన్నాయి. దీంతో మొత్తం 812.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉన్నట్టయింది. ఇందులో ప్రస్తుతం జరుగుతున్న ధాన్యం కొనుగోళ్ళు చేర్చలేదు. అవి ఇంకా గోదాములకు చేరాల్సి ఉంది. ఎన్ ఎఫ్ ఎస్ ఎ తదితర సంక్షేమ పథకాలకింద 55 లక్షల మెట్రిక టన్నుల ధాన్యం అవసరముంది.
లాక్ డౌన్ విధించినప్పటినుంచీ 4999 రైలు బోగీల ద్వారా 139.97 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల రవాణా జరిగింది. 2020 జులై 1 నుంచి 7.78 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను 278 బోగీల ద్వారా రవాణా రవాణా చేశారు. రైలు మార్గంతోబాటే రోడ్డు, జల మార్గాలలోనూ రవాణా జరిగింది. ఆ విధంగా జులై 1 నుంచి 11.09 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రవాణా జరగగా, 0.28 లక్షల మెట్రిక్ టన్నులు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాయి.
ఆహార ధాన్యాల సేకరణ :
జులై 8నాటికి మొత్తం 389.45 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 748.55 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించారు
ఒక దేశం - ఒక రేషన్ కార్డ్ :
ఒక దేశం - ఒక రేషన్ కార్డుకిందికి మిగిలిన రాష్ట్రాలను సైతం వచ్చే జనవరి లోగా తీసుకు రావటానికి తమ మంత్రిత్వశాఖ కృషి చేస్తున్నట్టు శ్రీ పాశ్వాన్ చెప్పారు. నెట్ వర్కింగ్ కనెక్టివిటీ చాలా నిదానంగా ఉన్నట్టు గతంలో అనేక రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయని, ఈ సమస్యను టెలికామ్ విభాగానికి తెలియజేశామని కూడా చెప్పారు. ఏడాది కాలంలో ప్రతి గ్రామ పంచాయితీకి ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే ప్రతిపాదన ఉందని అన్నారు.
***
(Release ID: 1637796)
Visitor Counter : 307