రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మూడు దేశాల రాయబారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ నియామక పత్రాలను అందజేశారు


Posted On: 08 JUL 2020 10:30PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి, శ్రీ రాంనాథ్ కోవింద్ ఈ రోజు న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్ డమ్  మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలకు చెందిన మిషన్ అధిపతుల నుండి నియామక పత్రాలను స్వీకరించారు.  కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌లో ఈ విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను స్వీకరించడం ఇది రెండోసారి.

 

తమ నియామక పత్రాలను సమర్పించిన ఆయా దేశాల రాయబార కార్యాలయ అధిపతులు :

 

1.       గౌరవనీయులు శ్రీ డేవిడ్ పైన్, న్యూజిలాండ్ హైకమీషనర్,

 

2.       గౌరవనీయులు శ్రీ ఫిలిప్ బార్టన్, యునైటెడ్ కింగ్ డమ్

 

3.       గౌరవనీయులు శ్రీ అఖాతోవ్ దిల్షోద్ ఖామిడోవిచ్, ఉజ్బెకిస్తాన్ రాయబారి.

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూవారి నియామకంపై రాయబారులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మూడు దేశాలతో భారతదేశానికి చాలా బలమైన సంబంధాలు ఉన్నాయనీ, కీలకమైన ప్రపంచ సమస్యలపై ఆయా దేశాలతో ఉమ్మడి దృక్పథాన్ని పంచుకోవడం విశేషమని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం ఈ సమయంలో చాలా అవసరమని రాష్ట్రపతి పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో, కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలలో భారతదేశం ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు దేశాలతో భారతదేశానికి ఉన్న సత్సంబంధాలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆనందం వ్యక్తం చేశారు. 2021-22 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యదేశంగా, ప్రపంచ శాంతి, శ్రేయస్సును బలోపేతం చేయడానికి అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి భారతదేశం ఎదురు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 

****


(Release ID: 1637533) Visitor Counter : 276