ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మహమ్మారి మనల్ని నిరోధించే అవకాశం ఇవ్వం : కోవిడ్-19 నేపథ్యంలో స్వీడిష్ ఆర్థిక మంత్రి తో ద్వైపాక్షిక ఆరోగ్య సహకారంపై చర్చించిన డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 07 JUL 2020 5:12PM by PIB Hyderabad

ఆరోగ్యం, ఔషధ రంగంలో సహకారం గురించి స్వీడన్ ఆరోగ్య, సామాజిక వ్యవహారాల మంత్రి శ్రీమతి లీనా హాలెన్‌గ్రెన్- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్‌ డిజిటల్ మాధ్యమంలో సమావేశమయ్యారు. రెండు దేశాల్లో కోవిడ్-19ని నిలువరించే చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరు ఆరోగ్య మంత్రులు సమాలోచనలు జరిపారు. డబ్ల్యూహెచ్ ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డాక్టర్ హర్ష వర్ధన్ కి  శ్రీమతి లీనా హాలెన్‌గ్రెన్ అభినందనలు తెలియజేసారు. అత్యధిక స్థాయిలో రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ, సకాలంలో చికిత్సను అందించేలా చర్యలు తీసుకుంటున్న భారత్ ను ఆమె ప్రశంసించారు.

ఇండో-స్వీడిష్ దశాబ్ద కాలపు గట్టి భాగస్వామ్య బంధం గురించి  డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడారు.  ఇది ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ స్థాయిలో పది ద్వైపాక్షిక సమావేశాలను చూసిందని అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ యోజన 550 మిలియన్ల ప్రజలను కలిగి ఉంది, తల్లి, శిశు మరణాలు తగ్గాయి, టిబిని తొలగించే లక్ష్యంతో భారతదేశం భారీ ఎత్తున అడుగులు వేసింది. 2025 సంవత్సరం, భారతదేశం డిజిటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఐటిని అనుసంధానిస్తుందని హామీ ఇచ్చింది అని డాక్టర్ హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. యాంటీబయాటిక్ నిరోధకతపై అందరికీ మార్గదర్శకంగా ఉండాలని పరిశోధనలు చేపట్టిందని ఆయన అన్నారు.

COVID-19 మహమ్మారిని నిర్వహించేటప్పుడు భారతదేశం పలు పాఠాలు నేర్చుకుందని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశం రికవరీ రేటు 61% కంటే ఎక్కువ, 1.35 బిలియన్ల దేశంగా ఉన్నప్పటికీ 2.78% కంటే తక్కువ మరణాలు ఉన్నాయి. ప్రతిరోజూ 2.5 లక్షల మందిని పరీక్షిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఒకే ల్యాబ్ నుండి ఇపుడు COVID-19 ను నిర్ధారించడానికి దేశంలో 1100 కంటే ఎక్కువ ప్రయోగశాలలు ఉన్నాయిఅని డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు. "భారతదేశం అనుకూల-క్రియాశీల, ముందస్తు, శ్రేణి విధానం అనే వ్యూహాలు భారత్ లో మంచి ఫలితాలు చూపుతున్నాయని అన్నారు. ప్రభుత్వం సమీకరించిన మూడు అంచెల కోవిడ్ ఆరోగ్య మౌలిక సదుపాయాలలో ఏ సమయంలోనైనా సమతల గ్రాఫ్, ఖాళీ పడకలను నిర్ధారిస్తుంది" అని ఆయన చెప్పారు.

నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తిని భారత్ ఒక అవకాశంగా తీసుకుందని డాక్టర్ హర్ష వర్ధన్ చెప్పారు. ఒక దార్శనికత కలిగిన మా ప్రధాన మంత్రి ఆలోచనల వల్ల ఇది సాధ్యమైంది. అలాగే మొత్తం ప్రభుత్వంలోని అన్ని విభాగాలు వారి స్థాయిలో అనుసరించిన విధానాలు దానికి తోడయ్యాయి. ఈ విలక్షణమైన వ్యాధికారకముపై చైనా ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన ఒక రోజు తరువాత, అంటే  జనవరి 8 నుండి సముద్రం, ల్యాండ్ పోర్టులు, విమానాశ్రయాలలో ప్రవేశ నిఘా పెడుతూ ప్రభుత్వం వివిధ శాఖలతో సమన్వయం చేసింది. ఇది తన సామజిక నిఘాను బలోపేతం చేసింది, వివరణాత్మక ఆరోగ్య, ప్రయాణ సలహాలను జారీ చేసింది. వేలాది మంది పౌరులను, విదేశీ పౌరులను కూడా ఖాళీ చేయించింది. భారతదేశం ఇప్పుడు రోజుకు 5 లక్షల పిపిఇలను తయారుచేసే 100 కి పైగా పిపిఇ తయారీ యూనిట్లను కలిగి ఉంది. అదేవిధంగా ఎన్ 95 మాస్క్‌లు, వెంటిలేటర్ల ఉత్పత్తిని కూడా పెంచింది. భారతదేశం 100 కి పైగా దేశాలకు హైడ్రోక్లోరోక్సిక్విన్‌ను సరఫరా చేసింది" అని డాక్టర్ హర్ష్ వర్ధన్  స్వీడిష్ మంత్రికి  వివరించారు.

త్వరలో  జాయింట్ వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశాన్ని నిర్వహించడానికి, సంక్షోభం ముగిసే వరకు డిజిటల్‌గా రెండు దేశాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడానికి మంత్రులు ఇద్దరూ అంగీకరించారు. సమావేశంలో చర్చించిన విషయాలను అనుసరించాలని వారు ఆయా మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.

****(Release ID: 1637053) Visitor Counter : 200